మొదటి న్యూరో సర్జన్
చెన్నైకి చెందిన తంజావూరు సంతాన కృష్ణ కనక ఆసియాలోని మొదటి మహిళా న్యూరో సర్జన్. ఈమె నాడీ సంబంధిత రుగ్మతలకు చికిత్స చేసేందుకు వీలు కల్పించే స్టీరియోటాక్టిక్ బ్రెయిన్ సర్జరీ పై పని చేశారు. ప్రపంచవ్యాప్తంగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వాడుకలోకి రావడానికి ముందే మన దేశంలో ఈ విధానాన్ని తీసుకువచ్చారు సంతాన కృష్ణ. తల్లిదండ్రుల పేరిట శ్రీ సంతాన కృష్ణ పద్మావతి హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించారు.1962లో చైనా ఇండియా యుద్ధ సమయంలో భారత్ సైన్యంలో కమిషన్డ్ ఆఫీసర్ గా పని చేశారు.ఆమె జీవితంలో 139 సార్లు రక్తదానం చేయడంతో ఆమె పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు లో చోటుచేసుకుంది.మద్రాస్ న్యూరో ట్రస్ట్ నుంచి ఆమెకు జీవన సాఫల్య పురస్కారం అందింది.ఈమె రచనలు అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమై ఆమెకి ఎంతో పేరు తెచ్చాయి.
