ముందే హెచ్చరించండి
ఆటల్లో పడి పోవటం ,పిల్లలు కొట్టుకోవటం సహజం, కానీ ఆ చిన్న తననా తగిలే దెబ్బలు వారిపై దీర్ఘకాల ప్రభావం చూపెడతాయి అంటున్నారు వైద్యులు. ఆటల్లో తలకు గాయాలు తగులుతాయి . పొట్టలో పిడిగుద్దులు గుద్దుకొంటే అక్కడ దెబ్బలు తగులుతాయి. కర్రలు ,రాళ్ళతో కాళ్ళకు గాయాలు అవుతాయి. పిల్లలకు తప్పనిసరిగా ఈ అంగాల విషయం స్పష్టంగా అర్ధం అయ్యేలా చెప్పాలి. కీలక అంగాలకు గాయం తగలకుండా చూసుకోమ్మని ముందే హెచ్చరించాలి. వాళ్ళంతట వాళ్ళను కపాడుకొనే వయసు వచ్చే […]
అమ్మకి అందరూ సాయం
అమ్మకావటం అనిర్వచనీయమైన ఆనందం. అమ్మకో కొత్త బాధ్యత . పాపాయి అపురూపమే , కానీ అమ్మ పాపాయి పైన 24 గంటలు కేంద్రీకరించకూడదు. ఇంట్లో ఉన్న అందరూ పాపాయిని ప్రేమిస్తారు కనుక వాళ్ళు కూడా పాపాయి పనుల్లో భాగాస్వాములుగా ఉండాలి ముఖ్యంగా కుటుంబం పాపాయి లాగా పాపాయి తల్లిని చూసుకోవాలి. అమ్మగా మారేందుకు ఆమె ఎంత కష్టం ఓర్చుకుందో పిల్లల పెంపకం ఎంతో కష్టమో అర్ధం చేసుకుంటే అమ్మ తేలిగ్గా ఉంటుంది. పాపాయికి పాలివ్వాలి కనుక వేళకు […]
ఓన్లీ జ్యూస్
వేసవిలో బజ్జీలు , గారెలు ఎప్పుడు నోరూరిస్తాయి. కాని ఈ వేసవి వెళ్లే వరకు వాటి ఊసు ఎత్తకండి అంటున్నారు డైటిషియన్లు. చివరకు డ్రై ఫ్రూట్స్ కూడా తగ్గించి చల్లని పానీయాలు వదిలేసి తాజా పండ్ల రసాలు ఫుల్ గా తీసుకొండి అంటున్నారు. సబ్జా గింజలు నానేసి ప్రతి ఫ్రూట్ జ్యూస్ లో కలుపుకోమంటున్నారు. ఈ వేసవిలో ఎన్నో రకాల పండ్లు వస్తాయి. అన్ని జ్యూస్ లకు పనికి వచ్చేవి నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు, పూదినా రసం […]
భాషలన్ని వచ్చు
లీడర్ తర్వాత ప్రియా ఆనంద్ తెలుగులో సినిమాలు ఎక్కువగా చేయలేదు. ఇప్పుడు కోలివుడ్ , మాలివుడ్ సినిమాలలో బిజీగా ఉన్నా ప్రియా ఆనంద్ తెలుగులో మంచి పాత్రలు రాకపోవటం వల్లనే అటు వైపు వెళ్ళాను అంటుంది. తెలుగు, ఇంగ్లీషు,హిందీ, మళయాలం భాషల్లో నా డబ్బింగ్ నేనే చెప్పుకునేంతగా వచ్చు. భాషా రావటం వల్ల వెంటనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలిగాను. తెలుగులో ఇప్పుడే అడుగుతున్నారు మెహమాటం వల్ల గతంలో కొన్ని నాకు సరిపడని పాత్రలు ఒప్పుకున్నా. ఇప్పుడిక […]
ఇమడ లేకే
రోటిన్ పాత్రలు నచ్చక సినిమాలను కాస్తా పక్కనపెట్టి నిర్మాణ రంగంలో యాక్టివ్ గా ఉన్నా, ఎంతో మంది కొత్త వారిని వెండితెరకు పరిచయం చేస్తున్నా తెరపైన కనిపించకపోయినా పక్కనే ఉన్నా కదా అంటుంది ఛార్మికౌర్. నాకు నా కెరీర్ లో బిజీగా ఉంటేనే బావుంటుంది. ఇల్లు ,పిల్లలు, అనే బంధంలో ఇమడలేనని అనిపిస్తుంది. పైగా ఇంటికి భాగస్వామికి తగిన సమయం ఇవ్వలేకపోతే ఇక కలహాలే కదా. అందుకే నా దృష్టిని అటుపోనివ్వలేదు. పైగా నేను కాస్తా ముక్కుసూటి […]
అందం శాస్వతమా
అందం అశాస్వతమని కాలం గడిచే కొద్ది అందం తగ్గుతుందని వయసు రిత్యా వచ్చే మార్పులను ఎవరైన స్వాగతించాలని అంటుంది ప్రితి జింతా. ఆమె చొట్ట బుగ్గలే ఎంతో అందం. పెద్దవుతున్న కొద్ది ఆ చొట్టలు ఆమె మోహం నుంచి మాయమయిపోతున్నాయి. అంత అందం ఇచ్చిన ఆరెంజ్ చొట్ట బుగ్గలు పూడిపోవటం మాకు నచ్చలేదు అంటున్నారు నెటిజన్లు. ఆ మాటలకు నవ్వేసి కాలం తీసుకుపోయిన అందం గురించి మాట్లాడుకోవటం ఎందుకు వయసు మీద పడితే చిన్నప్పటి అందం ఉంటుందా […]
ఎలా తిన్నా ఓకే
చారులో వేసిన ,పచ్చడి చేసినా, ఆకు కూరల్లోనూ కలిపి వండినా టోమోటో రుచే రుచి. కానీ టోమోటోను పచ్చిగా తింటే అదనపు పోషకాలు అందుతాయి అంటారు కొందరు. కానీ ఎలా తిన్న మంచిదే అంటున్నారు డాక్టర్లు. టోమోటోల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లికోపెన్ మోతాదు ఉడికించటం వల్ల పెరుగుతుంది. అలాగే తేలిగ్గా గ్రహిస్తుంది. అలాగే ఉడికిస్తే ఇంకొన్ని పోషకాలు పోతాయి. అలా టోమోటో వల్ల అన్నీ ప్రయోజనాలు పోందాలంటే రోజుకో టోమోటో పచ్చిగానే తినమని, ఇక కూరలు […]
కదిలే అందం
ఈ రాళ్ళెంతకు కొన్నారు అని అడిగే రోజులు వచ్చాయి. గ్లాస్ క్రిస్టల్ బాల్ జ్యూవెలరీ పేరుతో ఫ్రీ ఫ్లో క్రిస్టల్ జ్యూవెలరీ అని పిలిచే ఈ కదిలే రాళ్ళ నగలు ఇప్పుడు ట్రెండ్. గాజు బంతుల్లో ఉంటే చెవి దిద్దు ల్లోపల రాళ్ళు లేదా పూసలతో నింపేస్తారు. అచ్చం అలాంటివే లాకేట్లు ,బంగారంతో విలువైన రాళ్ళు పోసే లాకేట్లు ,దిద్దులు తయారైపోతాయి. క్రిస్టల్ ఇన్ సైడ్ వాబెస్ పేరుతో రాళ్ళు, వజ్రాలు నింపుకొన్న వాచెస్ కూడా ఫ్యాషనే. […]
వెబ్ సిరీస్ లో అక్షర
షీనా జోస్ అనే దర్శక-రచయిత్రి రాసిన పుస్తకం ‘గుడ్ బై గర్ల్’ ఇప్పుడు వెబ్ సిరీస్ గా రాబోతుంది. ఈ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్ సిరీస్ లో అక్షరాహాసన్ నటిస్తుంది. ‘షమితాబ్’ అనే బాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు అక్షరాహాసన్ ఈ వెబ్ సిరీస్ లో ఫైట్స్ కూడా చేస్తుంది. అందుకోసం అక్షర ప్రత్యేకంగా శిక్షణ తీసుకొంటుంది. డిజిటల్ స్క్రీన్ అక్షరకు బంగారు భవిష్యత్తు ఇవ్వబోతోంది అంటున్నారు సినీ విమర్శకులు.
స్పెషల్ లుక్
జీన్స్ వేసుకొనే అమ్మాయిలు ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో చీరె కట్టుకోవాలనుకొంటారు. అందంగా ఉండాలి వెరైటీగా ఉండాలి. ఫైగా అక్కడ రెండుమూడు గంటలు గడిపినా కంఫర్ట్ ఉండాలి. అలాంటప్పుడు ధోతీ చీరెలు ట్రై చేయలంటున్నారు ఎక్స్ పర్ట్స్. కుచ్చిళ్ళను కౌల్స్ తరహాలో సొంతంగా కుట్టించుకొని దానిపైకి వదులుగా ,పోడవుగా ఉండే క్రాప్ టాప్ తరహా బ్లౌజ్ వేసుకొంటే అద్భుతం అంటున్నారు .ధోతీ చీరెలు రెడీమెడ్ గనుక అందమైన చీరెను ఎంచి చూసుకొమంటున్నారు.
నూనె మసాజ్ మంచిది
ప్రతి రోజు అందం కోసం , శరీర లావణ్యం కోసం , సమయం కేటాయించక పోయినా వారానికి ఒక్క రోజు హెర్బల్ నూనెతో శరీరానికి మసాజ్ చేసుకుంటే ముందుగా ఒత్తిడి తగ్గిపోయి మొహం కాంతి వంతంగా ఉంటుంది. కాళ్ళకు స్క్రబ్బింగ్ చేయాలి. ముఖానికి పచ్చిపాలు రాసుకొని కాసేపయ్యాకా కడిగేస్తే చర్మరంధ్రుల తెరుచుకొని మొటిమల సమస్య రాకుండా పోతుంది. ఎండకు చర్మం రంగు తగ్గుతుంది అనుకుంటే నెలకో సారి ఫెషియల్ చేయించుకొంటే సరిపోతుంది. ఎంత పని ఒత్తిడి అయినా […]
బుల్లెట్ రాణి
తమిళనాడులోని కుంభకోణంలో ఉండే రోహిణిని బుల్లెట్ రాణి అని పిలుస్తారు. వాళ్ళ నాన్న కవి 20 ఏళ్ళుగా మెకానిక్ షెడ్ నిర్వహిస్తున్నాడు. ఆయనకు నలుగురు కూతుళ్ళలో చివరి అమ్మాయి రోహిణి. తండ్రికి సాయంగా షెఢ్ లో ఉండి పని నేర్చుకుంటుంది. స్కూటీ, యమహా ,బుల్లెట్, హర్లీ డేవిడ్ సన్ వరకు ఏ వాహన సమస్య అయినా నిమిషంలో కనిపెట్టేసి బాగు చేయగలదు. బాగు చేసి సవ్యంగా వినియోగదారుల ఇళ్ళకి చేర్చి సర్వీస్ భళా అనిపించుకొంటుంది.
కొత్తగా వచ్చాయి
కొన్ని ఐడియాలు వెంటనే క్లిక్ మంటాయి అందరికి నచ్చేస్తాయి. జుట్టుతో రకరకాల ప్రయోగాలు ఇష్టపడేవాళ్ళకి కొత్త ఉత్పత్తులు కావాలి. ఇప్పుడు పోని టెయిల్ వేసుకునే వాళ్ళకి రబ్బర్ బ్యాండ్స్ కావాలి. అవి అచ్చం హెయిర్ తో చేసినవే కొత్తగా మార్కెట్ లోకి వస్తున్నాయి. ఈ హెయిర్ బాండ్స్ అచ్చంగా వెంట్రుకలతో చేస్తారు. ఇవి ముడి వేసుకొన్న, పోని టెయిల్ వేసుకున్న జుట్టుకు మధ్యలో అమరి హెయిర్ బాండ్స్ గుర్తుపట్టలేనంతగా జుట్టులో కలిసిపోతాయి. జుట్టుకు సరిగ్గా మ్యాచ్ అయ్యేవి […]
డిఫరెంట్ గా ఉండాలి
2015లో లేడీ ఫోటోగ్రాఫర్ శార్వీ చతుర్వేది ఆల్ మేల్ మోడల్స్ తో ఫోటో షూట్ చేసి దానికి లైఫ్ ఇన్ ఎ డాట్ సిరీస్ అనే పేరు పెట్టారు. స్విమ్ షూట్ లో అమ్మయిల ఫోటోలు తీసినట్లు అబ్బాయిల స్వీమ్ షూట్ ఫోటోలు తీశారు శార్వీ చతుర్వేది, స్టీరియో టైప్ బ్రేక్ చేయాలని ఈ ప్రాజెక్ట్ చేశాను అంటారు శార్వీ చతుర్వేది. ఇలా డిఫరెంట్ గా ఫోటో షూట్ తనకు చాలా ఇష్టమని చాలెంజ్ స్వీకరింఛటం తన […]
సినిమా వస్తోంది
కేరళలోని కమ్మార్ కు చెందిన చిత్ర లేఖ జీవిత పోరాటం బాలీవుడ్ మూవీగా రాబోతుంది. చిత్ర లేఖ ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో ఏ పని చేయలేని భర్తను పోషించుకోనేందుకు ఆటో డ్రైవర్ అయింది. ఆటో యూనియన్ సభ్యత్వం తీసుకొంది. ఆమె కాలాన్ని దూషిస్తూ మహిళగా ఆమె ఉద్యోగాన్ని నిరసిస్తూ ఎన్నో దాడులు జరిగాయి. ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి న్యాయం కోసం పోరాడిన చిత్రలేఖను పత్రికలు, న్యూస్ ఛానేళ్లు ఎంతో ప్రశంసించాయి. ఇప్పుడామే కథ విన్న […]
నేను చాలా సింపుల్
పెళ్ళి చూపులు సినిమాతో చిత్ర పాత్రతో పరిచయం అయిన రీతూ వర్మకు ఈ మధ్యనే నంది అవార్డు వచ్చింది. కుటుంబం స్నేహితులు సంగీతం ఇవే నా ప్రపంచం అంటుంది రీతూ వర్మ. బాగా తిని బాగా కసరత్తులు చేస్తాను. కొత్త వంటకాలు వండేందుకు ట్రై చేస్తా. బేసిక్ గా నేను చాలా సింపుల్ గా ఉండే అమ్మాయిని అంటుంది రీతూ వర్మ. ఈ మధ్య కాలంలో తమిళ చిత్రాల్లో నటిస్తున్నా రీతూ ఇప్పుడు విక్రమ్ తో కలిసి […]
మంచి కథే లేదు
పదేళ్ళ తర్వాత ఊర్మిళా మండోత్కర్ మళ్ళీ వెండి తెర పైన కనించ నుంది. ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్లాక్ మెయిల్ చిత్రం ఒక ప్రత్యేక గీతంలో ఆమె మళ్ళీ చక్కని నృత్యం చేయనుంది. ఈ విషయం గురించి చెపుతూ ఊర్మిళ, పదేళ్ళ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నానంటే నాకు ఆపదం నచ్చటం లేదు మనకి జీవితంలో ప్రాధాన్యాలు ఉంటాయి. ఒక్కో సమయంలో కొన్నింటికి ప్రాధాన్యత ఇస్తాం ఇదీ అంతే . అప్పుడు బ్రేక్ […]
ఇంకాస్త సంరక్షణ
పెదవులు పగిలిపోకుండా లిప్ బామ్ మాత్రమే సరిపోదు ఇంకా సంరక్షణ చేయాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . తేనె చక్కెర తీసుకొని ఆ మిశ్రమాన్ని పెదవుల పై రాసి మృదువుగా మర్ధనాచేసి కాసేపటి తర్వాత చల్లని నీటితో కడిగేస్తే పెదవులపై మృత కణాలు పోయి చక్కగా కనిపిస్తాయి. అలాగే టోమోటో రసంలో చాక్లెట్ పొడి కలిపి ఆ మిశ్రమాన్ని పెదవులపై రాసి ఆరిన తర్వాత నీటితో కడిగేస్తే మృదువుగా అయిపోతాయి. ఇలా అయ్యాక లిప్ బామ్ రాసుకుంటే […]
ఎంత మంచిదో
అచ్చం పాలకూరలో వుండే పోషకాలతో చేసిన టాబ్లెట్స్ గర్భవతులకు ఇస్తారు. పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ శక్తి పాలకూరలో ఉందన్నమాట. ఇందులోని పోషకాలు అందరికీ ఆరోగ్యాన్నీ ఇస్తాయి. విటమిన్ ‘ఎ’ పాళ్ళు ఎక్కువ కనుక కాళ్ళకు మేలు చేస్తుంది. విటమిన్ ‘సి’ ఉంది కనుక వ్యాధి నిరోధక శక్తి సమకూరుతోంది. అనీమియా రాదు . పాలకూరలో ఉండే ల్యూటెన్ ,జయగ్భాంధన్ వంటి యాంటీ ఆక్సీ డెంట్స్ వల్ల ఎన్నో పోషకాలు అందటమే కాక ఎన్నో […]
బుల్లి కప్పు చాలు
మనసుంటే మార్గం ఉంటుంది. ఇంట్లో అలంకరణగా పూల మొక్కలు ఉండాలి అనుకొంటే మీని యేచర్ గార్డెన్స్ వైపు చూడవచ్చు ఒక టీ కప్పు లో మొక్కలు పెంచవచ్చు . కొత్తమీరా ,పూదీనా ,మెంతికూరలతో పాటు బొప్పాయి, గడ్డిజాతి నాచు మొక్కలు హాయిగా కప్పుల్లో పెరుగుతాయి. సేంద్రీయ ఎరువులు కలిపిన గట్టి చిన్నచిన్న గులకరాళ్ళు కొన్నీ అలంకారాలు చేస్తే ఈ బుల్లి కప్పులతో మొక్కలు ఎంతో ఆనందపెట్టిస్తాయి. ఇంటిని ఉద్యానవనం చేస్తాయి.
