Monday, 20 Jul, 2026
పిల్లల పెంపకానికి కూడా ఎంతో శిక్షణ కావాలి ఒక్క చిన్న మొక్క కుదురుగా పెరగలంటేనే దాన్ని ఎంత వరకు ఎలా పెంచాలో తలుసుకోవాలి, ఇక పిల్లల విషయం మాటలా? పెరిగే పిల్లల మెదడు ఎంతో చురుకుగా వుంటుంది. దాదాపు వంద బిలియన్లు న్యురాన్లు చురుకుగా ఉంటాయట. ఎన్నో తలుసుకోవాలనే కుతూహలం వందల ప్రశ్నలు, ఎన్నో పరిశోధనలు, ఆ వయస్సులో వాళ్ళకు 'నో' అన్న పదం వినిపించ కూడదు అంటారు పేరెంటింగ్ ఎక్స్ పర్ట్స్. తల్లి దండ్రులు బిజీగా వుండి. ఇప్పుడు కాదు పో, విసిగించకు పో, ఆడుకో పో అంటూ వుంటారు. అలాగే, పరుపులెక్కి తొక్కొద్దు, కుర్చీ లో నుంచి దూకొద్దు, కిటికీ లో నుంచి చూడొద్దు, అలా ఎగరోద్దు, పరుగెత్తోద్దు, ఇక ఇలా అన్ని ఆంక్షలే. ఇక స్మార్ట్ ఫోనో, టీ.వి నో అలవాటు చేస్తారు. తీరాదానికి అలవాటు పడి అదే పనిగా చూస్తుంటే అదీ తప్పంటారు. మరి పిల్లల సంగతి ఏమిటి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వాళ్ళతో కబుర్లు చెప్పండి, ఆడండీ, వాళ్ళకు ఎం కావాలో తెలుసుకోండి, సందేహాలు తీర్చండి. బయటకు తీసుకు పోయి ఆడించండి. డబ్బు కాదు వాళ్ళకోసం ఇవ్వాల్సింది సమయం అంటున్నారు. తల్లి దండ్రులు ఆలోచించాలి మరి.

పిల్లల మనసు గాయపడుతుంది

వాళ్ళని ఇరుగు పొరుగుల తోనో, తోబుట్టువుల తోనో పోలిక తెచ్చి అవమానించారా, ఇక పిల్లలు మీ మాట విననట్లే తెలుసుకోండి అంటారు ఎక్స్పర్ట్స్. పిల్లలు ఏదైనా నేర్చుకునే క్రమంలో పొరపాట్లు చేస్తారు. ఇక వెంటనే ఎప్పుడూ ఇలాగే తప్పులు చేస్తావనో, అన్న నీలాగా తప్పులు చేయడనో, చెల్లిని చూసి నేర్చుకోమానో ఎప్పుడూ అనకూడదు. వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే ఎక్కడ పొరపాటు చేశారో చెప్పి ఎలా సరిదిద్దుకోవాలో వివరించాలి. అదే వారిలో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. అలాగే వారిని వారి అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్ళతో పోలిక తెస్తే అనవసరంగా వారి మధ్య శతృత్వం కలిగించిన వాళ్ళు అవుతారు. అలాగే ప్రతి చిన్న పొరపాటుకు వెంటనే దండించటమూ తప్పే. అవమానించినా తప్పే. మాట్లాడే పరుషమైన మాటలు చిన్న పిల్లల మనసు గాయ పరుస్తాయి. అందుకే పిల్లలతో చాలా జాగ్రత్త అంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు.

Leave a Reply