ఎండల్లో జాగ్రత్త
జుట్టు ధృఢంగా ,బావుండలంటే మాడు శుభ్రంగా పొడిగా ఉంచుకొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. తలకు పెట్టుకోనే డై ,హెన్నా,ఆయిల్స్ అన్నీ బాగా పోయేలా శుభ్రం చేయాలి. మాడు ఆరోగ్యంతో దురదలు రాకుండా ఉంటాయి. సహజమైన నూనెతో మసాజ్ చేసి తల స్నానం చేయాలి. గోరు వెచ్చని నీళ్ళతోనే తలస్నానం చేయాలి. వేసవిలో మాడుకు చల్లదనం ఇచ్చే గోరింటాకు పూత వేసుకోవాలి . ఎండ పడకుండ స్కార్ఫ్ ధరించాలి. గొడుగు వెంట తీసుకుపోవాలి హెయిర్ స్ప్రే లు, జెల్స్ […]
డైట్ ఊసే ఉండదు
ఈ హాలీడే ట్రిప్ లో నెదర్లాండ్ లోని అమస్టర్ డామ్ వెళ్ళాను అక్కడ పూల తోటలో ఎంతో ఎంజాయ్ చేశాను. అసలు హాలీడే అంటేనే బాధ్యతలు లేని సెలవు కదా. ఒక్క సారి ట్రిప్ వేస్తే ఎనర్జిటిక్ గా ఫ్రెస్ గా ఉంటుంది అంటోంది త్రిష. నాకు ట్రావెలింగ్ ఇష్టం, షాపింగ్ టూర్స్ అంటే ఇంకా ఇష్టం.దుబాయ్,లండన్ ,న్యూయార్క్ వంటివి షాపింగ్ కు బెస్ట్ ప్లెసెస్. అడ్వాంచర్స్ ఉంటేనే ఇంకా బావుంటుంది. ట్రావెలింగ్ లో డైట్ అస్సలు […]
ఇవి తినేవి
కెనడాలోని డోరిటో అనే చిప్స్ కంపెనీ వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చి వినియోగదారుల మనసు దోచేసింది. ప్లాస్టిక్ ,గులాబీ కొమ్మలకు తినేందుకు వీలయ్యే గులాబీ పువ్వుల రేకులు లాగా తయారు చేసిన చిప్స్ అంటించి ఆ అందమైన పూల బొక్కేలు సోషల్ మీడియాలో పెడితే వీటికి లెక్కలేనన్ని ఆర్డర్లు వచ్చి పడుతున్నాయట, పూల చిప్స్ తినేందుకు ప్రజలు క్యూలు కట్టారు.
అందం ఆరోగ్య రహస్యం ఇదే
వాకింగ్, యోగా ఏదైనా ఏ వ్యయామం అయినా సరే శృంగార జీవితానికి సాటిరాదు అంటుంది ఒక రిపోర్ట్. సుఖంగా అన్యోన్యంగా జీవించే దంపతులు ఆరోగ్యంగా జీవించవచ్చు. శృంగారం కారణంగా ఎండార్ఫిన్లు విడుదలై పని ఒత్తిడి తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. భార్య,భర్తల శృంగార జీవితం వాళ్ళ శరీరాలను పటిష్టంగా , ఆరోగ్యంగా ఉంచి వాళ్ళకి ఆరోగ్యం, అందం ప్రసాదిస్తుందని రిపోర్టు చెపుతుంది.
హ్యాపీగా ఉంటారు
కొన్ని వేల మంది పై దీర్ఘకాలం అధ్యాయనం చేసి గర్భిణులు వ్యాయామం చేయటం వలన ప్రసవంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోరు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. నొప్పులు ఎక్కువ భాదించవు శరీరాకృతి పాడవ్వదు. శరీరం తేలికగా ఉంటుంది, వ్యయామం వల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంటారు అంటున్నాయి అధ్యయనాలు.
కాళ్ళు కాలవు
ఎండల్లో బయటకు చెప్పులు లేకుండా నడవటం చాలా కష్టం. ఇక గుళ్ళు,గోపురాలకు బయటే చెప్పులు వదిలెయ్యాలి, గచ్చు మండిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎడ్ హెసివ్ ఫుట్ ప్యాడ్స్ కాళ్ళకు అంటించుకొవచ్చు. ఇది మందంగా ఉండే బట్ట లాగా ఉంటుంది, హ్యాండ్ బ్యాగ్ లో పట్టుకుపోయి కాళ్ళకు అంటించుకుని సులభంగా నడిచిపోవచ్చు.
ఎంత అందంగానో
ఎండల్లో పల్లెటూర్లలో లాగా కుండల్లో చల్లని నీళ్ళు తాగితే లేదా చల్లని మజ్జిగ తాగితే అనుకుంటే అది పెద్ద కష్టం కాదు. చక్కని అందమైన డిజైనర్ కుండలు ఆన్ లైన్ లో అమ్ముతున్నారు, ఆర్డరిస్తే ఇంటికొచ్చేస్తాయి, ఎలా ఉన్నాయో చూడాలనుకుంటే మిట్టీ కూల్ ఏకో ఫ్రెండ్లీ కుండల కోసం చూడోచ్చు.
ఎండకాలపు కానుక
ఎండల్లో తాటి ముంజలు వస్తాయి, మండే ఎండకు ఇవి దాహ శాంతిని ఇస్తాయి. ఈ ముంజల్లో పోషక విలువలు చాలా ఎక్కువ, 100 గ్రాముల ముంజల్లో 43 కెలరీల శక్తి ఉంటుంది. ఏ,బీ,సీ విటమిన్లు ఉంటాయి. పొటాషీయం చాలా ఎక్కువ, ఇంకా ఐరన్ , జింక్ ఫాస్పరస్ , కాల్షీయం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి తింటే డీ హైడ్రేషన్ రాదు, ఎలాంటి అనారోగ్యాలు రావు. పెద్దలు,పిల్లలు అందరు తినోచ్చు.
లక్షల ఖరీదు
స్పెయిన్ కంపెనీ లాడ్రో స్పిరిట్ ఆఫ్ ఇండియా పేరుతో ప్రతి సంవత్సరం ఖరీదైన దేవుళ్ళ విగ్రహాలు తయారు చేస్తుంది. స్పెయిన్ లో 1953 లో ప్రారంభమైన ఈ చిన్న సంస్థలోనే వినాయకుడు, పార్వతిదేవి, శివుడు, రామలక్ష్మణులు సీత, ఆంజనేయ స్వామి వంటి శిల్పాలు చేస్తుంది. ఒక్కో విగ్రహం ఏడు నుంచి ఎనిమిది లక్షల ఖరీదు చేస్తుంది. ఈ సంవత్సరం వెంకటేశ్వరస్వామి విగ్రహం కూడా తయారు చేస్తున్నారట. అదీ విషయం సరదా వేస్తే సైట్లో ఈ అందమైన దేవుళ్ళ […]
ఇన్నేళ్ళకీ మారని అందం
యంగ్ డాన్ అని చైనా సెంట్రల్ టెలివిజన్ సెంటర్ లో వాతావరణ వార్తలు చదివే అమ్మాయి ఫోటోలు ఇంటర్ నెట్ లో వైరల్ అయ్యాయి . ఆమె రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. ఒకటి 1996లో 22 ఏళ్ళ వయసులో రెండోది ఇప్పటి ఫోటో 44 ఏళ్ళ వయసు. ఏ మాత్రం మారని సౌందర్యం వయసు ఎక్కడో ఆపేసినట్లు కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో లైక్ ల వర్షంలో తడుస్తున్నాయి.
నాన్న కూచి బావుంది
నిహారిక, నాగబాబు తండ్రి కూతుళ్ళు నటించిన వెబ్ సిరీస్ నాన్న కూచి అందరి మన్ననలు అందుకుంటుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ నీహారికా. ఈ వెబ్ సిరీస్ కు నిహారిక తన సొంత ప్రొడక్షన్ హౌస్ పై నిర్మించింది. కథ డిఫరెంట్ గా ఉందని తండ్రీ కూతుళ్ళ ప్రేమాభిమానాలు బాగా స్క్రీన్ పై చూపించ గలిగారని ప్రేక్షకులు మెచ్చుకున్నారు.
అన్ని దొరకవు
మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనం మనకి ఇచ్చుకునే గిఫ్ట్ ఇదే అంటుంది కాజల్ అగర్వాల్. ఈ సినిమా ప్రపంచం నాకెన్నో నేర్పింది. పదేళ్ళ కెరీర్ లో నేను ఎంతో పొందాను, ఎన్నో మిస్ అయ్యాను కూడా, ముఖ్యంగా ప్రైవసీ పోతుంది అదే సమయంలో హీరోయిన్ గా పేరు వచ్చింది. స్టార్ ని అన్నది ప్రపంచం అందుకు ఎంతో సంతోషం. కోరిక నెరవేరింది కాని స్వేచ్చ పోయింది, పబ్లిక్ ఫిగర్ వి అవుతున్నావంటే ప్రైవేట్ లైఫ్ పొగొట్టుకోవాలి. కాని […]
పచ్చివే మంచివి
రా ఫుడ్ ఆరోగ్యమేనా అని చాలా మందికి డౌట్, శరీరం పచ్చి కూరగాయలు, జ్యూస్ లు తీసుకుని ఆరోగ్యంగా ఉంచగలరా అని సందేహం. కాని శరీరంలోని జీవక్రియ సంభందిత కార్యకలాపాల్లో రా ఫుడ్స్ చురుకైన పాత్ర పోషిస్తాయంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఎంజైమ్స్ లేకుండా శరీరం ప్రోటీన్లు, ఫ్యాట్స్, కార్బో హైడ్రెడ్స్ , విటమిన్లను ఎముకలు, శిరోజాలు, చర్మ కండరాలు హార్మోన్లను ఉపయోగించుకోలేవు. పైగా రిఫైండ్ పదార్ధాల్లోని సింథటిక్ విటమిన్ల కంటే తాజా పచ్చి పదార్ధాల్లో లభించే విటమిన్లు,ఖనిజాలను శరీరం […]
సుషి చేసే అద్భుతం
జపాన్ వాళ్ళకి దాదాపు అందరికీ అందమైన దట్టమైన వెంట్రుకలు ఉంటాయి. వాళ్ళలో దాదాపు ఎవరికీ బట్టతల ఉండదు. వాళ్ళు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో 150 మైక్రోగ్రాముల సుషి అనే సముద్రంలో పెరిగే మొక్కను చేపలు ,రోయ్యలతో కలిపి తీసుకొంటారు. అలాగే జుట్టు బాగా పెరిగే పోషకపదార్థాలు కూడా తింటారు. సముద్రంలో పెరిగే సుషి అన్న కలుపు మొక్కతో శిరోజాల ఎదుగుదల బావుంటుందని వాళ్ళ నమ్మకం .ఈ మెక్కలో ఐయోడిన్ లవణాలు అధికం .ఈ కారణం వల్లనే వాళ్ళకి […]
పట్టు కుచ్చులాంటి జుట్టు
జుట్టు ఆరోగ్యంగా , తెల్లబడి పోకుండా ఉండాలంటే ఇంట్లో చేసిన ఈ మిశ్రమం వల్ల మంచి ఫలితాం ఉంటుంది. జుట్టు పొడిబారనివ్వదు కూడా. గోరింటాకు పోడిలో ఎండిన అరటి పండు , పుల్ల మజ్జిగ బాగా కలిపి ఉంచితే నానిపోయి మెత్తగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే ఇది జుట్టును ఆరోగ్యంగా పెంచేందుకు సహకరిస్తుంది. జుట్టు పొడి భారి పోకుండా పట్టులా మెరుస్తూ ఉంటుంది. ఈ ఎండలకు ఇది […]
ఊరి పేరుతో ప్రసిద్ధి
మంగళగిరి ప్రత్యేకం మంగళగిరి కాటన్స్ చీరెలతో పాటు కాటన్ కుర్తాలు ,దుపట్టాలు ప్రత్యుకమైన నేతతో అందంగా ఉంటాయి. చిన్న పాటి జరీతో అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి. వైట్ ,క్రీమ్ కలర్ మంగళగిరి కాటన్స్ పైన బ్లాక్ డిజైన్ అందంగా ఉంటుంది. కాటన్ తో పాటు మంగళగిరి పీకో చీరెలు కొద్దిపాటి మెరుపుతో పట్టు చీరెలకు తీసిపోకుండా ఉంటాయి. ఎ వయసు వారికైనా బావుండే ఈ కాటన్ ప్రకృతి అందాలు అందమైన నెమళ్ళ, తీగలు, పువ్వులతో మీకు […]
పెదవులు నలుపా?
చాలా మందికి పెదవులు,పెదవులు చుట్టు నల్లగా ఉంటాయి. అందరికీ లిప్ స్టిక్ ఇష్టం వుండదు. సహజమైన మెరుపుతో పెదవులు ఉండాలనుకుంటే రెండు పూటలా పండ్లు కూరగాయాలు నీళ్ళు అవసరమైనన్ని తీసుకొంటూ ఉంటే పెదవులు చక్కని మెరుపుతో ఉంటాయి. కాస్త సెనగ పిండిలో భాధం నూనె కలిపి పెదవుల చుట్టు రాస్తే నెమ్మదిగా నలుపు పోతుంది. తాజా కలబంద గుజ్జు రాసినా ప్రయోజనం ఉంటుంది. ఓట్స్ పిండి చేసి పెదవుల చుట్టు మసాజ్ చేసినట్లు మృదువుగా రుద్ధితే మృతకణాలు […]
ఎక్కువ అరలుండాలి
ఉద్యోగానికి వీకెండ్ ప్రయాణాలకు యుటిలిటి బ్యాగ్ ప్రాక్టికల్ గా ఆర్గానైజ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. ఖరీదైన బ్యాగ్ అయినంత మాత్రానా ప్రతి బ్యాగ్ యూజ్ ఫుల్ గా ఉంటుంది అనుకునే వీలులేదు. వీకెండ్ కోసం బ్యాగ్ బరువు తక్కువగా,తేలికగా ,ఎక్కువ అరలతో , కంపార్ట్ మెంట్స్ తో ఉండాలి. డీప్ బ్రౌన్, బ్లాక్ , గ్రే వంటి క్లాసిక్ కలర్స్ చాలా బావుంటాయి. ఉద్యోగం కోసం బయటటికి వెళ్ళేందుకు అన్నీ విధాలా వాడుకునేందుకు చక్కని నాణ్యమైన బ్రాండ్ […]
బాగా పని చేస్తుంది
ఆయిల్స్ ,షాంపూలు ,కండిషనర్స్ ఏవి వాడుతున్న ఈ వేసవి ఎండకు జుట్టు పొడిగా ,ఎండినట్లు అయిపోతుంది. ఈ వాతావరణానికి దుమ్ము కూడా తోడవుతుంది. ఖరీదైన ఆయిల్స్ కంటే ఇంట్లో తయారు చేసుకోగలిగే ఈ మిశ్రమం జుట్టును చక్కగా కాపాడుతుంది. కొబ్బరి పాలు, ఆలివ్ ఆయిల్ నిమ్మ రసంతో జుట్టు చక్కగా మెరుపులు మెరుస్తుంది. ఈ మూడు కలిపి ఓ బౌల్ లోకి తీసుకొని, జట్టును చిక్కులు లేకుండా దువ్వుకుని , కుదుళ్ళకు పట్టేలా ఈ మిశ్రమాన్ని పట్టించి […]
చెకింగ్ మంచిదే
ప్రతి రోజు బరువు తూచే యంత్రంపై నిలబడి బరువు చెక్ చేసుకొంటూ నోట్ చేసుకొంటూ వుంటే ఆ ఫలితాలు చెప్పలేని ఆనందం ఇచ్చి, ఎంత కష్టమైనా ఎంత నోరు కట్టేసుకుని అయినా బరువు తగ్గిపోదాం అనిపిస్తుంది అంటుంది ఒక సరికొత్త అధ్యయనం. ప్రతి రోజు బరువు చూసుకొంటు వర్కవుట్స్ చేసేందుకు తగిన ఉత్సహం వస్తుంది. బరువు తగ్గే లక్ష్యం దిశగా శ్రమ చేసేందుకు తగిన ప్రోత్సహం దోరుకుతుంది. ఎప్పుడో ఒక సారి చూసుకొంటే వచ్చే రిజల్ట్ కంటే […]
