Thursday, 06 Aug, 2026
వాతావరణ కాలుష్యం భయపెడుతున్న ఆఫీస్ కో. కాలేజీ కో , లేదా ఇంట్లో పనుల గురించి బయట తిరగక తప్పదు. దుమ్ము జిడ్డు పేరుకునిపోయి చర్మం మృదుత్వాన్ని పోగొట్టుకుంటుంది. వీటిలో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ సమస్యలొస్తాయి. చెంపలు ముక్కు దగ్గర సమస్య కనబడుతూ ఉంటుంది. చర్మం రంగు తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ముఖానికి శాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ లు వాడాలి. అలాగే క్లిందా మైసిన్ , బెంజైడ్, పేరాక్రైడ్, రెటినాయిడ్ ఉన్న క్రీములు ముఖ చర్మం స్మూత్ గా అయిపోయేందుకు ఉపయోగపడతాయి. లేదా బ్యూటీక్లినిక్స్ లో అయితే శాలిసిలిక్ యాసిడ్ క్రీములు అప్ప్లయ్ చేయటం కెమికల్ పీల్ చేస్తుంటాయి. వీటివల్ల చర్మం పైన పేరుకున్న జిడ్డు మృతకణాలు పోయి చర్మం నిగారింపుగా వస్తుంది. లేదా ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్ లో తయారు చేసుకోవచ్చు. సున్నిపిండి సెనగపిండి సరిపాళ్ళ లో కలిపి నిమ్మరసం తేనె కలిపి మర్దన చేసినా చర్మం రంగు చక్కగా అయిపోతుంది. టమాటా గుజ్జు తేనె నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకున్న చర్మ కాంతి మెరుగవుతుంది. సమస్యలన్నీ పోతాయి.

ఫేషియల్ మంచిదే.

సాధారణంగా ఫేషియల్ చేస్తే , మృదువుగా , క్లియర్ గా మెరుపుతో మెరుస్తూ ఉంటుంది. కానీ కొందరు బ్యూటీషియన్స్ చర్మం లొపలికి ఇంకే విధంగా ఆయిల్ మసాజ్ చేస్తారు. దీని వల్ల ఫాలికల్స్ ఇన్ ఫ్లేమ్ అవ్వుతాయి. ఫోర్స్ క్లాగవ్వుతాయి. దీనితో యాకిన్ ఫ్లేరన్స్ తప్పవు. ఆలాగే బ్లాక్ హెడ్స్ వెలికి తీసే సమయం లో పించ్ చేయడం పుల్ చేయడం వల్ల మొటిమలు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. చర్మం సున్నితంగాను , మొటిమలు వున్నప్పుడు ఫేషియల్స్ చేయించుకోవడం అవసరం. బాగా నిపుణులైన వారితో డెర్మటాలజిస్ట్ సూపర్ వైజ్ చేసే ఫేషియల్స్ చేయించుకుంటే చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మొటిమలు కూడా తగ్గుటయి. ఎక్కువ సేపు హెవీ క్రీమ్స్ లేదా లోషన్ రుబ్బింగ్ చేసే ఏ చికిత్స అయినా చేయించుకోవచ్చు.

Leave a Reply