Thursday, 06 Aug, 2026
గర్భం దాల్చాక తల్లి మనోభావాలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి విడదీయరాని సంబంధం ఉంటుందని భారతీయ సంస్కృతి ఏ నాటి నుంచో విశ్వసిస్తోంది. అందుకే ఆమె చురుగ్గా ఉండాలని మంచి వాతావరణం మంచి పరిసరాలు ఉండాలని మంచి పుస్తకాలూ చదువుకోవాలని మంచి సంగీతం వినాలని చెప్తుంటారు. వీటన్నింటి ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఉంటుందని వారి అభిప్రాయం. ఇటీవల పరిశోధనలు ప్రాచీన నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. తల్లిలోని భావోద్వేగ సంబంధిత హార్మోన్లు బిడ్డకు ట్రాన్స్మిట్ కావటమే ఇందుకు కారణం గర్భంలో వున్నప్పుడు తల్లి తీవ్రమైన వత్తిడి ఎదుర్కుంటున్నట్లైతే ఆ బిడ్డలు హైపరాక్టీవ్ లేదా ఎమోషనల్ సమస్యలతో ఉంటారని సగటు ఐక్యూ కంటే తక్కువ కలిగి ఉంటారని అధ్యయనం లో పేర్కొన్నారు. కాబట్టి తల్లి ఎంత మానసిక ప్రశాంతతతో వుంటే బిడ్డకు అంత మంచిది.

 అందుకే వృద్ధాప్యం 

కొంతమందిలో వృద్యాప్య లక్షణాలు చాలా తొందరగా కనిపిస్తూ ఉంటాయి. అలా అకాల వృద్ధాప్యానికి కారణం కాలుష్యమే ఇంకేదో అని తేలిగ్గా తీసుకొంటాం కానీ తల్లి కడుపులో ఉండగానే  బిడ్డపై పడిన తీవ్ర వత్తిడి ప్రభావమే ఇది అంటారు షూ లేస్ చివర  ప్లాస్టిక్ కాప్ ఉంటుంది. అదిలేకపోతే షూ లేస్ పాడవుతుంది గమనించారా. అలాటి టెరీమల్స్ క్రోమోజమ్స్ చివర క్యాప్ లాగా ఉండి వాటిని సంరక్షిస్తాయి. గర్భిణి లో ఒత్తడి ఎక్కువగా ఉంటే గర్భిణిలకు పుట్టిన పిల్లలో ఈ టెలోమెర్స్ చిన్నవిగా అయిపోతాయి. అలా అవటం వల్లే పిల్లల్లో అకాల వార్ధక్యం,ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు చెపుతున్నాయి. అందుకే తల్లికాబోతున్న వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని చెబుతున్నారు.

Leave a Reply