Monday, 30 Nov, 2026

కొప్పు పెట్టేయనా

ఈ వేసవిలో జుట్టు భుజాలపైకి జారుతుంటే విసుగ్గానే ఉంటుంది. ముడి వేసుకుంటే వయసు మీదపడ్డట్టు ఉంటుందేమో నన్న భయం అమ్మాయిల్లో ఉంటుంది. సింపుల్ గా ఫ్యాషన్ గా అనిపించే కొప్పుని అంటి పెట్టుకోనే నాజుకైనా ఆభరణాలు వచ్చాయి. ప్లాస్టిక్ పువ్వుల దండలతో ఆర్టిఫిషియల్ వజ్రాలు వచ్చాయి లేదా హెయిర్ పిన్ కి మల్లెలు గుచ్చి జుట్టుతో అలంకరించినాచాలు. గట్టిగా ముడినిలిచేలా ఉండేందుకు దువ్వెన పళ్ళవంటి క్లిప్స్ వచ్చాయి. ముడి లోపలకి పిన్ గుచ్చిన పైకి అందమైన పిన్ […]

పొట్టి గౌను అందం

పొట్టిగౌన్ లు ఈ వేసవి స్పెషల్ డిజైనర్ డ్రెసెస్ గా ముందుకొచ్చాయి. ఈ షార్ట్ ఫ్రాక్స్ ధోతీప్యాంట్ కు లెహాంగాలపైకి చక్కగా మ్యాచ్ అవుతాయి. వేసవికి సౌకర్యంగా స్టైల్ గా కావాలంటే కాటన్ ఫ్రాక్ మంచి ఎంపిక .కాటన్ బాటమ్ ఇక్కత్ ఖాదీ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసిన ఫ్రాక్ క్యాజువల్ లుక్ గానూ స్టైల్ గానూ బావుంటుంది. ప్లెయిన్ షార్ట్ ఫ్రాక్ ,సూట్ వేసుకొని ,హెవీ వర్క్ డిజైన్ చేసిన దుపట్టా వేసుకుంటే పార్టీ వేర్ […]

శ్రద్ద పెట్టాలి

ఖరీదైన చీరెలు ఒక్కసారి డ్రైక్లీనింగ్ కు ఇచ్చిన రంగు వెలిసి మిగతా చీరె మొత్తం పైటకొంగు రంగు అంటుకొని వాడేందుకు వీల్లెకుండా అయిపోతాయి. డ్రైక్లీనింగ్ కు ఇవ్వకుండా ఒక చెంచా డిటర్జెంట్ ద్రావణంలో ,,షాంపూనూ కలిపి ఈ మిశ్రమంలో చీరెని ఉతికి పిండకుండా నీడలో ఆరేస్తే వెలిసి పోకుండా ఉంటాయి. ఖరీదైనా పట్టు కొరా,ఆర్గంజా ,చండేరి వంటివి వెంటవెంటనే ఉతికేందుకు ఇవ్వకపోయినా పర్లేదు. ఈ చీరెల్ని బట్టే చక్కకర్రలు బజార్లో దోరుకుతాయి. ఖరీదైనా చీరెల్ని కాసేపు కట్టుకొన్నాక […]

కొత్త కొత్త రుచులతో

ఐస్ క్రీమ్ అందరి ఫేవరేట్ ఇక వేసవి వస్తే నాకు ఐస్ క్రీమ్ అని అడగని పిల్లలుండరు. పాల మీగడ పంచదారా రుచితో ఉండే ఐస్ క్రీమ్ సీతాఫలం ,కొబ్బరిలతో కలుపుకొని మామిడి ,నేరేడు,జామా, ఖర్జూరం ,ఫైనాఫిల్ వంటి అన్నీ పండ్ల రుచులతోనూ వస్తున్నాయి. అచ్చంగా ఈ పండ్లతోనే చేస్తారు కనుక పండ్ల రుచి ఇంకా ఊరిస్తు ఉంటాయి. అయితే కొత్త ట్రెండ్ ఏమిటంటే రుచిని రుచిగా ఇస్తే సరిపోదు .దానికి మంచి ప్యాకింగ్ కావాలి. ఐచింగ్ […]

కొంచెం మేకప్‌ అవసరం

ఏదైనా ప్రత్యేక సందర్భాలకు తయారవుతున్నప్పుడు మేకప్ విషయంలో కొన్నీ జాగ్రత్తలు తీసుకొంటే చాలా సేపు మొహాం ఫ్రెష్ గా ఉంటుంది. పొడిచర్మం ఉన్న వాళ్ళు క్రీం తరహా ప్రైమర్ ఎంచుకొంటే ఇది చర్మానికి తేమ అందిస్తుంది. అప్పుడు దానిపై ఫౌండేషన్ ఎక్కువ సేపు నిలబడుతుంది.చర్మం జిడ్డుగా ఉందనిపిస్తే మ్యాటీ తరహా ప్రైమర్ ఎంచుకొంటే సరిపోతుంది. దీన్ని కొద్దిగా అప్లైచేస్తే ముఖంపై రంధ్రాలు కనిపించకండా ఉంటాయి. ఫౌండేషన్ జిడ్డుగా అయిపోకుండా ఉంటుంది. చర్మం సున్నితంగా ఉంది అనిపిస్తే కరెక్టర్ […]

ప్రేక్షకులకు నచ్చాలి

ప్రేక్షకుల అభిరుచిని బట్టీ నా ప్రాధాన్యాలు మారతాయి అంటోంది కాజల్ . నా సొంత ఆలోచనలు, నాకు అనుకూలంగా ఉండటం గురించి నా కెరీర్ విషయంలో పట్టించుకోను. నన్ను నేను సరికొత్త గా చూసుకోవాలి అన్న ఆలోచనలు నాకు రావు. ప్రేక్షకులనే దృష్టిలో ఉంచుకొంటా, వాళ్ళకి ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు వచ్చేవి అందుకు తగ్గట్టు నేను ఆ సినిమాల్లోనే నటించాను. ఇప్పుడు కొత్త ట్రెండ్ ప్రయోగాలు నచ్చుతున్నాయి. నాకు మంచి కథలు మంచి పాత్రలు ఎంచుకొనే అవకాశం […]

ఇవి ఇవ్వాల్టి ట్రెండ్

మ్యాచింగ్ అన్న పదం లేకుండా ఫ్యాషన్ లేనే  లేదు. అన్నీ నగల సెట్లూ వచ్చాయి. ఇప్పుడు ఓ గాజు దానికి మ్యాచ్ అయ్యే ఉంగరం లేటెస్ట్ గా కనిపిస్తున్నాయి. ఫ్యాషన్ గా ట్రెండీగా కనిపించే గాజునీ ,దానికి మ్యాచ్ అయ్యే ఉంగారాన్ని జతచేశారు. బంగారంతో పాటు ,ప్యాన్సీ రకాల్లో కూడా ఈ బ్రాస్ లెట్ ఉంగరాలు సెట్లు వచ్చాయి. గులాబీ,నీలం, పసుపు పచ్చ రాళ్ళతో పాటు ,తెల్లని రాళ్ళతో పొదిగిన బ్రాస్ లెట్ అచ్చం అలాంటిదే కలిపిన […]

కలిపి వేసుకుంటే తప్పే

ప్రతి చిన్న అంశంలోనూ జాగ్రత్తగా ఉంటె శరీరం మనకు సహకరిస్తుందంటున్నారు వైద్యులు. సాధారణంగా ఏదైన అనారోగ్యం వస్తే కొన్ని మందులు రాస్తారు వైద్యులు. ఆ మందుల్ని ఎలా వాడమన్నారో అలానే వాడాలి. ఇవి ఉదయం వేసుకుని ఇవి రాత్రిళ్ళు వేసుకునేవి అంటూ నాలుగైదు కలిపేసి ఒకేసారి గొంతులో వేసుకుంటే అనారోగ్యం తగ్గకపోగా ఇతర సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. ఉదాహరణకు నొప్పి నివారణ మాత్రలు,నిద్రకోసం ఇచ్చేవి కలిపి ఒకేసారి వేసుకుంటే ఆస్పత్రులు చుట్టు తిరగవలిసివస్తుందని చెపుతున్నారు. ఏ టాబ్లెట్ […]

కొవ్వులు అవసరమే

నెయ్యి,కొబ్బరి నూనెలను ప్రతిరోజు భోజనంలో భాగంగా చేసుకోమంటున్నారు వైద్యులు, కొవ్వులు మన శరీరంలో మంచి బాక్టీరియా పెరుగుదలకు సాయపడతాయని ఈ మార్పుతో జీర్ణక్రియ వేగవంతం అవుతుందంటున్నారు. అధిక కోవ్వు ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల 24 గంటల్లోనే చిన్న ప్రేవుల్లో బాక్టీరియా గణనీయంగా పెరుగుతుందని వీటి స్రావాలు కొవ్వును విడగొడతాయని రిపోర్ట్. నిజానికి ఇలాంటి కొవ్వులున్న భోజనం తోనే శరీరం బరువు కూడా తగ్గుతుందని చెపుతున్నారు.

ఆహరమే పరిష్కారం

మోనోపాజ్ దశలో ఆరోగ్యంలో వచ్చే మార్పులను తగ్గించుకోవాలంటే సరైన ఆహారం ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు. ఈ దశలో శరీరంలోలో తగ్గే ఈస్ట్రోజన్ హార్మోన్ ను సహజమైన ఆహారం ద్వార పొందవచ్చు. సోయ ఉత్పత్తులు, కాల్షీయం పుష్కలంగా ఉండే పాలు , పాల ఆధారిత పదార్ధాలు, ఆకుకురలు, నట్స్, నూనె గింజలు, చిరు ధాన్యాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. పసుపు, నారింజ వర్ణంలో ఉండే కూరగాయలు , పండ్లు, నిమ్మ,జామ విటమిన్ ఇ దోరికే వంటనూనెలు , నువ్వులు, పల్లీలు, […]

స్ట్రెస్ తగ్గించే డూడుల్ ఆర్ట్

డూడుల్ ఆర్ట్ మానసిక ఆనందానికి మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది అంటారు వైద్యులు. పెన్సిల్ పట్టుకున్నా చేయి పైకి లేపకుండా అద్భుతమైన పెయింటింగో,బోమ్మనో తీర్చిదిద్దటాన్ని డూడుల్ ఆర్ట్ అంటారు. కళల ద్వారా మానసిక ఆరోగ్యాన్ని తగ్గించే దిశగా ఈ డూడుల్ గురించి కొంత చర్చ జరిగింది. పిల్లలు ఈ బొమ్మలు వేయటం స్వేచ్చగా రంగులు ఉపయోగించటం వాళ్ళకు కళల పైన ఇంట్రస్ట్ కలిగేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈ గాడమైన రంగులతో వేయగలిగే డూడుల్ ఆర్ట్ కోసం ఆన్ […]

ఇందుకే తినేస్తాం

సాధారణంగా ఒత్తిడికి గురయ్యే వాళ్ళే ఊబకాయులవుతారు అంటుంది ఒక పరిశోధన. జపాన్ లోని నేషనల్ ఇన్ స్ట్యూట్ ఫర్ ఫిజియోలాజికల్ సైన్సెస్ చేసిన అధ్యాయనంలో మనిషి బరువు పెరగటంలో మెదడు పాత్ర ఉందని తేలింది, మానసిక ఒత్తిడికి గురైతే శరీరం కార్బోహైడ్రేట్స్ పొగొట్టుకుంటుంది. దానిలో అవసరమైన కార్బోహైడ్రేట్స్ తీసుకోమని మెదడు ప్రోత్సహిస్తుంది. అంతే ఆకలిగా అనిపిస్తుంది. ఇక తినటం మొదలుపెట్టేస్తారు. ఒత్తిడి తగ్గేంతవరకు ఏదైన తినాలనే కోరిక మనిషిని నిలబడనివ్వదు. ఆ సమయంలో స్వీట్లు అందుబాటులో ఉంటె […]

ప్యాకేజింగ్ తో ప్రమాదం

ప్యాకెట్ ఫుడ్ తో ఎన్నో అనారోగ్యాలు అని ఎప్పటి నుంచో వింటున్నాం కానీ ప్యాకెజింగ్ కు వాడే పదార్ధాల కారణంగా పోషకాలు వంటబట్టకుండా పోతున్నాయని బర్మింగ్ హాట్ మన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇంకో కొత్త విషయాన్ని చెపుతున్నారు. ప్యాకెట్ల లైనింగ్ లో జంక్ ఆక్సైడ్ వాడతారు. బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ద్వారా ఆహారం పాడవకుండా ఈ జంక్ ఆక్సైడ్ అడ్డుకుంటుంది. అయితే ఇది నానో స్థాయి ఆహారంలో చేరుతుందని ఈ కారణంగా పేగుల్లో కణాలు సక్రమంగా పని […]

చల్లదనం ఇచ్చే ప్యాక్

ఎండకు నల్లబడ్డ చర్మం తిరిగి మాములు చాయలోకి రావాలంటే ఇంట్లో తయారు చేసుకునే కొన్ని సమ్మర్ ప్యాక్స్ బాగా పని చేస్తాయి. నిమ్మ, కలబంద ప్యాక్ అన్నింటిలోనూ మంచిది. నిమ్మ బ్లీచింగ్ ఏజెంట్, కలబంద చర్మం పై ఉండే బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులను చంపే గుణం ఉంటుంది. కలబంద గుజ్జు నిమ్మరసం కలిపి మోహనికి అప్లయ్ చేసి బాగా ఆరిపోయాక కడిగేస్తే చాలు. తెనె,పెరుగులు సహజమైన మాయిశ్చరైజర్లు. ఎండ వల్ల పొడిబారిన చర్మం తేమగా తయారవ్వాలంటే పసుపు, […]

నాన బెడితే మంచిది

ఆల్మండ్స్ లో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, ఒమెగా, ఒమెగా 6, ఫ్యాటీ యాసిడ్స్, కాల్షీయం, మెగ్నీషియం, జింక్ లు సహజంగానే శరీరానికి మేలు చేస్తాయి. బాదం నూనె శిరోజాలకు చేసే మేలు అంతా ఇంతకాదు. బాదం పప్పులు శరీరానికి వేడిని, శక్తిని ఇస్తాయి. జీర్ణక్రియకు సాయం చేస్తాయి. పోషకాహారనిపుణులు వేసవిలో బాదం పప్పును నానబెట్టి తినమంటున్నారు. అవి తెలిగ్గా జీర్ణం అవుతాయి. పై పొట్టు తీయకుండా నానిన బాదం పప్పు తింటే అందులో విటమిన్ […]

వేసవి ఎంపిక కుర్తీలే

లేలేత రంగుల్లో కళ్ళకు కట్టిపడేస్తున్న సమ్మర్ ఫ్రెండ్లీ కాటన్ కుర్తీల ఇమేజెస్ చూస్తే సగం ఎండలు చల్లబడ్డట్లే ఉన్నాయి. మండు వేసవిలో భారీ పనితనం ఉండే బరువైన లెహంగాలు పేరు చెపితేనే భయపడతారు అమ్మయిలు. అలాంటప్పుడు వాళ్ళ ఎంపిక కుర్తీలే. లెగ్గిన్స్ , జెగ్గింన్స్, పాటియాలా ,పలాజోలకు నప్పేలా రకరకాల కుర్తీలు అంటే పోడవాటివి, పొట్టివి , ఫుల్ స్లీవ్స్, , కోల్డ్ స్లీవ్స్ , స్ట్రెయిట్ కట్స్ ఎంచుకుంటే చక్కగా ఉంటాయి. మరీ గాడీ కలర్స్ […]

వంటింటి గమ్మత్తు

వంటిల్లే చిన్నపాటి ఔషదాలకు నిలయం. చిన్ని చిన్ని అనారోగ్యాలకు వంటింట్లోనే మందులు దొరుకుతాయి. చిన్న అల్లం ముక్క వేడి చేసి ఉప్పు అద్ది పరగడుపునే నమలాలి. ఇలా తింటే జీర్ణకోశ సంబంధిత అనారోగ్యాలు రావు. గొంతు ఇన్ ఫెక్షన్లు రావు, నిమ్మ రసంలో ఉప్పు కలిపి అల్లం ముక్కలు నానాబెట్టి ఒక వారం బాగా ఉంచాక ఎండబెట్టి వాటిని నిల్వచేసుకోవచ్చు. ప్రతిరోజు ఒకటో రెండో ముక్కలు చప్పరిస్తే జీర్ణక్రియ ఇబ్బందులు పోతాయి. అలగే కరివేపాకు రసం డయాబెటీస్ […]

అన్ని సర్ధుకోండి

సెలవుల్లో తప్పనిసరిగా పిల్లలతో ప్రయాణం పెట్టుకుంటారు. సరిగా ప్లాన్ చేసుకుని ముందే లిస్ట్ ప్రకారం అన్ని సర్దుకుంటే పిల్లలతో ప్రయాణాలు చాలా సరదా ఇస్తాయి. టూర్ ప్లాన్ లో పిల్లలు ఎంజాయ్ చేసే ప్లే జోన్స్, ఫుడ్ జోన్స్ ముందుగానే వెతికి పెట్టుకోవాలి. చారిత్రక ప్రదేశాలు థీమ్ పార్క్ లకు వెళితే ముందే పిల్లలకు వాటి గురించి చెప్పి వాళ్ళు ఏమి చూడబోతున్నారో ప్రిపేర్ చేస్తే వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు. పిల్లల కోసం కావలిసినన్ని స్నాక్స్ ముందే రెడీ […]

సుగంధ పరిమళం

ఎప్పుడు స్ప్రేలు, బాడీ లోషన్ లేనా అని కాస్తా వెరైటీ కోసం చూస్తే పరిమళ ద్రవ్యాలు వైపు చూడోచ్చు. ఈ కాలంలో మల్లెలు ఎలాగు వస్తాయి. అలాగే పువ్వులు,పండ్లు సిట్రస్ ఆధారితంగా చేసినవి ఎన్నో సువాసనాలు ఉన్నాయి. ఎండల్లో చెమటలు ఎక్కువగా పోస్తాయి. బాడీ లోషన్ లు ఇవ్వలేని తాజా సువాసనని ఈ పరిమళాలు ఇస్తాయి. మెడ, మోచేతులు,మణికట్టు,భుజాల వద్ద కొద్దిగా అద్దిన సరే మల్లె, సన్నజాజులు పరిమళం రోజంతా మనలో వస్తూనే ఉంటుంది. ఇవి ఒకే […]

సోషల్ మీడియా వద్దే వద్దు

విలువైన సమయం వృధా అయిపోతుందనే ముఖ్యంగా నేను సోషల్ మీడియాలో లేకపోవటానికి కారణం అంటుంది కంగనా రనౌత్. ఖాతా తెరిస్తే మంచిదని ఎన్నో బ్రాండ్స్ కు ఉపయోగం అంటున్నారు. కొంతమంది ఏజెంట్లు మా ఖాతా తెరవండి మేము పోస్టుల సంగతి చూస్తాం అంటున్నారు. అది మరి అన్యాయం. నేను చూడకుండ నా పేరు పంపి పోస్టులు పెడతారు. ఆ ఫేక్ పోస్టుల్ని అభిమానులు అనుసరించటం కోట్లమందిని మోసం చేయటమే కదా. అలాంటి ఫేక్ రిలేషన్స్ వద్దనుకున్నాను అంటుంది […]