Thursday, 06 Aug, 2026

Tandav వెబ్ సిరీస్ (2021) (హిందీ)

తొమ్మిది భాగాలుగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న తాండవ్ ఒక పొలిటికల్ డ్రామా మినిస్టర్ దేవకీనందనన్ తెల్లవారి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయనగా హత్యకు గురవుతాడు. అతని కొడుకు సమర్ ప్రతాప్ ప్రధానమంత్రి కవలసి ఉంది. కానీ నాటకీయ పరిణామాలలో దేవకీనందన కి అత్యంత ఆప్తురాలిగా ఉన్నా అనురాధ కిషోర్ ప్రధానమంత్రి అవుతోంది. తనను గురించి ఆమె చేతిలో ఉన్న రహస్యం ఏమిటో అర్థం చేసుకోలేకపోతాడు సమర్ ప్రతాప్. ఈ కథలో సమాంతరంగా యూనివర్సిటీలో ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి.సమర్ అదే యూనివర్సిటీలో చదువుకుంటాడు. ఆ ఎన్నికల్లో అత్యంత ప్రతిభావంతుడిగా కనిపించిన శివ్ అన్న యువకుడుని చేరదీయాలనుకుంటాడు సమర. ఈలోగా అనురాధా కిషోర్ చేతిలో తండ్రి హత్యకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని తేలుతుంది. ఆమెను విజయవంతంగా సింహాసనం దింపేసి తండ్రికి సన్నిహితుడైన గోపాల్ దాస్ ను ప్రధానమంత్రిగా ప్రపోజ్ చేస్తాడు సమర్. ఇంతటితో మొదటి సీరియస్ పూర్తయింది .

రవిచంద్ర సి
7093440630

Leave a Reply