దోమలు,ఈగలు పరార్
తలస్నానానికి కుంకుడు కాయలు వాడకం ఏనాడో దూరం చేశారు. కానీ ఈ కుంకుడు రసం జుట్టుకే కాదు ఖరీదైనా పట్టు ,నేత చీరెలనూ మిలమిల మేరిసేట్టు చేస్తాయి. ఈ రసంతో ఉతికితే రంగు పోదు , కొత్త దనం కూడా మాసిపోదు. అలాగే కుంకుడు రసంతో వెనిగర్ కలిపి గాజు సామాన్లు, కిటికీల అద్దాలు తుడిస్తే మిలమిల మెరుస్తాయి. స్నానాల గదిలో కుంకుడు రసంతో బేకింగ్ సోడా, ఓ స్పూన్ బొరాక్స్ పౌడర్ కలిపి బాత్ రూమ్ […]
అందమైన టోపీలు
బ్రిటన్ లోని రాయల్ అస్కట్ లో ప్రంపచంలోనే మేలైన రేసు గుర్రాల పోటీ జరుగుతుంది. బ్రిటీష్ రాణి ఎలిజబెత్-2 తో పాటు రాజ కుటుంబానికి చెందిన వారంతా ఈ గుర్రపు పందాలకు హాజరవుతారు. లండన్ లోని సంపన్న వర్గాలు పోటీలో పాల్గొంటారు. అయితే ఈ కార్యక్రమపు వింత ఏమిటంటే మహిళలు ధరించే వింత వింత టోపీలు వీటిని ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్స్ పోటీ పడతారు. రాయల్ పోటీలో గెలిచిన గుర్రానికి ఇచ్చే ఫ్రైజ్ మనీ కూడా కోట్లలోనే […]
ఇప్పుడు ఇంటికివే అందం
పాతకాలం ఇళ్ళలో గోడలు సందు లేకుండా ఇంట్లో వాళ్ళ ఫోటోలు నిండి ఉండేవి. ఇప్పుడు ఆనవాయితీ తప్పింది. గోడలకు మంచి అందమైన పెయింటింగ్స్ లేదా సాదాసీదా గోడలు కనిపిస్తున్నాయి. అయితే ఇలా ఖాళీగానూ బ్రాండ్ లేదనుకున్నారో ఏమో పర్సనలైజ్ ఫోటో వాల్ స్టిక్కర్లు వస్తున్నాయి. పాత కాలంలో లాగా అందరిని కాకపోయినా మనకో,పిల్లలకో , మొత్తం ఫ్యామిలీ కలిసి ఉన్నదో మనసుకు నచ్చిన తరహాని అంటించుకోవడం ట్రెండ్. ఫీల్ ఆప్ పాప్ ఆర్ట్, కార్టున్ చిత్రాలు ఇప్పుడు […]
ఇంకో స్టైల్
ఈ ఫ్యాషన్ బాగుందే అని చేతిలోకి తీసుకుని సరిగా చూసేలోపే ఇంకో కొత్త ట్రెండ్ దిగుతుంది. ఫ్యాషన్ ప్రపంచంలో నెయిల్ ఆర్ట్ తెలిసిందే, పొడవైన గోళ్ళు లేని వారి కోసం నెయిల్ ఎక్స్ టెన్షన్లు వస్తున్నాయి. ఇది కాస్తా పాతదే . ఈ ఎక్స్ టెన్షన్లలో ఇంకొ కొత్త ఫ్యాషన్ దిగుమతి అయింది. ఆది యూనికార్న్ ఫ్యాషన్. ఐదు గోళ్ళలో ఒకటి పోడవుగా , ఇంకోటి చెమ్కి మెరుపులు, ఒకటి స్పైరల్ ఆకరం, ఇంకోటి ఇంకో వర్ణంతో […]
ఈ సమయంలో
నెలసరి ముందు నుంచే కొందరికి భావోద్వేగాల పరమైన చికాకు, కోపం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమయంలో నడుము, కీళ్ళ నొప్పులు భాదిస్తాయి. పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. ఏమి తినాలనిపించదు. వీటి నుంచి ఉపశమనం కోసం ముందుగా రిలాక్స్ అవ్వాలి. విశ్రాంతి తీసుకున్న గదిలో ఒక మూల తాజాగా వాసనలు వచ్చే పూలగుత్తిని ఉంచుకొవాలి. పరిమళాలు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. అలగే మంచి సువాసన ఇచ్చే కొవ్వోత్తి వెలిగించిన పర్లేదు. నొప్పుల ఉపశమనానికి హీటింగ్ ప్యాక్స్ దొరుకుతాయి. వాటితో […]
ఎవరికి వారే
ఏ సినిమాలోనో , ఏ మ్యాగ్ జైన్ కవర్ పేజ్ పైనో చూసి ఒక సినీ యాక్టర్ వేసుకున్న డ్రెస్ నో, ఏ మోడల్ ధరించిన నగనో చూసి మోజు పడిపోతారు. కాని అందరికి ఒకే రకమైన శరీరాకృతి ఉండదు, ఒకళ్ళకు నచ్చినట్లు ఇంకొకళ్ళకు బావుండవు. శరీరపు రంగు, ఎత్తు,బరువు ఎన్నో తేడాలుంటాయి. అందుకే ఎవరికి నప్పే దుస్తులు వాళ్ళు ఎంపిక చేసుకొవాలి. సన్నగా,పొడుగ్గా ఉంటే అన్ని రకాల వస్త్రశ్రేణి నప్పుతుంది. ఇవి సాదాగా ఉంటే ఇంకా […]
అస్సలు చేయరు
చేస్తున్న పని కింద పడేసి ఇంకా ఇవ్వాల్టికి నేనే పని చేయను అని ఒళ్ళు మండేంత కోపం తెప్పించే సర్వే గురించి చెప్పుకొందాం. ఒక అంతార్జాతీయ సర్వేలో టర్కీ,కొరియా,నార్వే,ఇటలీ,కెనడా, జర్మనీ, అమెరికా …ఇదిగో ఇండియాతో సహా ఒక సర్వే నిర్వహించారు. పురుషులు ఇంటి పనికి ఎంత సమయం కేటాయిస్తారు? ఇదే విషయం ఇంటి పని అంటే అది ఆడవాళ్ళ ఆస్తి హక్కులాగా నెత్తిన పెట్టుకునే బ్రహ్మాండం. అసలా పని వాళ్ళదే… అని మన దేశపు మొగాళ్ళు అనుకుంటారని […]
మాయలో పడొద్దు
షాపింగ్ కు వెళుతున్నారా అయితే ఏం కొనాలో రాసుకున్నారా, ఎంత కొనాలో అంతే డబ్బు తీసుకెళుతున్నారా? మీరు ఆశ్చర్యంగా చూస్తే పొరపాటు చేస్తున్నట్లే. షాపింగ్ మాల్ అంటే అదో మాయా ప్రపంచం. ఆ మాయా ద్వీపంలోకి వెళ్ళి సరిగ్గా మనం అనుకున్నవెమో అవే కొనుక్కుని రావటం గొప్ప ఆర్టే, ఆకర్షనియంగా కనిపించే ప్యాక్ లు, ఆఫర్లు రా రమ్మని పిలుస్తాయి. చేతిలో క్రెడిట్ కార్డు ఉందా ? ఇక దభేలు మని ఆ మాయా ద్వీపంలోకి పడిపోతాం. […]
ఈ రెండు
నీళ్ళు తాగంటం వల్ల ఆకలికి అడ్డుకట్ట వేయవచ్చు అంటున్నారు పరిశోధకులు. బాగా ఆకలి వేసినప్పుడు అదేపనిగా ఆహారం తీసుకోవటం కన్నా ఒకటి రెండు గ్లాసుల నీళ్ళు తాగమంటున్నారు. భోజనం చేసే సమయంలో కూడా నీళ్ళు ఎక్కువగా తాగితే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు పెరగకుండ ఉండటం కోసం చేసే ప్రయత్నాల్లో ఇది ఒకటి. అలాగే బరువు పెరగకుండా వ్యాయమం చేయటం అంటే ఒకటి నడక, రెండోది సైక్లింగ్ ఈ మధ్య ఓ మంచి రీసెర్చ్ […]
దంతాల ఆరోగ్యానికి ఛీజ్
ఆహారపదార్ధాలలోని చక్కెరతో సహజంగా పట్టే గార వల్ల దంతాలకు హాని కలుగుతుంది. చీజ్ ఈ సమస్యను తగ్గిస్తుంది అంటున్నారు డాక్టర్స్. దంతాల పైన ఉండే ఎనామిల్ పొరను కాపాడుతుంది ఛీజ్. ఇందులో ఫాస్పేట్ , క్యాసిన్ అనే హానికరం కాని రసాయనాలు ఉంటాయి. ఇవి కాల్షియం తో కలిసి దంతాల పై ఏర్పడే సూక్ష్మమైన పగుళ్లను కప్పేస్తాయి. తగు మొతాదులో ప్రతి ఒక్కరు ఛీజ్ ను ఆహారంలో తీసుకుంటే అది మనకు సంతులిత ఆహారంగా ఉండి శరీరంలోని అన్ని […]
స్కిన్‌ని నట్స్
తక్కువ క్యాలరీలతో అధికమైన ప్రయోజనం ఇచ్చే పిస్తాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. గుప్పెడు పిస్తా పప్పులో వంద క్యాలరీలు ఉంటాయి. ఆహార నిపుణులు వీటిని స్కిన్‌ని నట్స్ అంటారు, ఇవి నెమ్మదిగా వలుచుకుని తినాలి కనుక పూర్తిస్థాయి క్యాలరీల సంఖ్య నలభై ఒక్క శాతానికి మించదు. వీటిలో విటమిన్ బీ6, కాఫర్ , మాంగనీస్ ,ప్రోటిన్స్, ఫైబర్ , థియామిన్ , ఫాస్పరస్ చాలా ఎక్కువ. అలాగే విభిన్న యాంటీ ఆక్సిడెంట్స్ , న్యూట్రిషియన్లు అత్యధికం. ఇవి […]
నిమ్మరసం చాలు
నెయిల్ కలర్స్ వల్లనో, సరిగా క్లీనింగ్ లేకపోయినా తరచూ పెయింటింగ్స్ వేయటం వల్ల నెయిల్ బాడి పై పసుపు పచ్చని మరకలు పడతాయి. వాటిని పాలిష్ ఎక్కువ చేసి కవర్ చేయాలన్న మరి పాడైపోతాయి. ఈ మరకలు తొలగించాలంటే తాజా నిమ్మరసాన్నిగోళ్ళ మరకల పై పూసి కొద్ది నిమిషాలు వదిలేసి పొడిగా ఉన్న మెత్తని వస్త్రంతో తుడిస్తే పోతాయి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేస్తే గోళ్ళు మెరుస్తూ ఉంటాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ లో […]
చదువుకున్న సర్పంచ్
మేవాట్ సర్పంచి షహనాజ్ ఇప్పుడు ఉన్నత చదువులు చదివిన సర్పంచిగా రికార్డు సృష్టించింది. ఎంబీబీఎస్ పూర్తి చేసి సర్పంచిగానే కాదు, డాక్టరమ్మగా సేవలు అందిచనున్నది. రాజస్థాన్, హర్యానా కలిసి పంచుకుకొంటున్నా ప్రాంతం మేవాట్. ఇక్కడ ఆడపిల్లల్నీ స్కూల్ కు పంపరు. తలపైన ముసుగు ఉండాల్సిందే ఆఊల్లో పుట్టిపెరిగిన షహనాజ్, డాక్టర్ కోర్స్ పూర్తి చేసింది. మేవాట్ సమీపంలోని గడ్డన్ గ్రామంలో ఆమె తాత సర్పంచిగా పని చేశాడు. తాత తర్వాత మనువరాలు ఆ ఊరి సర్పంచి అయ్యింది. […]
హయినిచ్చే సువాసన
కమాల పండ్ల వాసన ఒత్తిడిని మాయం చేస్తుందని అంటున్నాయి పరిశోధనలు. ఆ వాసన మనసుకి హాయి గొలిపినట్లు పరిశోధనలో వెల్లడైంది. పైగా మానసిక ఒత్తిడి ఉన్నవాళ్ళకు ఈ వాసన మరీ మంచిదని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం చెపుతోంది. ఏదైనా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన వాళ్ళు జీవితంలో ఏదో దశలో ఒకలాంటి భయందోళనలకు ఒత్తిడికి డిప్రెషన్ కు లోనవుతారు. ఈ కమలాల నుంచి తీసిన తైలం సువాసన ఎలాంటి ఒత్తిడి నుంచి అయిన […]
వేసవి షూస్
ఎండల్లో ప్రతిదీ చిరాకుపెడుతోనే ఉంటుంది. ముఖ్యంగా షూలు వేసుకొంటే వేడికి లోపల కాళ్ళు తడిసిపోతాయి అసౌకర్యం అనిపిస్తుంది. ఈ ఇబ్బందిని సమాధానంగా సూపర్ కూల్ షూ పేరుతో షూ అడుగు భాగంలో రంధ్రాలుండేలా రూపొందించారు. లేదర్ , రబ్బర్, కాన్వాస్ జ్యూట్ తరహా షూస్ వస్తున్నాయి. జాట్ షూస్ స్టయిల్ గా కాలికి చల్లగా ఉంటాయి. కీన్ కంపెనీ యూనిక్ షూ అయితే రబ్బర్ తాళ్ళతో కాలికి సుఖంగా గాలి తగిలేలా సౌకర్యంగా ఉన్నాయి. ఫెండీ కంపెనీ సాక్స్ […]
అది ప్రపంచ భాష
ప్రపంచంలో ఏ మూలకెళ్ళిన ఎవరితోనైనా మాట్లాడగలగే భాష నవ్వు. ఒక్క చిరునవ్వు ఎలాంటి వాళ్ళనైనా స్నేహితుల్ని చేస్తుంది. ప్రాచీన చైనీలు ఆత్మానందం అన్నదాన్ని ప్రత్యేకంగా బోధించేవాళ్ళట. తమలో తామే నవ్వుకోటం వల్ల ఆనందం, ఆరోగ్యం ఆయుష్షు పెరుగుతాయట. ఒక అధ్యయనం ప్రకారం 1950లో ప్రజలు రోజుకు 18నిమిషాలు నవ్వితే ప్రస్తుతం ఆ సమయం 4, 6 నిమిషాలకు పడిపోయింది. రోజుకు 15 సెకన్లు ఎక్కువ నవ్వితే ఇంకా రెండు రోజులు ఆయుష్షు పెరిగిందని అర్ధం చేసుకోవాలట. ఎక్కవ […]
మెదడుకి నడక లాభం
మనం నడుస్తున్నప్పుడు పాదాలకు వత్తిడి వల్ల మెదడుకు రక్త ప్రసరణ ఎక్కువగా అవుతుందట. 500 మందిని ఎంపిక చేసి వాళ్ళు నడిచే సమయంలో మెదడుకి రక్తాన్నీ చేరవేసే కెరోటిడ్ రక్తనాళాలను ఆల్ట్రా సౌండ్ పరిజ్ఞానం ద్వారా పరిశీలించారు. పరుగెత్తటం కంటే కూడా నడిస్తేనే పాదాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది. మెదడుకు చక్కగా రక్తసరఫరా జరుగుతోంది. సైకిల్ తోక్కుతున్న తక్కువ సరఫరానే జరుగుతోన్నట్లు రికార్డు అయ్యింది. కనుక అన్ని వ్యయమాల కంటే మెదడు పనితీరు మెరుగ్గా పనిచేసి మెదడుకి […]
ఎంతందం
అందమైన ఇళ్ళు అలంకరణలో ఇప్పుడు స్టోన్ పజ్ నడుస్తోంది. ఇంటీరియర్స్ లో ఇప్పుడు రాళ్ళ అలంకరణే టాప్ . హాలు, బెడ్ రూమ్స్ , కిచెన్ లు స్టోన్ ప్యానల్ షీట్స్ తో డెకరేట్ చేయటం ఫ్యాషన్ . సిమెంట్ గోడలకు రాతి షీట్లు అలంకరించేస్తారు. ఈ రాతి పలకలు కాకుండా పూర్తిగా రాళ్ళతోనే డెకరేట్ చేస్తున్నారు. డ్రాయింగ్ రూమ్ రాళ్ళ నీటి తోట్టె అరెంజ్ చేసి అందులో నీళ్ళు నింపెసి తామర పువ్వులతో నింపెస్తే ఇల్లు అందంతో నెంబర్ […]
ఇప్పుడు అందమైన ఫుడ్
కంటికి ఇంపుగా ఉంటే కడుపుకి ఇంపుగా ఉంటుందట. మరి ఈ విషయం కనిపెట్టే కాబోలు జర్మనికి చెందిన జషుడ్ లవర్ ఒక స్ప్రే పెయింట్ ను కనిపెట్టాడు. ఆహారపదార్ధాల పైన చల్లే ఇది బంగారు ,వెండి,ఎరుపు ,నీలం రంగుల్లో దొరుకుతుంది. ఇది చల్లితే రుచి ఏమీ మారదు కాని ఆహారం రంగు మారిపోతుంది. ఎలాంటి అనుమానం లేకుండా ఈ స్ప్రే తో పళ్ళెంలో మిలమిల మెరిసే వెండి చేపలు, బంగారు రంగు చికెన్ లు కమ్మగా తినేయోచ్చు.
నాన నివ్వాలి
భాదం పప్పులు నానబెట్టి తింటేనే అందులోని పోషకాలు పూర్తిగా అందుతాయి అంటారు పోషక నిపుణులు. బాదం పై తొక్కలో ఉండే టాన్సిల్స్ భాదం లోని పోషకాలు శరీరంలో ఇంకకుండా అడ్డుకుంటాయి. అందుకే వాటిని రాత్రివేళ నానబెడితే ఉదయానికి ఆ తొక్క వలిచి తినవచ్చు. లేదా ఒకేసారి ఎనిమిది గంటలు నానబెట్టి పై తొక్క తీసేసి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. నానబెట్టిన పప్పులో లైపేజ్ అనే ఎంజైమ్ విడుదల వల్ల కొవ్వులు త్వరగా వ్యర్ధం అవుతాయి, ఇందులోని విటమిన్ […]
