ఒకరి గురించే చెప్పలేను
సినిమా ఇండస్ట్రీలో స్త్రీలపై లైంగిక వేధింపుల విషయంలో క్యాష్ అంటే కమిటీ ఎగైనెస్ట్ సెక్సువల్ ఎరాస్ మెంట్ పేరుతో చిత్ర పరిశ్రమ వ్యక్తులతోనూ బయటి వాళ్ళతోనూ కలిపి కమిటీ ఏర్పాటు చేశారు. ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి చెందిన స్త్రీలు తమకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అందులో కంగానా రనౌత్ ముక్కుసూటిగా మాట్లాడటంలో ముందే ఉంటుంది. ప్రశ్నను బట్టీ సమాధానం షూటిగా వచ్చేస్తుంది. ఒక ఇంటర్వూలో మీరు ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా అని […]
వారసులకు స్టార్ ఇమేజ్
స్టార్ ల పిల్లలు కూడా స్టార్స్ తో సమానంగా ఆదరణ పొందుతారు. వాళ్ళు ఎక్కడకు వెళ్ళినా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ అభిమానం కట్టలు తెంచుకొని ఒక్కసారి పిల్లల తల్లులు కళ్ళనీళ్ళ పర్యాంతం అయిపోయి కాసేపు మమ్మల్ని వదిలేయండి అనేదాకా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాన్నే ప్రస్తవిస్తూ నా కుమారుడు తైమూర్ కు నాకంటే ఎక్కువ స్టార్ హోదా వచ్చేసింది అంటుంది కరీనా కపూర్. ఇదంతా చూశాకా నాకేమనిపించింది అంటే వాడిని ఈ ఇమేజ్ కు […]
మూడు కప్పులు చాలు
4500 మంది ఆహారపు అలవాఅట్లు వారు తాగే పాణీయాల పైన ఒక అధ్యాయనం జరిగింది. అన్ని పాణియాల కంటే కాఫీ తాగే వాళ్ల ఆరోగ్యమే మెరుగని అధ్యాయనం రిపోర్ట్. రోజుకు మూడు కప్పులు కాఫీ తాగటం వల్ల గుండె ధమనుల్లో కాల్షియం కారక నిల్వలు తక్కువగా పేరుకుంటున్నాయని అధ్యాయనాలు చెబుతున్నాయి. కాఫీ తాగటం వలన గుండె ధమనులు శుభ్రపడి గుండె జబ్బులు రాకుండా తప్పించుకోవచ్చు అంటున్నాయి అధ్యాయనాలు. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే ఇందుకు కారణంగా చెబుతున్నారు, […]
ఫ్రీజ్ నీళ్ళు వద్దు
వేసవి ఎండలు మండుతుంటే ఫ్రిజ్ లో చల్లని నీళ్ళు అద్భుతంగా అనిపిస్తాయి. కానీ ఎఫ్పుడైనా ఫ్రీజ్ నీళ్ళు తాగండి కానీ భోజనం చేసిన వెంటనే తాగితే మాత్రం ప్రమాదం. అలా వెంటనే చల్లని నీరు తాగితే గుండె జబ్బులు, కాన్సర్ రావచ్చని చెపుతున్నారు డాక్టర్లు. భోజన సమయంలో గొరు వెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ సక్రమంగా సాగటంతోపాటు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరదని చెపుతున్నారు, ఈ విషయంలో ఇంకా అధ్యాయనాలు కొనసాగుతున్నాయి.
చెప్పండి చాలు
ఈ మధ్య కాలంలో కారణాలు ఎమైనప్పటికీ ఆడపిల్లలు చాలా త్వరగా పన్నెండేళ్ళకే రజస్వల అవుతున్నారు. ఇంకా త్వరగాను అంటే ఐదారు తరగతులు చదివే వయసులోనూ కావచ్చు. ఇది చాలా సహజమైన ప్రక్రియ అని కంగారుపడరాదని పిల్లలకు శరీర ధర్మాన్ని అర్ధమయ్యేలా వివరించాలి. చేయకూడని పనులన్ని వాళ్ళకు చెప్పేసి కంగారు పెట్టోద్దు. మంచి శానిటరి ప్రత్యమ్నాయాలు వారికి ఉన్నాయి కనుక వాళ్ళు సౌకర్యంగా ఫీలవుతారు. శారీరకంగా ఏదైనా అలసట అనిపిస్తేనే వారిని విశ్రాంతి తీసుకొమ్మని చెప్పాలి. లేకపోతే వాళ్ళకు […]
ఎన్నెన్ని గాయాలో
సరిహద్దుల్లో భర్త కార్గిల్ యుద్దంలో ఉన్న సమయంలో దీపామాలిక్ ఆపరేషన్ థియోటర్లో ప్రాణాలతో పోరాడుతుంది. పదిహేడెళ్ళ వయసులో వెన్నుపూసకు సంబంధించిన ఒక అనారోగ్యం ఆమెను వీల్ చైర్ కు పరిమితం చేసింది. ఎన్నో ఆపరేషన్లు జరిగాయి ఆమెకు . ఆ వీల్ చైర్ లో కూర్చునే దివ్యాంగుల కోసం ప్రపంచస్థాయిలో జరిగిన పారా ఒలంపిక్స్ లో పతాకం గెల్చుకుంది. అప్పుడు ఆమె వయసు 45 సంవత్సరాలు . ఈ వయసులో పతాకం గెలుచుకున్న తొలి మహిళ కుడా […]
వేసవి స్పెషల్
ఇంకా ఎండలు ముదురుతాయి, ఈ ఎండలకు శరీరానికి అవసరమైన పోషకాలు షర్భత్ లో దొరుకుతాయి. అలాగే ఎక్స్ లెంట్ పానీయం పానకం. శ్రీరామ నవమి రోజు ప్రసాదంగా దొరికే వడపప్పు, పానకం లోదే ఈ పానకం. బెల్లం,మిరియాలు, నిమ్మరసం,యాలుకులు కలిపి పానకం చేస్తారు. ఇది షుగర్ స్థాయిని సమంగా ఉంచుతుంది. ఎండదెబ్బకు చెమట రూపంలో బయటికిపోయిన ఖనిజాలను శరీరానికి అందించ గలిగేది ఈ పానకమే. వేసవిలో ప్రతిరోజు ఈ పానకం తాగొచ్చు. కూల్ డ్రింక్ ల కంటే […]
అదుపులో ఉండాలి
శరీరం ఎఫ్పుడు మన అదుపులో ఉండాలి. అదుపు తప్పితే అన్ని ఇబ్బందులు వస్తాయి, శరీరం అన్ని వైపులకు వంగేలా ఉండాలి. కదలికలో ఇబ్బంది ఉండకూడదు. ముందుకు వగటం కాళ్ళు ముడుచుకోవటం పాదాలను కదిలించటంతో వెన్ను సాగదీసినట్లు అవుతుంది. ఇలా తేలికపాటి వ్యయామం చేసినా శరీర వ్యవస్థలన్ని మెరుగ్గా ఉంటాయి. కడుపులో బరువుగా ఉండే ఆహారం వద్దు, ఆహారంలో 40 శాతం తాజా కూరగాయలు,పండ్లు ఉంటే శరీరం తెలిగ్గా ఉంటుంది, విశ్రాంతిగా ఉండాలి. అయితే నిద్ర వేరు, విశ్రాంతి […]
వెజిటెబుల్ వండర్స్
శిరోజాల ఎదుగదలను,మృదుత్వాన్ని కాపాడేందుకు హెయిర్ స్టయిలిస్టులు హెయిర్ వాష్ చేసి ప్యాక్ వేసి స్టయిలింగ్ చేస్తారు. అది ఇంట్లోనూ చేయవచ్చు. ఎదైనా అప్లయ్ చేసేందుకు ముందు వేడి నీరు వాడితే శిరోజాలు, మాడు రంధ్రాలు తెరుచుకుంటాయి. అప్పుడు ఏదైన మాస్క్ అప్లయ్ చేయాలి. ఏ మాస్క్ అయినా జుట్టులోకి చొచ్చుకుపోయేందుకు తగినంత సమయం పడుతుంది. ఓ అరగంట పాటు హెయిర్ మాస్క్ ను అలా వదిలేస్తే అది ఆరిపోతుంది అప్పుడు వెంటనే దాన్ని కడిగేయాలి. క్యారెట్లు, బీట్ […]
కార్డ్ బోర్డ్ ఫర్నిచర్
బందనా జైన్ బీహార్ లోని తకుర్ గంజ్ లో పుట్టింది. పెళ్ళయ్యాక ముంబై లోని జె.జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసింది. ఆమె ప్రత్యేకత కార్డ్ బోర్డులో ఎకో ఫ్రెండ్లీ ఫర్నిచర్ తయారు చేయటం సిల్వర్ పేరుతో ముంబైలో ఆమెకో స్టుడియో ఉంది. రీ సైకిల్ కి ఉపయోగపడే కార్డ్ బోర్డ్ లో ఆమె తయారు చేసే ఫర్నిచర్ కు ఎంతో డిమాండ్ ఉంది. కోటి రూపాయలు టర్నోవర్ దాటుతున్న ఈ […]
ఎత్తు పెరగరు
ప్రకటనలు చాలా మోసం చేస్తాయి. ప్రోడక్ట్ అమ్ముకొనేందుకు వ్యాపారులు పన్నే ప్యూహంలో వినియోగదారులు పడిపోతారు ఆపై నష్టపోతారు. అలాంటిదే ఈ ఎత్తు పెరిగించే మందు . ఎత్తు పెంచి తగ్గించే మందులు ఉండవు. పిల్లలు లాంగ్ ఫేజ్ లో గబగబా పొడవు పెరుగుతారు. రెండవది ల్యాగ్ ఫేజ్. ఈ ల్యాగ్ ఫేజ్ లో పెరగడం చాలా మందకోడిగా సాగి ఆగిపోతుంది. 21 సంవత్సరాలు వచ్చే సరికి ఎముక పెరుగుదల ఆగిపోతుంది. మందులు వాడితే పెరుగుతారని చెప్పటం మోసపుచ్చటమే. […]
కోవ్వు తగ్గించటమే మార్గం
ఎలాంటి అవలక్షణాలైనా అలవాట్ల నైనా కష్టపడి మనసును అదుపులో పెట్టుకుని వదిలించుకోగలం కాని శరీరం బరువు మాత్రం ఏ కష్టానికి లొంగదు. వ్యయామం చేసి కండలు అరగదీసిన ఇసుమంత ప్రయోజనం కనిపించటంలేదని వాపోయే వాళ్ళ కోసం ఈ రిపోర్ట్, ఎక్కువ బరువున్న కొందరు మహిళల్లో ఎక్కువసేపు వ్యాయామం చేయించినా ఏ రిజల్ట్ కనిపించటం లేదు. వాళ్ళకు కోవ్వు తక్కువగా ఉండే పోషకాహారం ఇచ్చి వ్యాయామం చేయిస్తే రెండు నెలల్లో తగ్గారు. అంటే కోవ్వు లేని మంచి ఆహారం […]
నిలబడండి
అమెరికా, స్పెయిన్, గ్రేగోరియో మారహాన్ యూనివర్సటీ పరిశోధకులు ఒక అధ్యాయనంలో రెండు గంటల పాటు నిలబడితే బరువు తగ్గుతారని చెపుతున్నారు. ఎక్కువసేపు కూర్చుంటే బరువు పెరగటం తెలిసిందే. కొన్ని వేల మంది పై చేసిన అధ్యాయనంలో ఆరుగంటల పైన కూర్చుని ఉద్యోగం చేసేవాళ్ళు మధ్యలో రెండుగంటలు నిలబడి పని చేయమన్నాను. జిమ్ లో చెమటలు పట్టేలా వ్యయామం చేసినా గంటల కొద్ది నడిచిన ఇదే ఫలితం పొందుతారని అధ్యాయనాలు చెపుతున్నాయి. ఎక్కువసేపు నిలబడగలిగితే బరువు తగ్గటంతోపాటు గుండెకి సంబంధించిన […]
పార్టీ స్పెషల్స్
షుగర్ కేక్స్ ఇమేజస్ రూపంలో చూశారా? ఊలు ఉండల్లో బుజ్జి కుక్క పిల్లల్లా టర్కి టవల్స్ తో కప్పిన బొమ్మతో ఫుడ్ డిజైనర్స్ వీటిని అద్భుతంగా తయారు చేశారు. బటర్ క్రీమ్ తో కేక్ మీద ఊలు దారాలు నుడుల్స్ వేలాడుతున్నట్లు తయారు చేశారు. కొన్ని కేకులు గిన్నెల పైన టర్కిష్ టవల్స్ బోర్లిచినట్లు ఉన్నాయి. ఈ షుగర్ కేక్స్ తోనే పిల్లలకు కుక్కల బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ నిజమైన జంతువుల్లానే ఉన్నాయి. కొత్త రకం […]
అల్లరే అల్లరి
బాల్యం ఎవరికైనా చక్కని అనుభూతులనే ఇస్తుంది. ఆ తెలియని వయసులో అల్లరి తలుచుకుంటే ఇప్పుడు నవ్వోస్తుంది. స్నానల గదిలోకి ఎవరైనా వెళితే చాలు తలుపు పెట్టేసేదాన్ని. వాళ్ళు అరిచి తిడుతున్న తీసేదాన్ని కాదు. చేతిలో నాణాలు ఉంటే చాలు మింగేసేదాన్ని. మా అమ్మను ఎంత కంగారుపెట్టేదాన్నో అంటుంది కీర్తి సురేష్. ఆమే సావిత్రిగా నటించిన మహానటి చిత్రీకరణ పూర్తయింది. చిన్నప్పుడు గోడవ చేసినా అందరితో చాలా కలివిడిగా ఉండేదాన్ని, అది నాకు చిత్రసీమలో పనికి వచ్చింది. నాకు […]
తల్లి ప్రేమ
రాజ్యలక్ష్మీ బార్ ధాకూర్ బెంగళూరులో కంటెంట్ స్ట్రాటజిస్టు గా పని చేస్తుంది. ఆమెకో బాబు. ఆరునెలల బాబుకు మూర్ఛవ్యాధి మొదలైంది. వాడి కోసం మూడేళ్ళు పరిశోధన చేసి ఒక గ్లోవ్, (చేతితో గోడుగులాంటి పరికరం) కనిపెట్టారు దాని పేరు టి.జె. వాళ్ళబ్బాయి తేజలోని ప్రధాన లక్షణాలు ఇవి మూర్ఛవ్యాధిని ముందుగా కనిపెట్టగలిగే పరికరం ఇది. ఆ పరికరం దేశంలోని మూర్ఛ వ్యాధిగ్రస్థులకు ఉపయోగపడాలని టెరా బ్లూ ఎక్సటీ అనే అంకుర పరిశ్రమ స్థాపించారు. రాజలక్ష్మీ టి.జె స్ఫూర్తితో […]
ఎక్కువ సార్లు తినాలి
వయసు పెరుగుతున్న కొద్దీ ఒళ్ళు తగ్గించుకొవటం ,ముఖ్యంగా పొట్ట చుట్టు చేరే కొవ్వు తగ్గించుకోవటం చాలా కష్టం. ఎక్కువ తినటం ,కదలకుండా విశ్రాంతింగా కూర్చోవటం దీనిక కారణం. పొట్ట చుట్టు కొవ్వు తగ్గాలంటే తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తినాలి. వేపుళ్ళు, కూట్ డ్రింక్ లు మానేయాలి. టీనేజీ వాళ్ళతో పోలీస్తే పెద్దవాళ్ళు అధిక బరువు తగ్గించుకోనేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఆఫీస్, ఇల్లు పెరుగుతున్న పనిగంటలు ,అదనపు బాధ్యతలు లేదా ఇల్లాలికి కూడా ఇక వయసు […]
తప్పక రాయాలి
చర్మం జిడ్డుగా ఉంటే మాయిశ్చరైజర్ వద్దనుకొంటారు. కానీ ఏ రకం చర్మానికైనా ఇది అవసరం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖం కడుక్కొవటంతో మురికితోపాటు తేమ కూడా చర్మంపై నుంచి పోతుంది. చర్మం పొడి బారుతుంది. ఇలాగే చర్మాన్ని వదిలేస్తే చర్మంపై సన్నటి గీతలు ముడతలు మొదలవుతాయి. అందుకే చర్మరంధ్రాల్లోని ఫ్రిరాడికల్స్ మురికి వదిలిపోయేలా తక్కువ గాఢత ఉన్న జెల్ ఉపయోగించాలి. చర్మం పొడిబారకుండా మంచి మాయిశ్చరైజర్,ఎండలోకి వెలితే సన్ స్క్రీన్ తప్పని సరిగా ఉపయోగించాలి . చర్మ […]
ఎంత ప్రమాదం
ఇంట్లో వినియోగించే ఫ్లాస్టిక్ వస్తువుల సంఖ్య రోజు రోజుకీ పెరిగి పోతుంది. ప్లాస్టిక్ ఆట వస్తువులు, మంచి నీళ్ళ సీసాలు, భోజనం తీసుకుపోయే బాక్సులు ,డైనిండ్ టేబుల్ అలంకరణ మొత్తం ప్లాస్టిక్ మయం. దుస్తులు కూడా ప్లాస్టిక్ ఫైబర్ తోనే తయారు చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వస్తువుల రేణువులు ఇల్లంతా పరుచుకుంటున్నాయి అంటున్నారు డాక్టర్లు. భోజనం చేసే సమయంలో చుట్టు ఉన్న స్లాస్టిక్ సామాను నుంచి 140 నుంచి 150 ప్లాస్టిక్ రేణువులు కడుపులోకి పోతాయట. వీటిని […]
చీకట్లో వద్దు
అందరూ పడుకొన్నాక పెద్ద వాళ్ళు ఇతరులను నిద్రాభంగం కలుగకుండా లైట్లు ఆఫ్ చేసి స్మార్ట్ ఫోన్ లో ఏ వాట్సప్ మెసెజ్ లో చూసుకొంటూ ఉంటారు. అంత తక్కువ కాంతిలో స్మార్ట్ ఫోన్ వెలుగు చూస్తూ ఉంటే జ్ఞాపక శక్తి సమస్యలు వస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. తక్కువ స్థాయి కాంతిలో ఏ పని చేసిన దాని ప్రభావం మెదడు మీద ఉంటుంది. మెదడులోని హిప్ఫోకాంపస్ అనే భాగం పైన ఈ ప్రభావం పడటం వల్ల దాని […]
