Wednesday, 12 Aug, 2026

The White Tiger ఇంగ్లీష్ (2021)

అరవింద్ అడిగా రాసిన నవల ఆధారంగా తీశారు ది వైట్ టైగర్. ప్రియాంక చోప్రా రాజకుమార్ రావ్ ఆదర్శ గౌరవ్ లు నటించారు వ్యాపారవేత్త బలరామ్ హల్ వాయి ఒక ఇ-మెయిల్ లో తనను తాను పరిచయం చేసుకుంటూ చెప్పిన కదా లక్ష్మణ్ ఘర్ లో ఉండే బలరామ్ అన్న చిన్నపిల్లాడిని,స్కూలు అధికారి ఎప్పుడో అరుదుగా జన్మించి వైట్ టైగర్ వంటి వాడివి అని అభినందిస్తూ స్కాలర్ షిప్ మంజూరు చేస్తారు. బొగ్గు వ్యాపారికి అప్పు పడి అప్పటికే ఇంట్లో అందరూ అతని కింద పని చేస్తూ ఉంటారు. బొగ్గు కొట్టే పనిచేస్తూ యుక్త వయసుకు వచ్చిన బలరామ్ బొగ్గు వ్యాపారి కొడుక్కి డ్రైవర్ కావాలనే కోరికతో డ్రైవింగ్ నేర్చుకుంటాడు వాళ్ల దగ్గర డ్రైవర్ గా చేరతాడు. యజమాని కొడుకు భార్య పింకీ చేసిన యాక్సిడెంట్ ని బలరామ్ పైన వేసుకోమని వత్తిడి చేశాక కానీ తను ఎంత బానిస బతుకు బతుకుతున్నాడో అర్థం కాదు బలరామ్, చివరికి యజమాని కొడుకుని చంపేసి అక్కడ తీసుకొన్నడబ్బుతో ఏట్లో బలరామ్ నాయిని,అంతస్థును కొనుక్కొంటాడో అదీ కధ ది వైట్ టైగర్.

రవిచంద్ర.సి
7093440630

Leave a Reply