తిడితే 500 ఫైన్

తిడితే 500 ఫైన్

తిడితే 500 ఫైన్

మహారాష్ట్ర లోని కోల్ గావ్ గ్రామంలో ఎవరైనా తగవు లో ఆడవాళ్ళ పేరు ఉపయోగిస్తూ తిడితే అక్కడ 500 జరిమానా కట్టాల్సిందే. ఆ గ్రామ జనాభా 9000 వ్యవసాయ ఆధారిత కుటుంబాలు మహిళలు అందరికీ ఒక గ్రామ సభ నడుస్తుంది. ఆ సభలో ఎవరైనా ఆడవాళ్లను అమ్మ, అక్క అంటూ తిడితే జరిమానా కట్టాలి అని తేల్చారు ఆడవాళ్లు. అలాగే పరిసరాలు శుభ్రంగా ఉంచాలని,ఇంకో నియమం. వీధుల్లో చెత్త వేస్తే జరిమానా. అలాగే ఏడు, ఎనిమిది దాటితే పిల్లలు చదువులకు ఆటంకం లేకుండా టీవీ మొబైల్ లకు దూరంగా ఉండాలని నియమాలు ఉన్నాయి. ఆ చిన్న పల్లెలో ఇట్లా వసూలు చేసిన జరిమానాలతో గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేస్తారట. ఆ చిన్న పల్లె తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.