Monday, 30 Nov, 2026

మూడు బ్యూటీ సీక్రెట్స్

నా మెయిన్ మీల్ చాలా పోషకాలలో ఉంటుంది. ద్రాక్ష,మామిడి పుచ్చకాయలతో పాటు గ్రీన్ వెజిటెబుల్స్, పప్పు, అన్నం తింటాను. ఆరోగ్యం, అందం రెండూ కావాలంటే సమతులాహారం తీసుకోవాలి అంటుంది దీపికా పదుకునే. స్కిన్ కేర్ ఉత్పత్తులు నేను చాలా తక్కువ వాడతాను. క్లీనింగ్ , టోనింగ్ మాయిశ్చరైజింగ్ నా దిన చర్యలో భాగం. చర్మం పైన ఎసెన్షియల్ ప్రోటీన్స్ పోకుండా తేలికైన స్కిన్ కేర్ ఉత్పత్తులు వాడతారు. బేబీ అయిల్, కొబ్బరి నూనె మసాజ్ నాకు చాలు […]

ధర్మాగ్రహం

ఎంత గొప్పగా  చెప్పిందా అమ్మాయి.  మీటూ ఉద్యమానికి  మద్దతుగా  ఐవర్ కోస్ట్ దేశపు టీనేజ్ ఆర్టిస్ట్ లతీతియా కాయ్ తన జుట్టును కాన్వాస్ గా బొమ్మలేసింది.  మినీ స్కర్ట్ లు వేసుకునేందుకే అమ్మయిల పై లైంగిక దాడులు జరుగుతున్నాయనే వాదనకు నిరసనగా ఈ  అమ్మాయి ఈ హెయిర్ స్టైల్ చేసుకుంది.  అత్యాచారాలు చేసే దోషాన్ని బాధితుల పైకి నెట్టేసే మనుష్యులపైన ధర్మాగ్రహం ఇది!.

పెంచడం తేలికే

ఇంట్లోనే కొన్ని మొలకలు పెంచుకోవచ్చు. చిలగడదుంప చాలా అందమైన తీగలా ఎదుగుతుంది. అలాగే అల్లం,ఉల్లి పాయలు కూడా పెంచుకోవటం సులభమే. చిలకడదుంపలు, బంగాళా దుంపలు కాస్తా పాడైతే దాన్ని పారేయకుందా సగానికి కోసి తరిగిన వైపు నిళ్ళలో ఉండేలా ఒక గ్లాసులో పడేస్తే చాలు, రెండు రోజులకొకసారి నీళ్ళు మారుస్తూ ఉంటే మొలకలు వస్తాయి. అప్పుడు కాస్తా మట్టిపోసి పెడితే ఇంట్లో అందమైన తీగల్ని చూడోచ్చు. వెల్లుల్లిని నేరుగా ఒక రెబ్బ తీసీ మట్టిలో పాతెస్తే మొలకలు […]

కొంత శ్రద్ద అవసరం

ఎక్కువగా ఎండలో తిరిగే జాబ్ చేస్తుంటే చర్మం పై ముడతలు ఖాయంగా పడతాయి. సూర్యకాంతి చర్మం పొరల పై ప్రభావం చూపెడుతుంది. చర్మంలో కొలాజెన్ ఎక్కువై చర్మం సాగే గుణాన్ని పొగొట్టుకుంటుంది. చిన్న జాగ్రత్తతో ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. ఎండలోకి వచ్చే ముందర తప్పనిసరిగా SPF 30-50 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించటం ఎండపడకుండా క్యాప్ పెట్టుకోవడం చాలా అవసరం. చర్మం పై ముడతలు, ముఖాన్ని అతిగా ఉపయోగించటం వలన […]

ఈ కాఫీ వెరీ స్పెషల్

ప్రతి రోజు ఒక వింత కబురు . ఒక కొత్త ఎక్సెపెరిమెంట్ నాలుకకు ఓ కొత్త రుచి. ఇదే మార్కెట్ ట్రెండ్. వినియోగదారుడు మోజుపడి ఒక వస్తువు కొనుక్కుని రుచి చూసి దానికి శాస్వతంగా ఒక కమిట్ మెంట్ ఇద్దామనుకునే లోపే ఇంకో వస్తువు క్యూలో ఉంటుంది. ఆ కొత్తదనపు తీరాల వెంట మనిషి పరుగో పరుగు. ఇప్పుడు పూట్టగోడుగుల్లో ఖనిజాలు, కాఫర్ ,నియాసిన్ పోటాషియం , ఫాస్పరస్. విటమిన్ సీ, ఐరన్ ఎన్నో పోషకాలున్నాయని తెలిసిపోయింది […]

సలాడ్ మంచి రుచి

బొప్పాయి పండే కాదు, పచ్చ బొప్పాయితో కూరలు కూడా ఎంతో బావుంటాయి. కూరగా,పచ్చడిగా, సలాడ్ గా దాన్ని హాయిగా తినవచ్చు. పచ్చ బొప్పాయి తురిమి ఎండబెట్టి అచ్చం కొబ్బరిపొడిలా ఉంటుంది కదా దాన్ని కూరల్లో కూడా వాడుకోవచ్చు. ఇందుకు పిండి పదార్ధాలు, స్టార్ట్ తో పాటు , కారైనా లిడ్స్ తో పాటు ,సోపోనిక్స్ అనే రసాయనాలు పుష్కలం. ఇందులో గాయాలను తగ్గించే ఎన్నో ఎంజైమ్స్ ఉన్నాయి. పచ్చ బొప్పాయిని ఔషధాలలో కూడా వాడతారు. పచ్చ బొప్పాయి […]

కుదిరితే కప్పు కాఫీ

సంతోషం వస్తే దాన్ని పంచేందుకు కప్పుకాఫీ తాగేద్దాం అనిపిస్తుంది. అలా కాఫీతో సంతోష పెట్టుకుని చూస్తూ ఆ ఇచ్చే కాఫీ పైన వాళ్ళ బొమ్మ వేసి మరీ ఇస్తే ఎంత స్పెషల్. కాఫీ మీద ఫోటోలు ప్రింట్ చెయోచ్చన్నమాట. క్రీంతో కాఫీ పైన ఒక పొరలో వేసి ఆహారానికి వాడే రంగులను ఉపయోగించి మన ఫోటోని ఉన్నది ఉన్నట్లు చక్కగా కాఫీ కప్పు పైన వేసి మరీ చేతికి ఇస్తారన్న మాట. ఇలా వట్టి కాఫీ పైన, మిల్క్ […]

పట్టు ఫ్యాషన్

వస్త్రశ్రేణిలో పట్టుకు ప్రధమస్థానం. ఈ పట్టు చీరెల్లో నుంచి లంగాల్లోకి ఫ్యాషన్ అనార్కలీ, పొడవాటి టాప్స్ కు తరలి వెళ్ళింది. చుడీ దార్లో పైన పట్టు చున్నిలు వేసుకునే వాళ్ళు ఇప్పుడు కంచి , పోచంపల్లి, ఉప్పాడ, ఆరణి ,ధర్మవరం ,బెనారస్ ఇలా రకరకాల పట్టులు అనార్కలి లాంగ్ టాప్ ల రూపంలోకి వచ్చేసి అమ్మయిల ఫేవరెట్స్ అయిపోయ్యాయి, ఫ్యాషన్ గా ఉన్నాయి. పట్టు అందాలతో మెరిసిపోయి రిచ్ లుక్ తోనూ కనిపిస్తాయి. క్రాప్ టాప్ లో […]

మహిళలు రావాలి

1984లో క్యాంపస్ ఇంటర్యూలు కేవీ కామత్ నన్ను ఐసీఐసీఐ కి ఎంపిక చేశారు. 1993లో ఐసీఐసీఐ కమర్షియల్ విభాగంలోకి అడుగుపెట్టినప్పుడు నేనే మొదటి ఉద్యోగిని అంటూ తన అనుభవాల పుస్తకం తెరిచారు చందాకొచ్చర్. ఫోర్బ్స్ ప్రపంచ 100 శక్తివంతమైన మహిళల్లో ఆమె ఒకరు. సమయపాలన, కఠోర శ్రమ ప్రాధన్యతలుగా ఎంచుకోవడం తెలిస్తే వ్యక్తిగత జీవితంలో విజయవంతంగా ముందుకు వెళ్ళోచ్చు అన్నారు చందాకొచ్చర్. మహిళలు ఎక్కువగా బ్యాంకింగ్ రంగాలు ఎంచుకుంటారు, బోర్డు పరీక్షల్లో అమ్మయిలే మొదటి స్థానాల్లో ఉంటారు. కాని […]

ఎన్నెన్ని రంగులు

ప్రపంచం మొత్తం మీద 1200 రకాల పుచ్చకాయలు ఉన్నాయి, మనకు ఎర్రనివే కనిపిస్తాయి. తెలుపు,నారింజ,పసుపు,గులాబీ రంగుల గుజ్జుతో పై భాగం ముదురు ఆకుపచ్చ, ఆకుపచ్చ మీద తెలుపు గీతలు, పసుపు పచ్చనివి , ఉదా రంగువి, పెద్ద మచ్చలు , చుట్టు చుక్కలు ఇలా ఒక్కో పండు ఒక్కో రుచి , ఒక్కో వర్ణం, ఇందులో 90 శాతం నిరు వీటిల్లో ఉండే బీటా కెరోటిన్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. కెరోటినాయిడ్లు, విటమిన్ సీ, పోటాషియం కొవ్వులను […]

ఏకాంతం కావాలి

కాస్తా టైమ్ దొరికితే ఏంచేస్తారు. ఏదో ఒక ముఖ్యమైన పని చేయాలనుకుంటారు, ప్లాన్ లు వేస్తారు నేనయితే ఆ ఖాళీ సమయాన్ని ఖాళీగానే గడుపుతాను, ఇంకేం పనులు పెట్టుకోను అంటుంది అనుష్క. ఏదైన రెగ్యూలర్ వర్క్ లు ఉంటే ఇక దానిపైనే మనసంతా తిరుగుతూ ఉంటుంది. అందుకే నాకు కాస్తా ఖాళీ దొరికితే ఇక నా గురించి నేనే ఆలోచించుకుంటా అంటుంది. వేరే పనులు లేకుండా ఖాళీగా అంటు ఉంటే నన్ను నేను వెతుక్కునేందుకు నాలో నేను మాట్లాడుకునేందుకు […]

ఎప్పటికి ఫ్యాషన్

తెల్లని ముత్యాలు ఎప్పుడు ఫ్యాషన్ స్టేట్ మెంట్సే. వెండి,బంగారు వన్ గ్రామ్ గోల్డ్ ఇలా ఏ నగలతో పొదిగినా ఆ నగకు ప్రత్యేకమైన అందం తెస్తాయి. బన్ని ముత్యాలైతే నాలుగైదు వరుసల్లోను నెక్లెస్ లు, హారాల్లాగాను కెంపులు, పచ్చలు, కలిపితే ఇంకొన్ని ఫ్యాషన్ నగలుగాను ముత్యాలు ఎప్పుడు బావుంటాయి. సంప్రదాయ చీరలు, పరికిణిలు, ఓణిలు పొడవాటి గౌన్ లు వేటికైన ముత్యాలు మంచి కాంబినేషన్. ఇక రోజువారి డ్రెస్ లకు కూడా ముత్యాలు వేలాడే చాంద్ బాలీలు, […]

ఒక్క అవకాశం ఇస్తే

ఆండ్రియా జెరెమియాకు కాస్తా ధైర్యం ఎక్కువే సినీ రంగంలో పురుషాదిపత్యమే ఎక్కువ అనేసిమ్ది. ఆమాటకొస్తే ఒక హీరోను సూపర్ స్టార్ ను చేస్తారు. కానీ హీరోయిన్ కు ఆ స్టేటస్ దక్కదు. హీరోయిన్స్ కుడా తగిన పాత్ర వస్తే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు. రైటర్స్ నాకోసం పవర్ ఫుల్ పాత్రలు సృష్టించి ఇస్తే నేను గ్లామర్ గా ఎంత బాగా కనిపిస్తానో అంతకంటే బాగా నటిస్తాను అంటుంది ఆండ్రియా. ఉత్తరాదిలో కొంత హీరోయిన్ లకు మంచి […]

సక్సెస్ ని ఊహించాను

కిర్రాక్ పార్టీతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టింది సంయుక్తా హెగ్డె. కన్నడంలో సక్సెస్ అయింది కనుక తెలుగులోనూ మంచి విజయాన్ని అందిస్తుందని అనుకున్నాను. నేటీవిటికి అనుగుణంగా కాస్తా మార్చారు. కాని ఒరిజినల్ సినిమాను పెద్దగా మార్పులు చెయ్యలేదు. కన్నడ సినిమాల్లో కాస్తా బిజీగా ఉన్నాను కాని ఇందులో పాత్ర నప్పుతుందని గాఢంగా అనిపించి ఒప్పేసుకున్నా అంటుంది సంయుక్తా హెగ్డె. భాషా సమస్య ఉంది కాని అది పెద్ద ఇబ్బంది పెట్టలేదు. డాన్స్ బాగా వచ్చు కనుక అది సమస్య […]

సర్దుకుపోతే అవకాశాలు

సముద్రంలో ఉండి మొసళ్ళతో పోరాడటం ఎంత కష్టమో ఈ రంగంలో ఉన్న వేధింపుల గురించి మాట్లాడటం అంతే కష్టం అంటోంది హీరోయిన్ సనాఖాన్. నోరు జారి వివాదాల్లో ఇరుక్కొవటం ఎందుకు? కెరీర్ పాడు చేసుకోవటం ఎందుకు అన్న ఉద్దేశ్యంతోనే ఎక్కువ మంది లైంగిక వేధింపుల గురించి మాట్లాడరు. హీరోయిన్లను లేదా ఆర్టిస్టులను గౌరవంతో చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సంఖ్యపరంగా తక్కువ మంది. నాకు వేధింపులు తప్పలేదు. అవకాశాల కోసం కో ఆర్డినేటర్స్ ని కలవాలి. ఈ […]

మతిమరుపు రాదు

యూనివర్సిటీ ఆఫ్ గోథెన్ బర్గ్ పరిశోధకులు ఒక అవసరమైన పరిశోధన పూర్తి చేశారు. వ్యయామానికి, మతిమరుపు కు దగ్గర సంబంధం ఉందంటున్నారు. 40,45 మధ్య వయసులో స్త్రీ లు సైక్లింగ్ , వాకింగ్ వంటి వ్యయామాలు క్రమం తప్పకుండా చేస్తే భవిష్యత్తులో ఈ డెమెన్షియా భారీన పడకుండా ఉంటారని ఈ ముప్పునుంచి 90 శాతం వరకు తప్పించుకొగలరని చెపుతున్నారు. వెయ్యి మంది మధ్య వయస్కులైన స్త్రీలపై ఈ అధ్యయనం జరిగింది. శరీరం చురుగ్గా ఉంచుకొగలిగే కొన్ని సమస్యలు […]

కొన్ని కరక్టే

కడుపులో ఉన్న బిడ్డకి, గర్భవతి గుండెల్లో మంటకి అవినాభావ సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు . గుండెల్లో మంట,వాంతులతో బాధపడే తల్లులకు పుట్టే బిడ్డ జుట్టు ఒత్తుగా, పోడవుగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఇలాంటివి ఇళ్ళల్లో పెద్ద వాళ్ళు అంటూ ఉంటారు. గర్భవతులనూ చూసి అనుభవంతో కొన్ని నిర్ణయాలు చేస్తారు పెద్ద వాళ్ళు. పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే కడుపులో ఉన్న బిడ్డ మంచి రంగులో పుడతాడని పెద్దవాళ్ళు అంటారు. శాస్త్రీయంగా దానికి రుజువు లేకపోయినా ఆరోగ్యం […]

ఈ భోజనం శక్తి ఎంత ?

ఫుడ్ ట్రాన్స్ పరెన్సీ ట్రెండ్ వస్తోంది. రెస్టారెంట్స్ లో వండి వడ్డించే బిర్యానీలు , దోసెలు, ఇండ్లీలు ఏదైనా సరే వాటిలో ఉండే పోషక విలువలు న్యూట్రిషన్ వ్యాల్యూలు మెనూ కార్డుల్లోనే ధరలతో పాటు ముంద్రించే రోజులు వచ్చేస్తున్నాయి. నిజమే కాదా మనం తినే ఆహారంలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో ఎంత విలువైన పోషకాహారం తింటున్నామో మనకే తెలియదు కదా. ఈ వివరాలు చెప్పటమో, ఫుడ్ ట్రాన్స్ పరెన్సీ . ఈ ఏడాది ప్రతి వస్తువుపై ధరల […]

ఉప్పుతోనూ సమస్య

మామూలుగా ఉప్పు ఎక్కువగా తీసుకొనే వాళ్ళలో 72 శాతం మంది మధుమేహం భారీన పడుతున్నారని డాక్టర్లు చెపుతున్నారు. రోజుకు 1.25 స్పూన్ ఉప్పు ఎక్కువగా తీసుకొన్న షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువే అంటున్నారు . ఉప్పు కారణంగా ఇన్సులిన్ నిరోధకత తగ్గుతోందని అదే మధుమేహానికి కారణం అవ్వచ్చని చెపుతున్నారు. కొన్ని వందల మందిపై దీర్ఘకాలం చేసిన పరిశోధన ఈ విషయాన్ని నిర్ధారించిందని ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండమని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.

సెల్ఫీతో ముడతలు

ఇది సెల్ఫీల యుగం. ప్రతి నిమిషం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వాళ్లు ,సెల్ఫీలు పోస్ట్ చేస్తూనే ఉంటారు. చివరకు షాపింగ్ కు వెళ్ళినా దాన్నీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారు. ఒక సెల్ఫీ పెట్టేస్తారు. ఇలాంటి సరదానే ముఖ సౌందర్యాన్ని దెబ్బ తీస్తుందంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖంలో ఎటువైపు నుంచి ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటారో , ఆ వైపున ఉండే చర్మం ముడతలు పడుతోంది చూసుకోండి అంటున్నారు. ఫోన్ నుంచి వెలువడే కాంతి, రేడియేషన్ చర్మ […]