Monday, 30 Nov, 2026

పెండెంట్ బావుంటుంది

బంగారు నగలు వద్దంటారు కానీ మోడ్రన్ డ్రెస్ ల మీదికి కూడా సన్నటి చైన్ తో చక్కని పెండెంట్ తో కలిసి వేసుకుంటే అమ్మాయిలు చక్కగా ఉంటారు. కెంపులు,వజ్రాలు, ముత్యాలు ,రాళ్ళు పొదిగిన చక్కని పెండెంట్స్ చాలా అందంగా ఉంటాయి. మిషన్ మేడ్,లైట్ వెయిట్ ప్యూర్ గార్ట్ తరహా గొలుసులకు పెండెంట్స్ చాలా ఆకర్షణగా ఉంటాయి. పెండెంట్ బరువుకు చైన్ లాగినట్లు ఉండకూడదు. హార్ట్ లీఫ్, సింగిల్ స్టోన్, డ్రాక్ లెట్ వంటి స్టైయిల్ గా ఉండే […]

సర్దేయవచ్చు

ఎండల్లోనే మామిడి పండ్లు వచ్చినట్లు ఈ మండే ఎండల్లో పిల్లలకి సెలవులు దోరికి, ఏదైన లాంగ్ ట్రిప్ పోయో అవకాశం వస్తుంది. కాస్త దూర ప్రాంతం వెళ్ళాలంటే లగేజీ ఎలా తీసుకుపోవాలి అని భయం వేస్తుంది.పది రోజుల ట్రిప్ వేయాలంటే దుస్తులతోనే వచ్చింది. మాసిన దుస్తులు ఎప్పటిలా ఇస్త్రీ బట్టల్లా అణిగి ఉండవు అలాంటప్పుడు ట్రావేల్ స్పేస్ సేవర్ బ్యాగ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ బ్యాగ్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో గాలి ఉండదు. బట్టలు చక్కగా […]

తల్లికి ముప్పే

ఆడవాళ్ళకి పిల్లలకీ ఏదో విడదీయరాని సంబంధం ఉన్నట్లే ఉంది. ఇప్పుడో కొత్త రిపోర్ట్ పిల్లలని కనకపోతేనే బావుండు అనిపిస్తుంది. పిల్లలున్న తల్లి ఆయుష్షు పిల్లలు లేని వాళ్ళతో పోలిస్తే 11 సంవత్సరాలు తక్కువగా ఉంటుందట. ఒక అధ్యాయనంలో మానవ క్రోమోజోమ్స్ లో ఉండే టెలో మర్స్ పిల్లలున్న మహిళల్లో తక్కువగా ఉన్నాయి. టెలోమర్స్ జనన కాలన్ని పెంచుతాయని ఇవి తక్కువగా ఉంటే జననకాలం తక్కువని అధ్యాయనం చెపుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత స్ట్రీలలో టెలోమర్స్ పోడవు తగ్గినట్లు వీరు […]

ఎన్నయినా తినవచ్చు

లోటస్ సీడ్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఔషధగుణాలు ఎక్కువే. వీటితో చేసే పాప్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. వీటిలో క్యాలరీలు ,కొవ్వు,సొడియం తక్కువ కనుక భోజనానికి మద్య తినవచ్చు. చక్కెర చాలా తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవాళ్ళు తప్పని సరిగా తినగలిగే స్నాక్. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. చిన్నప్పటి నుంచి చిరుతిండి అలవాటైన వాళ్ళు ఒక పట్టానా ఏవీ తినకుండా నోరు కట్టేసుకోలేరు. లోటస్ సీడ్స్ లో […]

కెరీర్ కోసం కఠోరసాధాన

మన దేశంలో ఒకే ఒక్క మహిళ కమాండో ట్రైనర్ సీమారావ్ . ఒక్క రూపాయి తీసుకోకుండా ఇండియన్ ఆర్మీకి ఆమె ఉచితంగా సేవ చేస్తుంది. మిలటరీలో మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సాధించింది. మెడిసిన్ చదివినా, కమాండోలకు శిక్షణ ఇచ్చే కెరీర్ ఎంచుకుంది. భర్త దీపక్ రావ్ తో కలిసి పదిహేను వేల మంది కమాండోలకు శిక్షణ ఇచ్చింది సీమారావ్. ఫిట్ నెస్ లేకపోతే ఈ వృత్తిలో కొనసాగలేమనే భయంతో మాతృత్వాన్నీ దూరం చేసుకుంది. ఓ […]

పండ్లలో బెస్ట్

ఆరు కమలా పండ్లలో ఎంత ‘సి’ విటమిన్ ఉంటుందో భాగా పండిన ఒక్క జామ కాయలో అంత ‘సి’ విటమిన్ ఉంటుంది. అంతే కాదు కాల్షియం , ఫాస్పరస్, కెరోటిన్, పోటాషియం , పీచు, కాల్షియం, ఐరన్ తో పాటు దాదాపు అన్నీ విటమిన్లు,లవణాలు సమృద్ధిగా ఉండే అద్భుతమైన పండు జామ. ఇందులో కొలెస్ట్రాల్ ,సోడియం అస్సలు ఉండవు. మిగతా అన్నీ పండ్లలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ జామాలో ఎక్కువగా ఉంటాయి. పచ్చి కూరలు,జామతో కలిపి తిన్న […]

మంచి కండిషనర్

కేశ సంరక్షణలో గోరింటాకు మించింది ఇంకేదీ లేదు. పౌడర్ గా దొరికే హెన్నపొడి కంటే పచ్చి గోరింటాకు రుబ్బి తయారు చేసే హెన్నాలో విశిష్టమైన లక్షణాలున్నాయి. గోరింటాకు ,మెంతులు, నిమ్మరసం మెత్తగా రుబ్బి అందులో గుడ్డుసొన కూడా కలిపి తలకు పట్టించుకొని గంటసేపు ఉంచుకొని తల స్నానం చేస్తే జుట్టు మెత్తగా పట్టులాగా అయిపోతుంది. ఇది మంచి కండిషనర్. మంచి సువాసనతో మాడుకు రక్షణ ఇస్తుంది. తెల్ల జుట్టుకు ఈ గోరింటాకు నుంచి వచ్చే సహాజ ఉత్పత్తులను […]

శిశువుకు సమస్య

అతిగా మాంసం తినవద్దు , గర్భస్థ శిశువుకు చాలా నష్టం అంటున్నాయి పరిశోధనలు. గొర్రె మాంసం ,చికెన్ , చీజ్ నట్స్ పాలధార ఉత్పత్తులు . బీన్స్ లో అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. గర్భవతిగా ఉన్న వాళ్ళు మాంసం అధికంగా తింటే శిశువు కు స్కిజోఫ్రినియా అంటే దీర్ఘకాలికమైన వైకల్యం ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. అంచేత గర్భవతిగా ఉంటే అధికంగా మాంసం తినవద్దని హెచ్చరిస్తున్నారు.

అందరూ సరేనంటేనే

యాభై దాటినా వయసులో ఉన్నప్పటి ఉత్సహం కావాలంటే బేసిక్ ఎరోబిక్ వ్యాయామాలు ఎంచుకోవాలి. వేగం తగ్గించి ఎక్కువ సేపు చేసే వ్యయామాలు ,చేతులు ,కాళ్ళు కదిలేలా ఉంటాయి. అయితే ముందుగా ఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడి శరీరం బరువు , ఆరోగ్య సమస్యల వివరాలు అన్నీ డాక్టర్ దగ్గర సూచనలు తీసుకొని వారు ఇరువురూ కలిసి నిర్ణయించిన తేలికపాటి వ్యయామాలు చేయాలి. బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేయించుకొని ఎముకల్లో కాల్షియం సాంద్రత గురించి తెలుసుకొని మరీ వ్యయామం […]

మీకు నచ్చుతుంది

మళయాలం సినిమా ‘సోలో’లో అంధురాలిగా నటించింది సాయి ధన్సిక . తెలుగులో హీరోయిన్ ప్రాధాన్యత ఉన్నా మేళాలో నటిస్తుంది. ఇది హర్రర్ థ్రిలర్ , తెలుగు తమిళ భాషల్లో తీస్తున్నారు. నేనే పాత్ర పోషిస్తున్నాను అన్న సంగతి ముఖ్యం కాదు కానీ స్ర్కిప్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ . నా యాక్షన్ సీన్స్ కు నాకోసం డూప్స్ అక్కర్లేదని చెప్పాను. మేళా లో కూడా ఇంతే . క్లైమాక్స్ సన్నివేశాలు చాలా కీలకం . అయినా నాకే […]

కండరాల నొప్పా

నిద్రలో ఒక్కసారి కాలి వేళ్ళు తిమ్మిర్లు ,కాలి కండరాలు పట్టేసి నొప్పి పెడతాయి. ఇందుకు కారణం పొటాషియం లోపం కావచ్చు . కండరాలను అలసట చెందనివ్వకూడదు. కాళ్ళ పాదాలు పడుకొనే ముందర మసాజ్ చేసుకోవాలి. పట్టేసిన కండరాలపైన వేడి నీళ్ళతో కాపడం పెట్టాలి. ముఖ్యంగా ఆహారంలో అరటి పండు, బంగాళాదుంపలు ,సిట్రస్ పండ్లు ,పాలకూర ,బీన్స్ సమృద్ధిగా తినాలి. వీటిలో పొటాషియం ఉంటుంది. ఆహారం ద్వారా పోషకాలు అందితేనే ఆరోగ్యం.

అందుకే ప్రయాణాలు

పనిలో అలసట తీరేందుకు ప్రయాణాలే సహాకరిస్తాయి అంటోంది అమీరా దస్తూర్ . ఎప్పుడు ఎక్కుడ సమయం దొరికినా పునరుత్తేజం తెచ్చుకొనేందుకు ఏదో ప్రయత్నం చేస్తాను అందుకే నా ప్రయాణాలన్నీ అవీ సాధాసీదాగా ఉండవు. ఎడ్వెంచర్ స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇస్తాను. ఇవి నాలో సంశయాలను దూరం చేసి నాకు చాలా ఎనర్జీ ఇస్తాయి. విభిన్న సంస్కృతులకు చెందిన ఎందరో వ్యక్తులు ఈ ప్రయాణాల్లో తారసపడతారు. మనుష్యుల స్వరూప స్వభావాలు అర్ధం చేసుకొంటా నాలో నటనకు మెరుగు దిద్దుకుంటాను […]

ఆకలిని ఓడిస్తా

క్యాటీ అనే అమ్మాయి 9 సంవత్సరాల వయసులో స్కూల్ గార్డెనింగ్ ప్రోగ్రామ్ కోసం మొక్కలు పెంచమని స్కూల్లో విత్తనాలు ఇస్తే జాగ్రత్తగా ఇంట్లో నాటి క్యాబేజీలను పండించింది. ఒక క్యాబేజీ అందులో 18కిలోల బరువు పెరిగింది. దాన్నీ ఆ పాప ఓ చర్చికి విరాళంగా ఇస్తే దాన్ని కోసి వండి 175 మందికి పంచారు. అప్పుడు అనుకొంది క్యాటి పేదల ఆకలి తీర్చేంందుకు క్యాబేజీ ఇతర కాయగూరలు పండించాలని, క్యాటీస్ క్రాప్స్ అన్న తన సొంత సంస్థ […]

ముళ్ళున్నా మంచిదే

ముళ్లు మొక్కలా కాస్త అనిపిస్తుంది. కానీ అనాస కాస్త శ్రద్ధగా ముక్కలు చేస్తే మాత్రం అద్భుతమే. అలాగే తినేయవచ్చు ,జ్యూస్ చేసుకొని తాగవచ్చు. ఇందులోని పిండి పదార్థాలు చక్కెరలు శక్తి నిస్తాయి.పుష్కలంగా పీచు ,జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని విటమిన్ సి, శరీరం ఇనుముని పీల్చుకొనేందుకు సహకరిస్తుంది. కొల్లాజిన్ తో కలిపి చర్మాన్నీ ముడతలు పడకుండా మాంగనీస్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అనాసతో ఎన్నో రకాల వంటలు చేసుకొవచ్చు.

స్వేచ్ఛలోనే ఆనందం

శక్తి కపూర్ కూతురు శ్రద్ధాకపూర్ మంచి యాక్టర్ ,సింగర్ కూడా .సొంతంగా బిజినెస్ చేస్తుంది కూడా. అంటే సెలబ్రెటీ కబుర్లు కూడా అంతే స్థాయిలో ఉంటాయికదా. నేను సంతోషంగా ఉన్నాను అంటే కెరీర్ లో నా సక్సెస్,నా సంపాదన ,సినిమాలు ,యాడ్స్ కాదు. నేను కోరినట్లు జీవిస్తేనే నాకు సంతోషం. నాకు నచ్చినపని స్వేచ్ఛగా చేయటంలో ఆనందం .ఒక వేళ అందులో ఫెయిల్ అయినా పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే నాకు ఇష్టమైన , నాకు నచ్చే […]

చెమట వల్లే దాహం

శరీర ఉష్టోగ్రత ఏ కారణంగా అయినా పెరిగితే దాన్ని చల్లబరించేందుకు చెమట పోస్తుంది. వేసవిలో ఇది కామన్. చెమట పడితే శరీరంలోని ద్రవాలు తగ్గుతాయి.వాటిని నింపకపోతే డీ హైడ్రేషన్ ప్రాబ్లం వస్తుంది. ఉష్టోగ్రత పెరుగుతుంది. తీవ్రమైన తలనొప్పి, స్పృహ పోవచ్చు కూడా . ఇదే వడదెబ్బ . అలా శరీరం చెమట పట్టి పోతుంది. శరీరంలో సోడియం తగ్గకుండా స్పోర్ట్స్ డ్రింక్స్ తాగాలి. రోజు మాత్రం ఈ వేసవి వెళ్ళేదాకా సమతుల్య ఆహారం తీసుకొంటు చెమట ద్వారా […]

మంచి భోజనం

ఇంత ఎండల్లో అంత నాజుగ్గా ,మెరుపులతో ఎలా ఉంటారంటే దీపిక పదుకొనే తినటంలోనే అందం ఉందంటుంది. ఆమె బ్యూటీ సీక్రెట్ గురించి చెపుతూ బ్రెక్ ఫాస్టులో ఇడ్లీ గుడ్డు ,దోసె ,మామిడి, ఆకుకూరలతో,భోజనంలోకి పప్పు రొట్టే కాయగూరలు ఇలా భోజనాల మధ్యన పెద్ద విరామం ఉండదు. ఇవన్నీ తీసుకొండంటూ ,ఫిజికల్ ట్రైయినర్ సాయంతో శరీరాన్ని కుదురుగా ఉంచుకొంటా. సహాజమైన స్కిన్ కేర్ ఉత్పత్తులు ,బేబీ ఆయిల్ తో మసాజ్ లు నా రహస్యం అంటుంది దీపికా .ఇవన్నీ […]

మేం సాదాసీదా అమ్మాయిలం

అనవసరమైన ఆపార్ధాలు చేసుకొంటారు సినిమా హీరోయిన్లను. మావైపు నుంచి ఆలోచించండి ఎంత మంది కళ్ళు మామీద ఉంటాయి. ఎంత కష్టం ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండటం అంటుంది పరిణితి ఛోప్రా. సాదారణంగా హీరోయిన్లుకు బోలేడంతా కోపమని ,విపరీతమైన యాటిట్యూడ్ తో ఉంటారని మమ్మల్ని హ్యండిల్ చేయటం కష్టమని అంటారు కానీ నిజానికి మేము అందరూ అమ్మాయిల్లాగే ఉంటాం. సినిమాల్లో యాక్ట్ చేస్తాం కనక కుతుహలం కొద్దీ,కాస్త ఇబ్బంది పెడతారు. కానీ మా సమస్యలు ఎన్ననీ? ఎంత సహనం […]

వాళ్ళని నియంత్రించండి

ఒక పరిశోధనలో పిల్లల్లో, టీనేజర్లలో ఫేస్ బుక్ డిష్రెషన్ పెరుగుతుంద అని తేలింది.  గాడ్జెట్స్ అతిగా వాడటం అది ఒక రకమైన మాదక ద్రవ్యల్లా పని చేస్తాయి.  ఒక వీడియో గేమ్ గెలవటం విపరీతంగా లైక్స్ రావటం వల్ల సంతోషానికి కారణమైన డోపమైన్ అనే హర్మోన్ స్థాయిలు పెరిగి అనందం అవధులు దాటుతుంది. ఈ టెక్నాలజీ వినియోగం ఈ కారణంగానే ఎక్కువ అవుతుంది. టీనేజర్స్ ఇక నిజ జీవితంలో ఎదురయ్యే అపజయాలు నిరుత్సాహాలు ఎదుర్కోలేరు. వారికి ప్రపంచంతో […]

ఆ పేరు పెడితే చాలు

బాలీవుడ్ స్టార్స్ పేరుతో మొత్తం ఫ్యాషన్ ప్రపంచం మునిగి తేలుతూ ఉంటుంది. ఉదహరణకు కాజల్ పేరుతో వచ్చే కుర్తాలు ,లెహంగాలు ,సిల్వాట్టలు ఎంతో పాపులర్ . లెహంగాలు ఇవ్వాల్టి ట్రెండ్ కూడా. లేత రంగులు ట్రైబల్స్ డిజైన్స్ , క్యూట్ గా ఉండే హాఫ్ శారీలు, స్కర్ట్ పైన లేత రంగు ప్రింట్స్, ధగ ధగ మెరిసే చోకర్ లు అన్నీ ఫ్యాషనే. బంగారు వన్నే జరీతో ఫ్యూర్ సిల్క్ లెహంగాలయితే కాజల్ అగర్వాల్ ఫ్యాషన్ డ్రెస్సెస్ […]