Saturday, 01 Aug, 2026

కాబోయే మహారాణి

150 ఏళ్ల తర్వాత స్పెయిన్ దేశాన్ని పరిపాలించబోయే మొదటి మహారాణి గా చరిత్రపుటల్లో నిలవబోతోంది 20 ఏళ్ల లియోనార్..స్పెయిన్ రాజు ఫిలిప్ రాణి లెటిజియా పెద్ద కూతురు లియోనార్. త్రివిధ దళాల్లో మూడు సంవత్సరాలు ఆమె శిక్షణ పొందింది. స్పెయిన్ సాయుధ దళాలకు మొదటి మహిళా సుప్రీం కమాండర్ గా ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు. ఫ్రెంచ్, అరబిక్, ఇంగ్లీష్ ,స్పానిష్,మాండరిన్ లాంటి భాషలు ఎన్నో అనర్గళంగా మాట్లాడగలరు మాండ్రిడ్  లోని ఒక యూనివర్సిటీ లో ఆమె పొలిటికల్ సైన్స్ చదవబోతున్నారు. 12 ఏళ్ల వయసులోనే  స్పెయిన్లోని అత్యంత గౌరవ పురస్కారాల్లో ఒకటైన ఆర్డర్ ఆఫ్ గోల్డెన్ ప్లీస్ ని అందుకుంది లియోనార్ .ఈ సంవత్సరం స్పెయిన్ రాజ్యాంగ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె చేసిన ప్రసంగం ప్రపంచ దృష్టిని    ఆకర్షించింది.సరైన అవకాశాలు కల్పించడం ద్వారా యువతను ప్రోత్సహించవలసిన బాధ్యత సమాజానికి ఉంది అంటుంది లియోనార్.

Leave a Reply