ఛత్తీ్సగఢ్ రాష్ట్రం రాజ్‌నంద్‌గావ్ జిల్లా డోంగర్‌గఢ్ ప్రాంతం గట్ ప్రాంతానికి చెందిన శాంతి విశ్వకర్మను డ్రోన్ దీదీ అంటారు. డిగ్రీ పూర్తి చేసిన శాంతి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నమో డ్రోన్ దీదీ ప్రోగ్రామ్ కు ఎంపికై గ్వాలియర్ లో శిక్షణ తీసుకున్నారు .డ్రోన్ పైలెట్ అయ్యారు. డ్రోన్ వినియోగం లో వచ్చిన నైపుణ్యంతో ఆమె వందలాది మంది మహిళలకు డ్రోన్ శిక్షణ ఇచ్చారు . డ్రోన్ల ద్వారా రైతుల పొలాల్లో ఎరువులు పురుగు మందులు చల్లుతూ నెలకు వేల పైన సంపాదిస్తున్నారు ఈ మహిళలు. అందుకే ఈమెను ఎంతో ప్రేమతో డ్రోన్ దీదీ అంటారు.














