లక్నోకు చెందిన శ్వేతా శుక్లా అన్వరత్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 18 రాష్ట్రాల్లో మూడు లక్షల మంది బాలికలకు నెలసరి శుభ్రత పోషకాహారం పై అవగాహన కల్పిస్తోంది. అన్వరత్ అంటే నిరంతర ప్రయత్నం అని అర్థం గ్రామీణ ప్రాంతాల్లో బాల బాలికలు ఎదుర్కొనే విద్యావకాశాల కొరత అనారోగ్య సమస్యలు నైపుణ్యాల అభివృద్ధి లోపం వంటి సమస్యల కోసం కృషి చేస్తోంది సంస్థ. సెల్ఫ్ డిఫెన్స్ లు తర్ఫీదు ఇస్తోంది. శ్వేత ఏర్పాటు చేసిన సురభి సెంటర్లు బాలికలకు సురక్షిత స్థలాలుగా ఉన్నాయి.













