లారెన్ వాసర్ ను ది గర్ల్ విత్ గోల్డెన్ లెగ్స్ అనే పేరుతో పిలుస్తారు ఈ మోడల్ యాక్టివిస్ట్ 24 ఏళ్ల వయసులో టాక్సిక్ షాక్ సిండ్రోమ్ కు గురైంది.2012లో ఎడమ కాలును 2018లో కుడికాలు తీసేశారు అర్ధాంతరంగా అంగవైకల్యం బారిన పడిన లారెన్ వాసర్ నెమ్మదిగా కోలుకొని కృత్రిమ కాలు ధరించి ఫ్యాషన్ షోలలో పాల్గొన్నది. కాలం ఏ గాయాన్నైనా మాన్పినట్లే వాసర్ కాలిగాయాలు, మానసిక గాయాలు మానిపోయి ఆమె మళ్ళీ తనదైన మోడలింగ్ కెరీర్ లోకి తన బంగారం తో తయారైన కాళ్లతో ప్రవేశించింది.














