Wednesday, 29 Jul, 2026
జలుబు చేస్తే చాలు గొంతు నొప్పి పరుగెత్తుకొంటూ వచ్చి చేరుతుంది. నొప్పి మంట ఏం చేయాలో తోచకుండా ఉంటే గ్రీన్ టీ హెర్బల్ టీ వైట్ టీ ట్రై చేయమంటున్నారు. వైద్యులు. ఇవే సత్వర ఉపసమానాలు. ఈ టీ ల్లో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షల దూరం చేస్తాయి . అల్లం దంచి మిరియాలు దాల్చిన చెక్క పొడి చేసి టీ పొడితో పాటు కలిపి మరిగించి ఇందులో తేనె వేసి ఈ హెర్బల్ టీ తాగి చూడండి. ప్రాబ్లమ్ పరార్. వీలైతే తులసి ఆకులు మింట్ టీ కూడా ట్రై చేయచ్చు . ఇష్టమైతే చికెన్ సూప్ కూడా ట్రై చేయచ్చు. చికెన్ లో ఉండే సోడియం మంట ని తగ్గిస్తుంది. గొంతుకు స్వాంతన ఉంటుంది. సూప్ రూపంలో మితంగా తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఎక్కువగా ద్రవ పదార్ధాలు అదీ వేడిగానే తీసుకుంటే గొంతునొప్పి అంతగా విసిగించదు. గొంతు సంగతి అలా వుంచినా రోజుల్లో ఒకేసారి ఈ హెర్బల్ టీ తాగి ఎంతో ప్రయోజనం.

ఆరోగ్యాన్నిచ్చే హెర్బల్ టీ

జీలకర్ర ధనియాలు సోంపు తో ఆరోగ్యాన్నిచ్చే హెర్బల్ టీ తయారు చేయచ్చు అంటారు ఆయుర్వేద నిపుణులు ఒక్క టీ స్పూన్ చొప్పున జీలకర్ర ధనియాలు సోంపు ఒక లీటర్ నీళ్లు తీసుకోవాలి అన్నీ కలిపి మరిగిస్తే హెర్బల్ టీ తయారవుతుంది రుచికోసం చిన్న బెల్లం ముక్క కలుపుకోవచ్చు ఈ హెర్బల్ టీ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.పోషకాలను శరీరం వేగంగా గ్రహించేలా చేస్తుంది. ఒంట్లోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లో నీటిని తొలగించి నరాలకు స్వాంతన ఇస్తుంది.

Leave a Reply