ప్రపంచ పోటీలకు కౌర్ గిల్
ప్రబ్లీన్ కౌర్ గిల్ ఆసియాలోని నెంబర్ వన్ స్ట్రీట్లిఫ్టిర్. ఇది శరీర బరువు తో చేసే వ్యాయామం.పవర్ లిఫ్టింగ్ లాగే ఉంటుంది కానీ అదనపు బరువును శరీరాన్ని కట్టుకుని పులప్స్, డిప్స్, స్పోర్ట్స్ స్వాట్స్ చేయవలసి ఉంటుంది.ప్రబ్లీన్ 13.75 కిలోల బరువుతో చేసిన మజిల్ అప్ జాతీయ రికార్డు గా ఉంది .అంతేకాకుండా 37.5 కిలోల బరువుతో చిన్ అప్ ,65 కిలోలతో డిప్స్ 115 కిలోలతో స్వాట్స్ చేస్తూ ఆసియాలోని నెంబర్ వన్ ర్యాంకర్ గా నిలిచింది.సింగపూర్ ఓపెన్ ఫిలిప్పీన్స్ ఓపెన్లో స్వర్ణాలు సాధించి నవంబర్ లో జరిగే ప్రపంచ ఛాంపియన్స్ కి ఆమె అర్హత సాధించింది.. మనదేశంలో కాలిస్థెనిక్స్ గురించి చాలామందికి సరైన అవగాహన లేదు.ఇది చాలా కష్టమైన క్రీడ అనుకుంటారు కానీ ఇది పరిశ్రమతో సాధించగలిగేది అంటుంది కౌర్ గిల్. పంజాబ్ లోని జలంధర్ లో పుట్టి పెరిగిన కౌర్ గిల్ ప్రయాణం ఒక అద్భుతం. ఒక పులప్ కూడా తీయలేని స్థాయి నుంచి ప్రపంచ ఛాంపియన్షిప్ కి ఎదిగిన కౌర్ గిల్ జీవితం ఆడపిల్లలకు ఒక గొప్ప స్ఫూర్తి.
