30 దాటితే ఆలోచించండి
వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం చేసే ఆరోగ్య హెచ్చరికలను మహిళలు నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు అప్పటివరకు సన్నగా నాజూకుగా ఉన్న మహిళలు 30 దాటగానే కొంచెం లావైపోతుంటారు.ఇక డైటింగ్ జిమ్ములు వర్కౌట్లు చేస్తూ ఫలితం కనిపించక నిరసించి పోతూ ఉంటారు. ప్రతిరోజు చేసే ఈ శారీరక శ్రమ, తీసుకునే తక్కువ ఆహారం, నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి మానసిక ఆందోళన, కండరాల పరిమాణం లో వచ్చే మార్పులు అన్నీ కలిసి వారి జీవక్రియలను ప్రభావితం చేస్తాయి.దీంతో పిసిఒఎస్, హైపోథైరాయిడిజం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యలు వస్తాయి ఈ లోపల ఋతుక్రమం సరిగా లేకపోవడం కూడా మహిళలపై ప్రభావం చూపెడుతుంది.ఇలాంటి సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం మీద ప్రతి మహిళ తప్పనిసరిగా దృష్టి సారించాలి మంచి పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా కాల్షియం,డి విటమిన్, పీచు, ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలు తినాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.రోజు హాయిగా నిద్రపోవాలి.తరచుగా థైరాయిడ్ గ్లూకోజ్ హార్మోనల్ టెస్టులు చేయించుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్తున్నారు నిపుణులు.త్వరగా అలసిపోవటం,ఒత్తిడి,ఆందోళన వంటివి ఎదురైతే నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
