Thursday, 12 Nov, 2026

సాగర యాత్ర

పాండిచ్చేరి కి చెందిన రూప, కాలికట్ కు చెందిన డెల్ నా అనే ఇద్దరు నావికులు సముద్రం పైన ప్రపంచ యాత్ర చేయనున్నారు.నావికా సాగర్ పరిక్రమ 2 ఈ ఇద్దరు మహిళ ఆఫీసర్లు సెలెక్ట్ అయ్యారు.ఈ సాగర్ పరిక్రమ ఉద్దేశ్యం సముద్ర మార్గాన ప్రపంచాన్ని చుట్టి రావడం గత మూడేళ్లుగా ఈ ఇద్దరూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పటికే ఇద్దరు తారిణి అనే సెయిల్ బోట్లో 34 వేల నాటికల్ మైళ్ళు తిరిగారు ఇద్దరు కలిసి సముద్రం పైన […]

వెదురు కు ప్రోత్సాహం

బ్యాం బూజ్ సంస్థ నిర్వాహకురాలు ఇంద్రాణి ముఖర్జీ ఇది కాంక్రీట్ కట్టడాలకు ప్రత్యామ్నాయంగా వెదురు నిర్మాణ సామాగ్రిని అందిస్తుంది.బెంగళూరు లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఇంద్రాణి పర్యావరణ ప్రేమికురాలు కాలుష్య కారక పదార్థాలు ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా వెదురును ఎంచుకొని ఎన్నో పరిశోధనలు చేసి బ్యాం బూజ్  స్థాపించారు. ఇప్పటి వరకు ఈ సంస్థ కె ఎస్ ఆర్ టి, బి ఎం టి సి సహకారంతో బస్ బాడీ బిల్డింగ్ లకు ప్రత్యామ్నాయంగా వెదురు బోర్డ్ లు […]

ఇక్కడ పిల్లలే రైతులు

పర్యావరణాన్ని విధంగా ప్రేమించే మాయా గణేష్ యూకే లో ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ లో మాస్టర్స్ చేశారు. పిల్లలకు వ్యవసాయం పరిచయం చేస్తే మంచిదని భావించారు. 2018 లో ఒక పాఠశాలలో స్కూల్ గార్డెన్ ప్రారంభించారు. పనులన్నీ విద్యార్థులే చేస్తారక్కడ అక్కడ పండే కూరగాయలు ఆకుకూరలు స్కూల్ కమ్యూనిటీలో అమ్ముతారు. ఒక ఎకరంలో 30 రకాల పంటలు వేసి ఒక్క సాగు ఎలా చేస్తే ఎన్ని రకాల ధాన్యాలు కూరలు ఉత్పత్తి చేయచ్చో పిల్లలు నేర్చుకునేలా […]

అంతరిక్షంలో ప్రయాణం    

అనంత ఆకాశంలో ప్రయాణం చేసి వచ్చారు 24 ఏళ్ల అన్నా మీనన్, 30 ఏళ్ల సారా గిల్లిస్ ఈ ఇద్దరూ వ్యోమగాములు స్పేస్ సంస్థ అంతరిక్షంలో తొలిసారి నిర్వహించిన ప్రైవేట్ స్పేస్ వాక్ లో ఉన్నారు. పొలారిస్ డాన్ మిషన్‌లో భాగంగా ఫాల్కాన్-    9 రాకెట్ లో పంపిన నలుగురిలో ఈ ఇద్దరు ఉన్నారు స్పేస్ సంస్థ ఆన్‌బోర్డ్ మెడికల్ ఆఫీసర్‌గా అన్నా స్పేస్ ఫ్లయిట్  మిషన్ సిబ్బంది శిక్షకురాలిగా సారా ఈ మిషన్ లో […]

అందరికీ నచ్చే బంగారు అంచులు  

కసావు అనేది కేరళ లో పురాతన చేనేత పద్ధతి. ఆ పేరుతోనే కసావు చీరలు వచ్చాయి. అతి సున్నితమైన బంగారు వెండి దారాలతో అంచు నేస్తారు.కేరళలో ల్యూగ్ సాధించిన మొట్టమొదటి చేనేత కళ ఇది.  ట్రావెన్‌కోర్ రాజ వంశీయుల కాలంలో కసావు చీరలు ప్రాచుర్యంలోకి వచ్చాయి కేరళలోని బలరామపురం,చెంద మంగళం కుతంపుల్లి గ్రామాల్లో ఈ చేనేత చీరలు నేస్తారు. బ్లీచింగ్, డయింగ్ లేని ఈ చీరలు ఒక్క కేరళలోనే కాదు దేశ విదేశాల్లో అమ్ముడు అవుతున్నాయి. ఈ […]

సైకిల్ పై ప్రపంచ యాత్ర

మన దేశానికి చెందిన అల్ట్రా సైకిలిస్ట్ వేదంగి కులకర్ణి. 20 ఏళ్ల వయసులో ప్రపంచం చుట్టి వచ్చిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించారు. పూణే కు చెందిన కులకర్ణి యు కె లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చదువుకున్నారు. 17 ఏళ్ల వయసులో హిమాలయాల మీదుగా సోలో రైడ్ పూర్తి చేసింది. 2018లో ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో బయలుదేరి న్యూజిలాండ్, కెనడా, పశ్చిమ యూరప్, రష్యా, భారతదేశం మీదుగా ప్రయాణం చేసింది. నాలుగు ఖండాలు 21 దేశాలు చుట్టూ […]

కాఫీ రుచి చెప్పే ఎక్సపర్ట్స్

ఆసియా లో ఫస్ట్ ఉమెన్ ప్రొఫెషనల్ కాఫీ టెస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సునాలినీ మీనన్. న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ లో డిగ్రీ తీసుకుని 50 ఏళ్ల క్రితం కాఫీ బోర్డ్ అసిస్టెంట్ కాఫీ టేస్టర్ పోస్ట్ కు ఎంపికయ్యారు సునాలినీ. పాతికేళ్ల వయసులో కాఫీ సిప్ చేయటం ఫ్లేవర్ నోట్ లు గుర్తించడం నాణ్యత నిర్ణయించటం మొదలుపెట్టారు. రాష్ట్రపతి నుంచి ఉమెన్ అవార్డు తీసుకున్నారు. క్వాలిటీ కంట్రోల్ డైరెక్టర్ గా అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. బెంగళూరు […]

నడిస్తేనే  ఆరోగ్యం

ప్రతి మనిషి వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయటం ఉత్తమం అన్నది ప్రపంచ  ఆరోగ్య సంస్థ సూచనా ఇలా నడిస్తే హృద్రోగ సమస్యలు రావు.అందుకే నిమిషాలు లెక్క పెట్టే యాప్ ల సాయం తీసుకుని వారానికి 150 నిమిషాలు తప్పనిసరిగా నడవాలని చెబుతున్నారు.ఉద్యోగ విరమణ తర్వాత అసలు శారీరక శ్రమ చేయకుండా విశ్రాంతిగా ఉండేవాళ్లకు రుగ్మతులు తప్పవని ఎక్సపర్ట్స్ హెచ్చరిస్తున్నారు.

ఊరందరికీ భోజనం ఒక్కచోటే

చందంకి గుజరాత్ లోని మెహసానా జిల్లాలోని ఒక గ్రామం ఇక్కడ దాదాపు అందరూ వృద్ధులే నివసిస్తారు. వారి పిల్లలు పట్టణాల్లో, కెనడా, ఆస్ట్రేలియాల్లో స్థిరపడ్డారు. ఒంటరిగా మిగిలిన వృద్ధుల కోసం ఒక కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశారు పూనంభాయ్ పటేల్. నెలకు రెండు వేలు కడితే ప్రతిపూట వేడివేడి భోజనం చేయచ్చు. ఊర్లో ఉన్న వృద్ధులందరూ ఈ కిచెన్ కు వచ్చి భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటారు. ఈ కిచెన్ కోసం గ్రామస్తులు ఒక కుక్ లను […]

అందమంతా పువ్వులదే  

ఆర్గానిక్ కాటన్ జర్సీ తో తయారయ్యే ఫోలియేట్ డ్రెసెస్ అమ్మాయిలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పువ్వులు, లతలు, కొమ్మలు, వివిధ రంగుల్లో ప్రకృతిని మరిపించే అంశాలతో కనువిందు చేస్తున్నాయి. ఫ్లోయీ మెటీరియల్ తో తయారయ్యే ఈ సుత్తి మెత్తని డ్రెస్ లు ఈవినింగ్ పార్టీ లో వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. ఈ డ్రెస్ లకు తేలికైన ప్లాటినం,యాంటిక్ జ్యువలరీ, హై హీల్స్ సరిగ్గా మ్యాచ్ అవుతాయి. ఈ అందాల దుస్తుల అసలు అందం పువ్వుల […]

మోడల్ నుంచి ఐ.పి.ఎస్ వరకు

సోషల్ మీడియా లో కొత్త ఫ్యాషన్ లు పరిచయం చేసే ఆష్నా చౌదరి సివిల్స్ రాసి ఐ.పి.ఎస్ అయ్యారు మోడలింగ్ లో ఎన్నో అవకాశాలు, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఆష్నా చౌదరి సివిల్స్ కోసం అన్నీ పక్కన పెట్టారు. సివిల్స్ లో తన ప్రయాణం, ఉద్యోగం సాధించటం వరకు అన్ని వివరాలు  ఇన్‌స్టా‌ లో అందరికీ పంచారు ఆమె  ఇన్‌స్టా‌ కు 2. 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్ఫూర్తిదాయకమైన ఆమె ప్రయాణం సోషల్ […]

శిరోజాలకు బలం  

సిమ్రత్ కతురియా అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ రకరకాల గింజలతో తయారు చేసిన స్మూధీ లక్షల మంది ఇష్టపడ్డారు.రెండు స్పూన్ల అవిసె గింజలు, రెండు స్పూన్ల వేయించిన పొద్దు తిరుగుడు గింజలు, రెండు స్పూన్ల గుమ్మడి గింజలు, రెండు స్పూన్ల తామర గింజలు, మూడు ఖర్జూరాలు కలిపి గ్రైండర్ లో మెత్తగా పొడి చేసుకుని డబ్బాలో దాచుకోవాలి.ఈ పొడిలో రోజు రెండు ఖర్జూరాలు రెండు బాదం పప్పులు కలిపి నీళ్లు పోసి  బ్లెండ్ చేసి వారానికి రెండు […]

పువ్వులతో కోట్ల వ్యాపారం

యశోద,రియా కారుటూరి వూహూ ఫ్రెష్ పేరుతో పువ్వులను అమ్మే ఆన్ లైన్ రిటైల్ బ్రాండ్ మొదలుపెట్టారు. వూహూ అంటే కన్నడలో పువ్వు. బెంగళూరులో పుట్టిన ఈ అక్కా చెల్లెలు విద్యార్థులు. వూహూ ఫ్రెష్ లో చందాదారులుగా చేరితే పండుగలకు ఇతర శుభకార్యాలకు పువ్వులు ఇంటికే అందిస్తారు. పూజ కోసం జీరో టచ్ ప్యాకింగ్ కూడా ఉంటుంది. స్విగ్గి, జొమాటో, అమెజాన్ ద్వారా పూల హారాలు పత్రి కలిపిన దళాలు ప్రత్యేకమైన బాక్స్ లో పెట్టి అమ్ముతారు. ప్రస్తుతం […]

తెలివి పెంచే ఆటలు

డాక్టర్ అమూల్య మైసూర్ చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ పిల్లల వైద్య నిపుణురాలు అవిన్య గేమ్స్ పేరుతో బోర్డ్ గేమ్స్ తయారుచేస్తోంది. రైడ్ విత్ రామా, ప్లే విత్ కృష్ణా వంటి బోర్డ్ గేమ్స్ తయారు చేశారు. ఈ బోర్డ్ గేమ్స్ ఆడటం వల్ల పిల్లల్లో కమ్యూనికేషన్, బృందం తో కలిసి పని చేయటం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి అని చెబుతున్నారు. అమూల్య మైసూర్ బెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అవార్డ్ తీసుకున్నారు. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ […]

ఫ్యాషన్ ప్రపంచం లోకి ఈషా

సీమట్టి అనే టెక్స్‌టైల్ సంస్థ యూత్ కోసం సిద్ధం చేసిన దుస్తుల ప్రచారం కోసం ఇషా రవి అనే ఎఐ అంబాసిడర్ ను సృష్టించారు.అంటే ఈషా నిజం అమ్మాయి కాదు.డిజిటల్ అమ్మాయి.ఈ ఇషా ఫ్రీలాన్సింగ్ ఫ్యాషన్ డిజైనర్ సోలో ట్రావెలర్ కూడా. దేశం మొత్తం తిరుగుతూ వండర్ విత్ ఈషా పేరుతో వివరాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.ఈ టెక్స్‌టైల్ సంస్థ తయారు చేసిన దుస్తుల్ని ఈషా వేసుకొని కనిపిస్తుంది అప్పుడు నచ్చితే వాటిని కొనుక్కోవచ్చు. అన్ని […]

ఆలు చాలా మంచిది

బరువు తగ్గాలి అనుకునేవారు డయాబెటిస్ రోగులు బంగాళదుంపలు తినేందుకు సంకోచిస్తారు కానీ ఇవి నిజానికి చాలా మేలు చేస్తాయి అంటున్నారు పరిశోధకులు.ఉడికించి తొక్క తీసిన దుంపలకు వెన్న ఇతర ఫ్లేవర్లు ఫ్లేవర్స్ కలిపి ఇచ్చిన బంగాళదుంపలు తిన్నవారిలో ఎలాంటి సమస్య రాలేదని చెబుతున్నారు. డయాబెటిక్ సమస్య ఉన్న వారిని కూడా ఈ దుంపలు తినమనే సలహా ఇస్తున్నారు శాస్త్రజ్ఞులు.  అరటిపండు కంటే ఎక్కువ ఫాస్పరస్ పై తొక్కలో ప్రత్యేకమైన పీచు ఉండటం వల్ల వీటిని ఎంత పరిమాణంలో […]

వయసు అడ్డుకొనే ఫాస్టింగ్

ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ వృద్ధాప్య ఛాయాల్ని అడ్డుకుంటుంది అంటున్నారు ఫ్రాన్స్ లోని ప్యారిస్ సిటీ యూనివర్సిటీ పరిశోధకులు రోజులో పగటిపూట మాత్రమే తిని ఆ తర్వాత ఏమి తినకుండా ఉండటమే ఈ పద్ధతి.ఇది బరువు తగ్గిస్తుంది. దీనివల్ల శరీర కణాలు తమని తాము ప్రక్షాళన చేసుకోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. డయాబెటిస్, గుండె జబ్బులు కాన్సర్ వంటివి కూడా ఈ ఆహార పద్ధతి అడ్డుకోగలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అన్ని రకాలా మంచిదని చెబుతున్నారు.

తొలి డిజిటల్ మోడల్ కైరా

2022 జనవరి 28వ తేదీనా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన కైరా అలియాస్ కైరోనీ కి రెండు లక్షల కంటే ఎక్కువ మందే ఫాలోవర్స్. రియల్ మీ, టైటాన్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కు మార్కెట్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా ఉన్న కైరా మనదేశంలోని తొలి డిజిటల్ అమ్మాయి రూపురేఖలు వస్త్రధారణలో మోడరన్ గా ఉండే కైరా ఇటు ట్రావెలర్ గా ఆటో మోడల్ గా దూసుకుపోతుంది. కుత్రిమ మెధ తో తయారైన కైరా ను 2021లో ఎఫ్ యు […]

పాత దుస్తులు అమ్మేయాలా ?

క్లోసెట్ పునర్వి యాప్ తో సెకండ్ హ్యాండ్ దుస్తులను అమ్ముతున్నారు సహజ మాధురి. 34 వేల మంది సభ్యులు ఉన్న ఈ వెబ్సైట్ లో పదివేలకు పైగా దుస్తుల అమ్మకాలు సాగాయి షి ఇండియా మ్యాగజైన్ నుంచి సస్టైనబుల్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ తీసుకుంది మాధురి. ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని మన దగ్గర ఉన్న పాత దుస్తులు అప్లోడ్ చేసి వివరాలు పెడితే అక్కడ బృందం వాటి ధర నిర్ణయించి […]

కొండంత అండ

వంటింటి ఉపకరణాలైన మిక్సీలు, గ్రైండర్లు వంటివి తయారు చేసే హావెల్స్ ఇండియా కు డ్రైవింగ్ ఫోర్స్ వినోద్ రాయ్ గుప్తా. 35 వేల కోట్ల ఆస్తి తో దేశంలో నాలుగో సంపన్న మహిళగా స్థానం దక్కించుకున్నారు. ఆమెది ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ కేబుళ్లు స్విచ్ ల తయారీతో మొదలుపెట్టిన ఈ హావెల్స్ సంస్థను వృద్ధి చేసి, గృహోపకరణాలు తయారీ మొదలుపెట్టి 14 ఫ్యాక్టరీలు స్థాపించి 50 దేశాల్లో సంస్థ విస్తరణ చేశారు వినోద్ రాయ్ గుప్తా.ఆమె భర్త […]