మనుషులకు పుస్తకాలే తోడు స్ఫూర్తి
డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో ఒక కొత్తరకం లైబ్రరీ ఉంది. దీని పేరు “ది హ్యూమన్ లైబ్రరీ”. ఇందులో పుస్తకాల బదులు మనుషులే కథలు చెప్తారు. ఆసక్తికరమైన తమ జీవితానుభవాలను చెప్తారు 2000 సంవత్సరంలో దీన్ని రోని ఎబేర్జెన్ అనే అతను స్థాపించారు.ఈ లైబ్రరీ సభ్యత్వం ఉచితం.ఎంతోమంది స్వచ్ఛందంగా ఇక్కడ విజిటర్స్ ని కలుసుకొని వాళ్లడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు.ఇలా చెప్పే వారిలో డెన్మార్క్ కి వలస వచ్చిన నౌరా బిటార్ చాలా పాపులర్.సిరియా నుంచి ఒక యుద్ధ శరణార్థిగా ప్రాణాలతో బయటపడిన నౌరా ఇక్కడ చెప్పే అనుభవాలు శ్రోతలను ఎంతో ఆకర్షిస్తాయి. వారికి స్ఫూర్తి ఇస్తాయి శరణార్ధిగా తన జీవిత ప్రయాణం తోటి వారిని కోల్పోయినప్పుడు కలిగే బాధల గురించి ఆమె ఎంతో హృదయ విదారకంగా చెప్తారు సమాజంలోని అపోహలను తొలగించి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడిన ఇలాంటి వ్యక్తుల కథనాలే హ్యూమన్ లైబ్రరీలో ప్రధానంగా కనిపిస్తాయి ఈమె కథ ను ఆమె మాత్రమే కాదు ఇతరులు కూడా హ్యూమన్ లైబ్రరీలో హాజరైన వ్యక్తులకు చెబుతూ ఉంటారు. కథలు విన్నా చదివినా మనుషులకు స్ఫూర్తి ఇవ్వాలి .జీవితంలో ధైర్యాన్ని ముందుకు పోయే శక్తినివ్వాలి అందుకే పుస్తకాలు చాలా అవసరం కథలు చాలా అవసరం.
