Monday, 30 Nov, 2026

చల్లని పాలే ఔషధం

చల్లని పాలు తాగుతూ ఉంటే ఉదరంలో ఇబ్బంది పెట్టే ఎసిడిటీ సమస్య పోతుంది అంటున్నారు వైద్యులు. కడుపులో తయారయ్యే యాసిడ్స్ ని పాలు పీల్చుకుంటాయి. కొబ్బరి నీళ్ళు తాగిన సరే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఎసిడిటీ సమస్య ఉపశమిస్తుంది. అరటిపండులోని పోటాషియం పీచు కూడా ఈ సమస్యను తగ్గిస్తాయి. బొప్పాయి,పుచ్చకాలో పీచు యాంటీఆక్సిడెంట్స్ ఎసిడిటీ సమస్య తగ్గిస్తాయి.

అతిగా చేస్తే

ఇల్లు నీటిగా సినిమా సెట్టింగులాగా అద్భుతంగా ఉండాలని అందరు కోరుకుంటారు. ఏదో ఒక క్లీనింగ్ ఎయిడ్ తో ఇరవై నాలుగు గంటలు ఇంటి శుభ్రతలో మునిగి తేలతారు ,కానీ అతి శుభ్రత వల్ల కూడా నష్టమే అంటారు ఎక్స్ పర్ట్స్. మచ్చల్ని ,మురికిని తొలగించగల యాసిడ్స్ ప్రధానంగా ఉండే ద్రావాణాలు ,డిటర్జెంట్స్, ఇతర క్లీనింగ్ ద్రావకాల్లో ఉండే గాఢత ,వాటి ప్రభావం ఊపిరితిత్తులపై పడుతుంది అంటున్నారు . క్లీనింగ్ ఎయిర్స్ తో ముందుగా గుండెకు ,ఊపిరితిత్తులకు సంబంధించిన […]

గాడ్ ఫాదర్స్ ఉంటే మంచిదే

మన గురించి మనమే అత్యంత శ్రద్దతో ఉండాలి. ఈ చిత్రసీమలో గాడ్ ఫాదర్స్ ఉంటే వాళ్ళ ప్రోత్సహంతో చక్కగా నిలదొక్కుకోవచ్చు అని ఊహిస్తూ కుర్చుంటే నష్టమే మనలో మనకి కూడా ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగే విజ్ణత కూడా చాలా అవసరం అంటుంది జాక్వెలిన్ శ్రీలంక. తనకు కరణ్ జోహర్ లాంటి శ్రేయోభిలాషులు ఉన్నారు నేను నా మేలు కోరుకునే వాళ్ళ మార్గదర్శకత్వంలో కొంత ముందుకు వెళతాను. అదే సమయంలో సోంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తాను […]

పాపాయికి ఒత్తిడే

గర్భవతిగా ఉన్నప్పుడు కుటుంబం మొత్తం ఆమె పైన అపరిమితమైన శ్రద్ద చూపించాలి అంటున్నారు డాక్టర్లు. గర్భిణిగా స్త్రీల మానసిక ఆందోళన పుట్టే బిడ్డల పై తప్పనిసరిగా ఉంటుందంటున్నారు. ఎలాంటి ఆందోళన ఒత్తిడి లేని ప్రశాంతమైన వాతావరణంలో ఆమె ప్రసవం జరగాలంటున్నారు. కడుపులో ఉన్నప్పుడే ఆందోళనకు గురైతే పిల్లల ప్రవర్తనలో తేడాలోస్తాయి. పుట్టిన మూడేళ్ళకే ఈ విషయం గమనించవచ్చంటున్నారు. చదువులో వెనకబడటం ప్రవర్తనతో విసిగించటం ప్రతిదానికి పెద్దవాళ్ళతో ఉద్రేకపడటం వంటి లక్షణాలను పిల్లలలో గమనించవచ్చు అంటున్నారు డాక్టర్లు. పిల్లల […]

నిద్ర చాలకే ఆకలి

మెలుకువగా ఉన్నంతసేపు జీవ క్రియల రేటును ప్రభావితం చేసే ఘ్రెలిన్, లెఫ్టిన్ హార్మోన్ శరీరం విడుదల చేస్తుంది. చాలినంత నిద్ర లేకపోతే ఈ హార్మోన్లు ప్రభావితమై ఆకలిని కలిగిస్తాయి. దింతో ఎదో ఒకటి తినేస్తారు.బరువు పెరగటానికి నిద్రకు ఉన్న సంబంధం అదే. ఐదు గంటలకంటే తక్కువ తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోకూడదు. చాలినంత నిద్ర ఆరోగ్యం పై బరువు పై అదుపు చేస్తుంది. రాత్రి వేళ ప్రశాంతంగా నిద్రిస్తే మెదడు చురుగ్గా ఉంటుంది. హార్మోన్స్ స్థాయిలు […]

వేసవి పానీయాలు

వేసవిలో శరీరానికి ఎలక్ట్రో లైట్స్ అందాలి అంటే పోటాషియం, కాల్షియం, సోడియం బై కార్బోనేట్ , సోడియం క్లోరైడ్ వంటి పానీయాలు అందాలి. కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రో లైట్స్ అందుతాయి. నిమ్మ,నారింజ, కమలా, ద్రాక్షా అల్లం రసం కూడా ప్రయోజనకరం. నరాలు సక్రమంగా పని చేస్తూ గుండే పదిలంగా ఉండాలి అంటే ఉప్పు కలిపిన పంచదార నీరు తక్షణ ఉపశమనం గా తాగాలి. కీర దోసలు, పొటాషియం, మంగానీస్, మెఘ్నీషియం ఎక్కువగా ఉంటాయి. కీరదోస రసం, సబ్జా […]

మిల్లెట్స్ తో బిస్కెట్స్

IND millet foods పేరుతో రాగులు,జొన్నలు మొదలైన తృణ ధాన్యాలతో చిరు తిళ్ళ తయారి మొదలు పెట్టారు మాధవి, దివ్య. మార్కెట్ లో దోరికే ప్లేక్స్,క్రిస్పీలు ,బిస్కట్లతో తృణ ధాన్యాలు తయారు చేస్తారు ఈ వ్యాపారవేత్తలు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన అంగన్ వాడీల పిల్లలకోసం హైడెన్సిఫైడ్ ఫుడ్ తయారు చేయడం మొదలు పెట్టారు. బెస్ట్ మిల్లెట్ పారిశ్రామిక వేత్త అవార్డ్ , తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే బెస్ట్ విమెన్స్ స్టార్టప్ అవార్డు అందుకొన్నారు. రిగ్దమ్ పేరుతో […]

అప్పుడప్పుడైనా వద్దా

ఎంత గ్లామర్,ఎంత సినిమా, షూటింగ్స్ కోసం శ్రద్దగా డైట్ చేసిన ఏదైన పండగ వచ్చిందా అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతాను అంటుంది తమన్నా. ఆహార నియమాలు కరెక్ట్ గా పాటించాలి మరీ మనం మన నోటిని కట్టేసుకుని అలా బాధగా ఉండక్కర్లేదు. అందుకే నేను పెట్టుకునే గీతలు నేనే దాటేస్తా. దీపావళి వస్తే ఇల్లంతా తియ్యని వస్తువులే ఇక ఆ రోజు మాత్రం ఇష్టమైనవన్ని అమ్మ ఇష్టంగా చేసి పెట్టేస్తుంది. ఇక ఆపకుండ తినటమే అలాగే […]

ఎంబ్రాయిడరీ చేరిస్తే అందం

వెస్ట్రన్ పార్టీల్లో తప్పనిసరిగా కనిపించే లాంగ్ గౌన్ ఇండియన్ స్టయిల్ కు మారిపోయిందనడానికి ఎంబ్రాయిడరీ అంచులతో కొత్త లుక్ లో దర్శనం ఇస్తుంది. పట్టు,ఫ్యాబ్రిక్ లాంగ్ గౌన్ ను రిచ్ గా చూపిస్తుంది. రెండు చేతులకు పెద్ద మోటిఫ్స్ చీర మొత్తం జరీ, జర్దోసీ ఎంబ్రాయిడరీలు ఈ లాంగ్ గౌన్ కళ్ళకు ఆకర్షణియంగా ఉంటుంది. లాంగ్ గౌన్ ప్లెయిన్ గా ఉంటే బావుంటుందని నెక్ కు చేతులకి అంచులుగా దుపట్టాకి జరీ ఎంబ్రాయిడరీ తో రిచ్ లుక్ […]

కాగితపు వస్త్రం

శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో చేనేతకారుల కుటుంబంలో పుట్టిన నీరజ పోలిశెట్టి ఎకో ఫ్రెండ్లీ టెక్స్ టైల్ లో ఒక వ్యాపార సామ్రాజ్యానికి మొదటి అడుగు వేసింది. పేపర్ ను సన్నటి పోగులు చేసి రాట్నంలో వేసి వడికి మగ్గం పైన వేసి కంప్లీట్ క్లాత్ ను సృష్టించింది. సూత్రకార్ క్రియోషన్స్ స్థాపించింది. వీవింగ్ స్టూడియోలు ఇప్పుడామె ఫోటో ఫ్రేమ్స్ రోషన్ కవర్లు పెన్ స్టాండ్లు, రూమ్ పార్టిషన్స్ , సోఫా కవర్లు తయారు చేస్తుంది. కరెంట్ వాడకం […]

రుచీ ఆరోగ్యం

ఇప్పుడు అన్ని రకాల పచ్చళ్ళు పెడతారు. అందులో గోంగూర కూడా ఒకటి. మంచి గోంగూర దొరుకుతుంది ఈ రోజుల్లో ఎంతరుచిగా ఉంటుందో ఆరోగ్యపరంగా మంచి ఐరన్ కూడా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచి గుండె జబ్బులను నివారిస్తుంది. పొటాషియం చాలా ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్స్ అధికం క్యాన్సర్ ట్యూమర్లను తగ్గిస్తుంది. సీ విటమిన్ పాళ్ళు ఎక్కువ. ఫైబర్ కూడా ఎక్కువే గోంగూర లో దొరికే విటమిన్ సీ ప్రీ రాడికల్స్ ను హరించి […]

ముందర చర్మం పాడవుతుంది

ఫెయిర్ నెస్ క్రీములు మొహన్ని తెటగా ఉంచుతాయో లేదో తెలీదు కానీ ఎన్నో చర్మ సమస్యలకు మాత్రం కారణం అవుతున్నాయంటున్నారు. డాక్టర్స్ క్రీమ్ లలో సాధరణంగా వాడే బెక్లామెథాఫోన్, బీటా మెథాఫోన్ వంటి స్టెరాయిడ్స్ చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. వీటి వల్లనే చర్మం పిగ్మెంటేషన్ కు గురవుతుంది. వీటిని నిరంతరం వాడటం వల్ల చర్మం పలుచగా అయిపోవడం మొటిమలతో ఎండకు చర్మం కందిపోవడం వంటి చర్మ సమస్యలు తలెత్తుతాయని డాక్టర్స్ చెపుతున్నారు. తెల్లదనంలోనే అందం ఉందని […]

ఇంట్లోనే చేయవచ్చు

శరీరం బరువు పెరక్కుండా చేసేందుకు ఇంట్లోనే కొన్నీ వ్యాయామాలు ఎంచుకోవచ్చు. ఇవి ప్రతి రోజు ఓ అరగంట సేపు ఉత్సహంగా చేసినా చాలు బరువు ఖచ్చింగా తగ్గుతారు. బరువు నియంత్రిచుకునేందుకు చక్కని వ్యాయామం ముందుగా తాడాటే . శరీరాన్ని యాక్టివ్ గా కూడా అవుతుంది. కుర్చీతో చేసే స్టెప్పులు వ్యాయామం ,పిరుదులు,తోడల్లో పేరుకొన్న కొవ్వుని అదుపులో ఉంచుతాయి. బోర్లాపడుకొని రెండు కాళ్ళనీ దగ్గరగా చేసి,రెండు చేతుల భారంతో శరీరాన్నీ పైకీ కిందకు తీసుకొచ్చే ప్లాంక్స్ వ్యాయామంతో చేతులు  […]

హీల్ మసాజ్

ఏ ఎక్సర్ సైజ్ చేసినా ముందు పాదాల నొప్పులు పట్టుకుంటాయి. నడక ,సైక్లింగ్ ,మారథన్ ఏ వ్యాయామం లోనైన ఆసక్తి చూపించే స్నేహితులు కూడా ఈ సమస్య ఎప్పుడు చెపుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారం హీల్ మసాజ్ .ప్రతి రోజు ఉదయం రాత్రి నిద్ర పోయే ముందర ఈ మసాజర్ ను వాడితే నొప్పులు తగ్గుతాయి. ఈ నొప్పులు తగ్గించుకోకపోతే మొత్తం వ్యాయామం అంటేనే విరక్తి రావచ్చు అది మరీ ప్రమాదం.

వారానికోరోజైన మంచిదే

43 వేల మందిలో నిద్రా సమయం మారటం వల్ల కలిగే ఫలితాల గురించి చేసిన అధ్యయనంలో ఒక పరిమితమైన సమయంలో నిద్రపోయే వాళ్ళకంటే నిద్ర సమయాలు తరుచూ మార్చుకొనే వ్యక్తులే ఆరోగ్యంగా ఉన్నారని తేలింది. వారం మొత్తం నిద్రంతాచంపుకుని ఏ రెండు గంటలో నిద్రపోయి ,వారాంతంలో దోరికే సెలవు పూట నిరాటంకంగా గంటల కొద్ది నిద్రపోయే వాళ్ళు సలక్షణంగా ,ఆరోగ్యంగా ఉన్నారట. టైం టేబుల్ కు అలవాటిపడి రోటీన్ గా అయిపోకుండా కాస్త నిద్ర సమయం అటు […]

కాంతినిచ్చే మాస్కులు

వేసవి ఎండకు మోహం నల్లబడితే కొన్నీ ఆయుర్వేద చిట్కాలతో మెరిసిపోవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. గంధం పోడిలో ,భాధం పప్పుల పొడి ,కొబ్బరి నూనె కలిపి మొహానికి మాస్క్ ల వేస్తే , గంధంలోని యాంటీవైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. అలోవెరా గుజ్జులు నిమ్మరసం కలిపి పేస్టులా చేసి మొహానికి అప్లైయ్ చేస్తే ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ చర్మానికి మెరుపు నిస్తాయి బొప్పాయి గుజ్జు ఉసిరి పొడి మిశ్రమం కూడా మొహం కాంతివంతంగా ఉంచుతాయి. […]

ఆరోగ్యాన్నిచ్చే స్నేహం

పసితనంలో చేసే స్నేహాలు భవిష్యత్ లో వాళ్ళ ఆరోగ్యానికి కారణం అవుతాయని అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ నిపుణులు. ఐదేళ్ళు దాటిన దగ్గర నుంచి స్నేహం ఎంతో విలువైనదో అర్థం అవుతుంది. స్నేహితులతోనే ఎంతోసేపు గడపుతారు .వాళ్ళతోనే మనసు విప్పి మాట్లాడుకుంటారు. వాళ్ళు కౌమార దశకు వచ్చే వరకు ఈ స్నేహం ఇలాగే కొనసాగుతాయి. అటుతరువాత చదువు ,ఉద్యోగంతో దూరం అయినా, చిన్నప్పటి స్నేహబాంధవ్యం మనసులో పదిలంగా ఉంటుంది. అలా స్నేహితులతో మంచి రిలేషన్ ఉన్నావాళ్ళకి […]

జ్ఞాపక శక్తి పెంచుతోంది

క్రమం తప్పకుండా బీట్ రూట్ రసాన్ని తీసుకొంటూ ఉంటే భవిష్యత్ లో అల్జీమర్స్  రాదంటున్నారు వైద్యులు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా కు చెందిన పరిశోధకులు. బీట్ రూట్ లోని బెటొనిన్ మెదడులో అల్జీమర్స్ కి కారణమైన రసాయనాలలు విడుదల కాకుండా చేస్తుందని తేల్చారు. బీట్ రూట్ రసం మెదడులో ఆక్సిజన్ శాతన్ని పెంచుతుంది. దీనితో మెదడు పని తీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని అంటున్నారు.

మంచి కండిషనర్

కొవ్వు పెంచుతుందని భయపడతా గానీ నెయ్యి చర్మంనిగారింపుకు ,శిరోజాల సమస్యల పరిష్కారంలోనూ ముందుంటుందని ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు.  జుట్టు ఊడటం రాలిపోవటం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. నెయ్యి శిరోజాల పరిరక్షణకు బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. రెండు టీ స్పూన్లు నెయ్యి ,టీ స్ఫూన్ ఆలీవ్ ఆయిల్ తో కలిపి తలకు రాసి ఓ ఇరవై నిమిషాలు అలా వదిలేసి తేలికపాటి షాంపూతో స్నానం చేస్తే తలకు మంచి కండిషనర్ గా ఉపయోగపడుతుంది అంటున్నారు.

నటిగా పేరోస్తే బావుండు

‘ఇ ఈ’ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ముంబై నుంచి వచ్చిన నైరాషా. నటిని కావాలని చిన్నతనం నుంచి అనుకున్నాను అనుపమ్ భేదా ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నాను. నటనతో పాటు వైద్యవృత్తి అంటే కూడా ఇష్టం .అటు సీటు రాలేదు అంచేత నటనే ఫస్ట్ ఆప్షన్ అయింది. అంతలో ఇ ఈ లో అవకాశం వచ్చింది. చదువుకు బ్రెక్ ఇచ్చి ఇటు వచ్చేశాను అంటోంది నైరాషా . నటిగా నాకు మంచి పేరు […]