Friday, 24 Jul, 2026

అరుణా భిక్షు కు జాతీయ పురస్కారం

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు డాక్టర్ అరుణ బిక్షు.ఆమె రంగస్థలం నటి యాక్టింగ్ ట్రైనర్ కూడా. ఒకవైపు శాస్త్రీయ నృత్యం, ఇంకొక వైపు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం నృత్య విభాగ అధిపతి గా సేవలు అందిస్తున్నారు.ఆమె దగ్గర శిక్షణ పొందిన ఎందరో నటులు ఈరోజు వెండితెర పైన రాణిస్తున్నారు.కళా రంగంలో అత్యున్నత మైన సేవ చేసిన అరుణ భిక్షు యాదాద్రి జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు.ఆమె ప్రదర్శించిన భామాకలాపం,రుద్రమ కలాపం,యుగయుగాల తిరుమల, తరతరాల తిరుమల, వేంకటేశ్వర విలాసం మొదలైన నృత్య రూపాలు ప్రేక్షకులను అలరించాయి. ఆత్మహత్యలకు వ్యతిరేకంగా  రోష్ని వంటి నృత్యరూపకాలు ప్రదర్శించారు. వీర రస ప్రధానమైన నరకాసురుడు, వృషభాసురుడు వంటి విభిన్న పాత్రలను అభినయించడం ఆమెకి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.

Leave a Reply