Sunday, 28 Jun, 2026

ఈజీగా కిచెన్ గార్డెన్ 

వంటగది దగ్గర చిన్న జాగా ఉన్న ట్రే గార్డెన్ లో పెంచుకోవచ్చు.ట్రే గార్డెన్ కోసం ప్రత్యేకంగా అడుగున చిల్లులు ఉన్నా ట్రే దొరుకుతాయి.వాటిలో సారవంతమైన మట్టి నింపి వాటిలో ధనియాలు, మెంతులు చల్లాలి ఇవి నాలుగైదు రోజుల లోపే మొలకలు వస్తాయి. వారం పది రోజుల్లో  చిన్న ఆకులు వస్తాయి దశలవారీగా రెండు ట్రే లలో గింజలు చల్లి రెండు రోజులకోసారి తాజా కొత్తిమీర మెంతికూర వాడుకోవచ్చు.అలాగే ట్రే లో టమోటో  మిర్చి వంటి గింజలు చల్లి […]

వేలాడే తోట

భూపాల్ కు చెందిన సాక్షి భరధ్వాజ్ ఇంటి పైన వేలాడే తోటను ఏర్పాటు చేసింది మైక్రో బయాలజీ పూర్తి చేసి మన్ సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసే సాక్షి కొబ్బరి బోండాలను కడిగి ఎండబెట్టి వాటికి చక్కని రంగులు వేసి వాటికి రెండు రంద్రాలు చేసి ఇనుప తీగలతో హుక్స్ లా డాబాపై వేలాడ దీసింది. ఆకులతో వర్మీ కంపోస్ట్ తయారు చేసి అందులో మొక్కలు నాటింది.  ఈ ఇంటి […]

గాలిలో గడ్డ కట్టేశాయి

ఈ చలి తయారు చేసిన రెండు బొమ్మలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సైబేరియా లోని నావొసిబ్రిస్క్ లో ఉష్ణోగ్రత చాలా రోజుల పాటు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ కి అటూ ఇటుగా ఉంటుంది. గాలి ఆర్కిటిక్ లో కన్నా చల్లగా ఉంటుంది ఆ పరిస్థితి ఏదైనా చేతిలో ఉండగానే గడ్డ కట్టేస్తుంది. ఒలెగ్ అనే స్థానికుడు గుడ్డు పగలకొడితే అది ప్లేట్లో కారే లోపలే గడ్డ కట్టింది. అలాగే వేడివేడి నూడుల్స్ తిందామని ఫోర్క్ తో […]

ప్రారంభోత్సవాలు రచయిత్రి అమందా 

22 సంవత్సరాల అమందా కవియత్రి. యు.ఎస్.లో ఉంటుంది అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెకు ఆహ్వానం అందింది. 2011లోనే లాస్ ఏంజలెస్ లో అతి పిన్న వయస్కురాలైన ప్రారంభోత్సవాలు కవిత్రి గా గుర్తింపు తెచ్చుకుంది. 2014లో నేషనల్ యూత్ పోయెట్ లారెట్ అయ్యింది. ఒక ప్రత్యేకమైన థీమ్ తో  ప్రారంభోత్సవాలు కవిత్వం రాస్తుంది. అమందా. పోయిన సంవత్సరం అమెరికా స్వాతంత్ర దినోత్సవం కూడా ఆమె కవిత్వం తోనే ప్రారంభం అయింది. ఇప్పుడు బైడెన  ప్రమాణస్వీకారానికి అమందా […]

గుండె ఆరోగ్యానికి ఇవి అవసరం

క్యారెట్లు కళ్ళకే కాదు గుండెకు కూడా మంచివి. క్యారెట్ లలోని బీటా కెరోటిన్ శరీరంలో కి చేరాక విటమిన్ ఎ గా మారుతుంది. ఈ విటమిన్ ఎ, రక్తంలో చెడు కొవ్వులు పెరగకుండా హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. అయితే గుండె ఆరోగ్యం లో బీటా-కెరోటిన్ లా పాత్ర అంశం పై చేసిన అధ్యయనంలో క్యారెట్ లోని బీటా కెరోటిన్ ని విటమిన్ ఎ, గా త్వరగా మారాలంటే క్యారెట్ తో పాటు పాలు […]

ఇప్పటి వరకు ప్లాన్లే లేవు

మెయిల్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కావటం వాళ్ళ మెప్పు పొందటం అంతా ఏదో కలలాగా ఉంది.చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పాటలు అన్నీ ఇష్టమే. టీవీ షో బేబీ సింగర్ 2 లో విజేతగా నిలిచాను. మా కాలేజి మిస్ హైదరాబాద్ కాంటెస్ట్ స్టాల్ లో విజేతగా వచ్చాను.అక్కడ నుంచి మోడలింగ్ యాక్టింగ్ అవకాశాలు వస్తున్నాయి. ఓ టీ టీ లో సినిమా సక్సెస్ ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా అంటుంది గౌరీ ప్రియ రెడ్డి.మెయిల్ సినిమాలో ఒక్కసారిగా […]

సక్సెస్ ఫుల్ గా నమ్మ కేఫ్

స్విట్జర్లాండ్ లో హోటల్ మేనేజ్ మెంట్ చదువుకొంది తమిళనాడు కు చెందిన దమయంతి.భారతీయలు ఇష్టపడే టీ ని నమ్మ కేఫ్ పేరుతో చెన్నయ్ లో దుకాణాలు తెరచి మార్కేట్ చేస్తోంది. పుదుచ్చేరి,కోయంబత్తూర్,చెన్నయ్ లలో కూడా ఈ కేఫ్ లో గోల్డెన్ సులేమాన్, పసుపుతో చేసిన ఎల్లో టీ తో సహా ఎనిమిది రకాల టీ లు ఉంటాయి 40 రూపాయల లోపే ఉంటుంది ఖరీదు. దమయంతి తల్లి నిర్వహిస్తున్న నేచురల్ సెలూన్ లని కూడా మహిళలే నడిపిస్తున్నారు. […]

రోహిణీ గాడ్బోలే

న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ పార్టికల్‌ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు రోహిణీ గాడ్బోలే. అంతకంటే ముందు 1982లో ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా పనిచేశారు. 1995 లో బెంగళూరులోని ఐ.ఐ.ఎస్సీ.లో అసోసియేట్‌ గా చేరారు. ఇప్పుడు అక్కడే ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు వందకు పైగా అధ్యయన పత్రాలు సమర్పించారు. ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ తో గౌరవించింది.

కేరళ తొలి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్

కేరళ లో తొలి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్ డాక్టర్ ప్రియా. ఆమె పుట్టినప్పటి పేరు జిను శశిధరన్. కేరళలోని త్రిసూర్ ఆమెది. 2013లో బెచిలర్ ఆఫ్ ఆయుర్వేద చేశారు. 2018 లో ఆయుర్వేదంలో ఎండీ పూర్తిచేసి త్రిసూర్ లో హాస్పిటల్లో పని చేయటం మొదలు పెట్టారు. అవసరమైన ఆరు సర్జరీల తర్వాత డాక్టర్ ప్రియా గా వైద్య వృత్తి కొనసాగిస్తున్నారు.

హెయిర్ కేర్ టిప్స్

చలికాలంలో మాడుపైన పొడిబారకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలతో సంరక్షణ చేసుకోవచ్చు. చిన్న అల్లం ముక్క నూనెలో వేసి మరిగించాలి.వెచ్చగా ఉండగానే ఆ నూనెతో జుట్టు కుదుళ్ల వరకు రాసి మర్దనా చేయాలి. అలాగే వేప నూనె, ఆలీవ్ నూనె సమపాళ్లలో కలిపి వేడి చేయాలి.ఆ గోరువెచ్చని నూనెతో మర్దనా చేయొచ్చు. ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడిగా చేసి దాన్ని నూనెలో కలిపి మర్దనా చేయొచ్చు. కలబంద గుజ్జు కూడా చుండ్రును నివారిస్తుంది.మాడుపై ఉన్న చర్మ సమస్యలను పోగొడుతుంది.

ప్రధమ మహిళ బృందంలో గారిమ

అమెరికా నూతన అధ్యక్షుడు జొ బైడెన్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తుంది గారిమ వర్మ. ఆమె తల్లిదండ్రులు భారతీయలు. ఉపాధి కోసం అమెరికా వలస వెళ్లారు. గారిమ కెరీర్ గా డిజిటల్ మార్కెటింగ్ స్టాటజీలను ఎంచుకొన్నారు. అంతకు ముందు వాల్ డిస్నికి చెందిన ఎబిసి నెట్ వర్క్ లో హోస్ట్ గా పనిచేశారు. పారామెంట్ పిక్చర్స్ లో గ్రాఫిక్ డిజైన్ హెడ్ గా బాధ్యతలు నిర్వహించారు. బైడెన్, కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో డిజిటల్ మరియా వ్యూహ […]

Maara (తమిళం) (2021) 

మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్, నటించిన మారా  సినిమాకు మలయాళం మూవీ చార్లీ ఆధారం పార్వతి అన్న యువతి కేరళలోని ఒక కుగ్రామంలో గోడలపైన తాను చిన్నతనంలో విన్న కథ తాలూకూ చిత్రాలను చూసింది.ఆ కథలన్నీ గోడల పైన చిత్రించిన మణి మారన్ ను  వెతుక్కొంటూ వెళ్తుంది. ఆ ప్రయాణంలో తాను విన్న కథ లోని ఒక ప్రేమికుల జంటను కలుసుకుంటుంది.అప్పటికే వాళ్ళు వృద్ధులు జీవితం మొత్తం ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెతుక్కుంటూ పెద్దవాళ్ళయిపోతారు. తనను ఆదరించిన వృద్ధికి […]

కాక్ టైల్ స్పెషలిస్ట్ మీనాక్షి సింగ్ 

వైవిధ్యమైన కాక్ టైల్ రుచులూ మెరుగైన ఆతిథ్యం తో మీనాక్షి సింగ్ ప్రారంభించిన బార్ ప్రపంచంలోనే అత్యున్నతమైన 100 బార్ లో ఒకటిగా నిలిచింది. ఈమె నడిపే సైడ్ కార్ బార్ పాత గ్రంథాలయం లాగా బిలియర్డ్స్ రూమ్ లాగా ఉంటుంది.మీనాక్షి టీమ్ ప్రత్యేకమైన రుచులతో డ్రింక్స్ తయారు చేస్తారు. ఈ డ్రింక్ కి అవసరమైన దినుసులు బార్ వెనుక ఉన్న గార్డెన్ లో పండిస్తారు హోటల్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ చేస్తున్న మీనాక్షి సింగ్ […]

ఆడవాళ్లే డ్రైవర్స్ 

మహిళ డ్రైవర్లు నడిపే వాహనాలను అందుబాటులోకి తెచ్చింది రేవతి రాయ్ .ఆమె స్థాపించిన హే దీదీ కంపెనీలో ఇప్పుడు తొమ్మిది వందల మంది మహిళ డ్రైవర్లు పనిచేస్తున్నారు.రేవతి ప్రధాన కార్యాలయం ముంబాయి స్వయంగా రేవతి టాక్సీ డ్రైవర్ గా ఎయిర్ పోర్ట్ లో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక టాక్సీ మొదలు పెట్టింది తరువాత తన వంటి మహిళా డ్రైవర్లను తయారు చేసేందుకు పూనుకొంది ఆమె శిక్షణ ఇచ్చిన  మహిళలు టాక్సీలు ద్విచక్ర వాహనాలు నడుపుతూ, అమెజాన్ […]

అందమైన జీవితం 

పరిపూర్ణమైన జీవితం 40 ఏళ్ల వయసు నుంచి ప్రారంభం అవుతుంది అని చెబుతారు ఎక్సపర్ట్స్. శరీరం ఈశాయ నాలో దృఢంగా ఫిట్ గా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది.ఇక అటు తర్వాత కూడా యవ్వనాన్ని తరగనివ్వకుండా కాపాడుకోవాలంటే  ఫిట్ నెస్ ఎక్సర్ సైజ్  లు కొనసాగించాలి. వైద్యుల సిఫార్సు లతో  అవసరమైన వ్యాయామాలు జీవితంలో భాగంగా చేసుకోవాలి. నట్స్, ఆకుపచ్చని కూరగాయలు, పాలు, ధాన్యాలు, చేపలు, మాంసం తినాలి.మంచి వయసులో ఎంతో తీరిక లేని ఉద్యోగ వ్యాపారాల్లో క్షణం […]

ప్లానెట్ ఏ బుల్ట్ 

ప్లానెట్ ఏ బుల్ట్   అనే పేరుతో దివ్యాంగుల కోసం టూరిజం సౌకర్యం ఏర్పాటు చేసింది నేహా arora. నేహా తండ్రి అంధుడు తల్లి చక్రాల కుర్చీకి పరిమితం అయిన దివ్యాంగురాలు. నేహా  బాగా చదువుకొని ఒక బహుళజాతి సంస్థలో ఉద్యోగం సంపాదించింది తన సంపాదన తో తల్లిదండ్రులను టూరింగ్ కు తీసుకు వెళ్ళినప్పుడు దివ్యాంగులకు ఎలాంటి సౌకర్యాలు లేవని అర్థం అయ్యింది. ఆ సమయంలో ఆమె ఈ సంస్థ గురించి ఆలోచన వచ్చింది. 2016 లో ప్రారంభమైన […]

లైన్ ఉమెన్ గా తొలి మహిళ శిరీష 

లైన్ మేన్ ఉద్యోగానికి తెలంగాణ నుంచి తొలిసారిగా ఎంపికయింది బబ్బురి శిరీష ఆమెకి తెలంగాణ జిల్లా సిద్దిపేట జిల్లా గణేష్ పల్లి ఐ.టి.ఐ కోర్స్ చేసింది లైన్ మేన్ ఉద్యోగం కోసం TSSPDCL సంస్థ ఇచ్చిన నోటిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తే మహిళలకు అవకాశం లేదన్నారు. అప్పుడు కోర్టుకు వెళ్లింది శిరీష హైకోర్టు ఆదేశాలతో దరఖాస్తులు స్వీకరించారు. మహిళా అభ్యర్థులకు పోల్ టెస్ట్ చేసి ఉద్యోగం ఇవ్వాలనే హైకోర్టు ఆదేశంతో ఒకటిన్నర నిమిషం లో విద్యుత్ స్తంభం […]

మహిళా వేదిక హీరోస్ 

హీరోస్ అన్న మహిళా వేదికను ౨౦౧౪లో ప్రారంభించారు. ఈ ఇంటర్నెట్ వేదిక పైన ఐదు లక్షల మంది కలుస్తున్నారు. సమస్యలకు సలహాలు నైపుణ్యాలు పొందటం, కొత్త అవకాశాలు వెతకటం అవసరమైన రుణాలను పొందటం మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులు ప్రదర్శించి అమ్మకాలు చేసుకోవటం కోసం ఈ వేదిక ఉపయోగపడుతోంది.ఉద్యోగాలు చేసే చోట ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం లైంగిక వేధింపుల నుంచి బయటపడే మార్గాల సూచన వంటివి కూడా ఇక్కడ పొందగలరు. ఫిర్యాదు చేసే మార్గాలు న్యాయ సలహాలు […]

చర్మ ఆరోగ్యానికి నిద్ర

చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండేందుకు సౌందర్య ఉత్పత్తులు వాడే కంటే వేలకు కంటినిండా నిద్రపో మంటున్నారు ఎక్సపర్ట్స్ . నిద్ర శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది శరీరంలో అతి పెద్ద అవయవం అయిన చర్మం ఆరోగ్యం తాజాదనం, నిగారింపు మీద నిద్ర ప్రభావం చూపెడుతుంది. కంటి నిండా నిద్రపోతే చర్మం తనను తాను మరమ్మత్తులు చేసుకుంటుంది. కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అవుతాయి దానితో ఫ్రీరాడికల్స్ తొలగిపోతాయి. నల్ల మచ్చలు ముడతలు మాయం అవుతాయి. చక్కని నిద్ర […]

ఒంటరి తనం ఒక భావన మాత్రమే

మనిషి సామాజిక జీవి. ఎప్పుడూ ఎవరో ఒకరితో సంబంధాలతో ఉండి గుంపులో గుంపుగా జీవించగలిగే వాడు.ఏ కారణం చేతైనా గుంపుతో లేదా మందలోంచి వేరు చేయబడిన జీవి ఎంత అలజడికి గురి అవుతోంది ఓ మనిషీ అంతే పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళయి ఇల్లు వదిలి వెళ్లిపోయాక చాలా మంది దంపతులు ఎదుర్కొనే పరిస్థితి ఇదే.అప్పటికే బంధుమిత్రులతో దూరం అవుతుంటాము పిల్లలు పెంపకంలో ఎవరికీ ఒక గంట సమయం కేటాయించలేక పోయినందువల్ల చుట్టూ వారితో మానసిక బంధం […]