పద్మభూషణ్ అవార్డు గ్రహీత అల్కా యాగ్నిక్ నాలుగు దశాబ్దాలుగా నేపధ్య గాయనిగా హిందీ గుజరాతి,మణిపురీ,ఒరిస్సా,నేపాలి,రాజస్థానీ వంటి దాదాపు పాతిక భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో పాటలు పాడారు .1966 లో కోల్కతాలో జన్మించిన అల్క తల్లి శుభ భారతీయ శాస్త్రీయ సంగీత గాయకురాలు. తల్లి దగ్గరే పాట నేర్చుకున్న అల్కా ఆరో ఏటనే ఆల్ ఇండియా రేడియోలో పాడారు. ఆ తరువాత ఆమెకు చిత్ర సీమలో పడే అవకాశాలు వచ్చాయి. షిల్లాంగ్ కి చెందిన వ్యాపారవేత్త నీరజ్ కపూర్ ని పెళ్లి చేసుకున్నారు అల్కా. గాయనిగా ఎన్నో అవార్డులు పొందిన అల్కా యాగ్నిక్ ప్రఖ్యాత గాయకులు లతా,ఆశాభోంస్లే కంటే ఎక్కువ పాటలు పాడారు.