Tuesday, 22 Sep, 2026
కొలెస్ట్రాల్ స్థాయిల్ని రక్తపోటును కొలతలు వేసినట్లు ఎమోషనల్ ఆరోగ్యాన్ని కొలతలు వేయటం సాధ్యం కాదు. అయితే భావోద్వేగ అనుకూలత ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని అందరికీ తెలుసు. డిప్రెషన్ కు కార్డియో వ్యాస్కులర్ రుగ్మతలను నడుమ ఎక్కువ సంభంధం ఉంటుంది. జీవితం పట్ల గల సంతృప్తి గుండె జబ్బుల ముప్పు తగ్గిస్తుందా ? ఈ విషయమై విస్తృతమైన పరిశోధనలు నిర్వహించారు . హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు. సంతోషానికి సంబంధించిన ఎనిమిది అంశాలు వారు సృజించారు. వివాహం ప్రేమ తీరిగ్గా చేసే కార్యకలాపాలు జీవన ప్రమాణాలు ఆరోగ్యం కుటుంబ జీవనం శృంగార జీవనం వ్యక్తిగత భావాలు జీవితంపై ఎక్కువ ప్రభావం చూపే అంశాలు మొత్తం మ్మీద సంతృప్తికరంగా వుండే వారిలో 26 శాతం గుండె సంబంధిత రుగ్మతలకు అవకాశం తక్కువగా ఉంటుందని గుర్తించారు. రిస్క్ తగ్గించే అంశాల్లో ఉద్యోగం కుటుంబం సెక్స్ వ్యక్తిగత భావాలు ఉన్నాయి. అంటే భావోద్వేగ సంతోషానికి కాలమానం ఆరోగ్యమే అయితే అందుకు అవసరమైనవి సంతోషంతో కూడిన జీవితం అన్న మాటేగా !

సంతోషాన్ని ఇచ్చే మాటలు 

ప్రతి రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి  పడుకునే వరకు మాట్లాడుతూ ఉంటాం.లక్షలాది పాదలు నోటివెంట దొర్లుతుంటాయి.ఈ మాట్లాడే మాటల్లో ఏది ఎక్కువ సంతోషాన్ని ఇవ్వగలదు అంటే చెప్పలేం కదా.ఈ విషయంలో పరిశోధకులు 17 లక్షల పదాల పై పరిశోధనలు చేశారు. వాడే పదాల్లో అమ్మమ్మ,నాయనమ్మ  వంటి వరసలు మనం మనకు నేను మనది వంటి వ్యక్తిగత పదాలు సంతోషాన్ని ఇస్తాయని గుర్తించారు. నిరంతరం వాడే ఐ ఫోన్ గూగుల్ వంటి వస్తు సంబంధిత పదాలు ఉచ్చారణలో మనసు పొందే సంతోషం  ఏది ఉండదట సంబంధం బాంధవ్యాలకు సంబంధించిన పదాలు తప్ప ఏ ఇతర వస్తు సంబంధిత పదాలు ఏ ప్రభావం చూపించవు. సంబంధం బాంధవ్యాలు సంతోషాన్నిస్తాయి.కానీ  వాటితో పోలిస్తే మెటీరియల్ థింగ్స్ పెద్ద ప్రభావం చూపించవు . కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటేనే సంతోషం కలుగుతుందట మనసుకు తెలియకుండానే మనం వాడే పదాలు మనకు స్వాంతన ఇస్తాయంటే నిజమైన ఆ బాంధవ్యం ఇంకెంతటి అపురూపమైనది.
చేబ్రోలు శ్యామసుందర్ 
9849524134  
 

Leave a Reply