ఈ ప్రేమ పేరు సాహసం
హిందూ రెబకా వర్గీస్ న్యాయ కదా అమరన్ పేరుతో సినిమా గా తీశారు ముకుంద వరదరాజన్ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. ఇందు క్రైస్తవ అమ్మాయి ముకుంద్ ఆర్మీలో పని చేశారు. రాష్ట్రీయ రైఫిల్స్ కు ఎంపికయ్యారు. ఐదేళ్లపాటు ప్రేమించుకొని పెళ్లాడారు ఇందు ముకుంద లు. 2014లో ఒక మిలటరీ ఆపరేషన్ టీం లో జరిగిన హోరాహోరీ పోరులో ఆయన గాయపడి మరణించారు ప్రభుత్వం ఆయనకు అశోక చక్ర ప్రకటించింది వీరి ప్రేమ గాధ సినిమా […]
ఇది నా ప్రపంచం
ఏ ఆర్ రెహమాన్ కూతురు అంటేనే ప్రత్యేక గుర్తింపు అయితే ఖతీజా రెహమాన్ ఈ గుర్తింపుకు దూరంగా గాయని గానే కాకుండా ఆల్బమ్ లు సినిమాలు సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ముందు గా చేసింది ‘కుహూ కుహూ’ ఆల్బమ్ తర్వాత పరిస్తా ఆల్బమ్ కూడా ఖతీజా కు పేరు తెచ్చిందే మిన్ మినీ సినిమాతో తొలిసారి సంగీత దర్శకత్వం చేపట్టింది ఖతీజా. ట్రయల్, బ్లేజర్, ఎంపవర్ ఉమెన్ వంటి పురస్కారాలు అందుకున్నది. ఆమె భర్త […]
ఆరు కోట్ల ఫాలోవర్స్
Calvin Klein వాచీలను ప్రమోట్ చేస్తోంది దిశా పటాని. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకున్న ఫాలోయింగ్ అక్షరాల ఆరు కోట్ల 15 లక్షలు. ఆమె ప్రతి పోస్ట్ కు వ్యూస్ లైక్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్‌బరేలి లో పుట్టిన దిశా పటాని ఆరంభం లో మోడలింగ్ చేసింది. సినిమా ప్రయత్నాల్లో భాగంగా అందాల పోటీల్లో పాల్గొన్నారు. మ్యూజిక్ వీడియోలు చేసింది. బాగి సినిమా తర్వాత ఆమెకు చేతినిండా ప్రాజెక్ట్ లు వచ్చాయి. […]
యువరాణి రాసిన ఉత్తరం
వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ నాకో ఉత్తరం రాశారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న వారిలో మీరు ఒకరిని నాకు తెలిసింది. ఇండియా,నేపాల్ దేశాలలో క్యాన్సర్ కేర్ కోసం పనిచేస్తున్నారు. ఇది ఇతరులకు ఎంతో స్ఫూర్తి అని ఉత్తరం లో రాశారని సంతోషంగా చెబుతోంది మనీషా కొయిరాలా. 2012లో మనీషా ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడి ఐదేళ్ల వైద్యం తర్వాత కోలుకున్నది. యువరాణి కేట్ మిడిల్టన్ కూడా క్యాన్సర్ నుంచి బయటపడ్డ వారే యువరాణి రాసిన ఉత్తరం నాలో […]
రీల్స్ నుంచి సినిమాకు
చిన్నతనం నుంచి మోడల్ కావాలన్న కోరిక తో ఇన్‌స్టా లో రీల్స్ ప్రారంభించిన సాక్షి వైద్య ఏజెంట్ సినిమాతో హీరోయిన్ అయిపోయింది. మహారాష్ట్రలోని థానే కు చెందిన సాక్షి ఫిజియోథెరపీ లో పీజీ చేసింది. కరోనా సమయం లో చేసిన రీల్స్ తో ఇన్‌స్టా లో 9 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు మోడలింగ్, టీవీ యాడ్స్, మ్యూజిక్ వీడియోలు ఒకదాని వెంట ఒకటి ఎన్నో అవకాశాలు వచ్చాయి.రీల్స్ నుంచి సినిమా రంగ ప్రవేశం చేసింది సాక్షి.
ఆమె గొంతు ప్రత్యేకం
రాగయుక్తంగా పాడితే గొంతు మగరాయుడిగా ఉందన్నారు దాన్నే ప్రశంసగా తీసుకొని గొంతును ప్రత్యేకంగా మలుచుకున్నారు అంటుంది సునిధి చౌహాన్ ఆమె పాడిన ధూమ్ మచాలే ధూమ్ దుమ్ములేపే బీట్ రెండు ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్న సునీత ఇప్పటివరకు 14 సినిమా పాటలు పాడింది అందులో తెలుగు పాటలు ఉన్నాయి హిందీ తమిళం కన్నడ మలయాళం అస్సామీ బెంగాలీ భోజ్ పూరి తదితర భాషల్లో కూడా పాడింది సునీత ఆమె తొలి ఆల్బమ్ సోలో ఆల్బమ్ ఆయుధ […]
కాఫీ బెస్ట్ డ్రింక్
కమ్మని కాఫీ అందుబాటులో ఉండే ఎనర్జీ డ్రింక్ ఇందులో ఇందులోని కెఫిన్ తో నాడీ వ్యవస్థ ప్రభావితమై మెదడు పనితీరు వేగవంతం అవుతుంది. కాఫీ లో ఉండే ఖనిజ లవణాలు క్యాలరీలు కార్బోహైడ్రేట్లు యాంటీ ఆక్సిడెంట్ల వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రోజుకు రెండు కప్పుల కాఫీ తో డోపమైన్ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. కాలేయపు ఇన్ఫెక్షన్లు రావు. బ్లాక్ కాఫీ తో బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యాయామం తరువాత వచ్చే అలసట తగ్గుతుంది.
డీఎస్పీ గా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్
ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ తెలంగాణ పోలీస్ లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్) గా చేరారు. రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయ్యారు నిఖత్. బ్యాంకాక్ లో జరిగిన 2019 థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో జరీన్ రజిత పతకం పొందింది.2015 లో అస్సాం లో జరిగిన 16 వ సీనియర్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఆమె స్వర్ణం సాధించారు. 2022లో ఇస్తాంబుల్ లో ప్రపంచ బాక్సింగ్ […]
కొత్తగా చెబుతున్నారు
లక్నో లోని మహిళ బైకర్లు సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు గాను ఆల్ విమెన్ బైక్ ద్వారా నిర్వహించారు సాంప్రదాయ వస్త్రధారణలో సాగిన ఈ ర్యాలీ లో సశస్త్ర సీమా బల్ అనే కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లోని స్త్రీలు కూడా యూనిఫామ్ ధరించి పాల్గొన్నారు వీరంతా వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ గురించి మహిళలకు అవగాహన కల్పించారు ఈ ర్యాలీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అంతులేని ఆత్మవిశ్వాసం
అరుదైన వ్యాధి చక్రాల కుర్చీకే పరిమితం చేసిన అంతులేని ఆత్మవిశ్వాసం తో రచయిత్రిగా మంచి టీచర్ గా ఎదిగారు రష్మీరేఖ భుయాన్ గుహవాటి విశ్వవిద్యాలయం నుంచి పీజీ చేశారు స్పైనల్ మస్క్యులర్ అట్రోపి అనే వ్యాధితో వీల్ చైర్ లోనే జీవిస్తున్నారు. ఆమె జీవితాన్ని మాత్రం చక్కగా తీర్చిదిద్దుకున్నారు ఒక తల్లిగా చక్కని టీచర్ గా మంచి రచయిత్రిగా ఆమె ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఆమె రాసిన మూడు నవలలు ప్రశంసలు అవార్డులు పొందాయి.
సృజనాత్మకతే కీలకం
మాస్టర్ చెఫ్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచారు పంకజ్ భదౌరియా స్కూల్ టీచర్ గా పనిచేసే పంకజ్ కు వంటలపైన ఆసక్తితో ఈ పోటీల్లో పాల్గొన్నారు.ఎన్నో పుస్తకాలు రాశారు మాస్టర్ చెఫ్ ఇండియా కుక్ బుక్, చికెన్ ఫ్రొం మై కిచెన్ వంటి పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కేఫ్ బై డిఫాల్ట్ పేరుతో ఆమె లక్నో లో ప్రారంభించిన రెస్టారెంట్ కు ఎంతో మంచి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా అనే ఫుడ్ వర్క్ షాపులో సెమినార్ల లో […]
అతుకు ముక్కలు కూడా సాంప్రదాయమే
నటి ఆలియా భట్ 180 ఫ్యాబ్రిక్ ప్యాచ్ లతో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన తన పెళ్లి డ్రెస్ ను మళ్లీ దీపావళి వేడుక కోసం ధరించి కొన్ని ఫ్యాషన్ లు మారిపోవని చెబుతోంది.ఈ డ్రెస్ కోసం 180 క్లాత్ ప్యాచ్ లను కలిపి కుట్టరు. జాకెట్ కోసం అచ్చమైన బంగారం, వెండి,నక్షి, కోరా పువ్వులు పాతకాలపు గోల్డ్ మెటల్ సీక్వెన్స్ లతో అలంకరించారు. ఈ ప్యాచ్ వర్క్ చాలా ప్రాచీన సాంప్రదాయానికి చెందింది. ప్రాచీన ఈజిప్ట్ […]
జల రవాణా లో అమ్మాయిలు
కొచ్చి లో ప్రారంభించిన మెట్రో ఫెర్రీలను నడిపేందుకు ముగ్గురు మహిళ పైలెట్స్ ఎంపిక అయ్యారు జల రవాణా లో ఇది మహిళా శాకం అంటున్నారు అరుణిమ,లక్ష్మి,స్నేహ ముగ్గురు కెప్టెన్ లు జి పి ఆర్ కన్వర్షన్ కోర్స్ పూర్తి చేసిన వారికి ఈ ఉద్యోగం దొరుకుతుంది కొల్లం కు చెందిన ఈ ముగ్గురు . పైలెట్స్ వివిధ ఇంజనీరింగ్ డిప్లొమా చేశాక వారికి ట్రైనీ లుగా ఉద్యోగం వచ్చింది. మెట్రో ఫెర్రీలలో పురుష పైలెట్ లే ఉన్నారు […]
బంగారు వర్ణాల లైక్రా
స్వర్ణ కాంతులతో మెరిసిపోయే గోల్డ్ లైక్రా శారీస్ ముందు పట్టు చీరలు కూడా వెలితిగా పోతాయి ఎలాస్టిక్ లా సాగుతూ వొంటికి హత్తుకుపోయే లైకా చీరలు ప్లెయిన్ గా నెట్టెడ్ మెటీరియల్ తో కలిపి,సెక్విన్ వర్క్ తో బ్లౌజ్ మ్యాచ్ చేసి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాయి. ఎరుపు బంగారు వర్ణాల కలబోతతో ఉండే ఈ చీరలకు జ్యువెలరీ, ఇతరత్రా యాక్సెసరీస్ జోడిస్తే ఆ అందమే వేరు రాళ్లు పొదిగిన నగలు టెంపుల్ జ్యువెలరీ ఈ శారీస్ […]
ఫోర్బ్స్ డిజిటల్ స్టార్
మాస్టర్ చెఫ్ మామ్ గా లక్షల మంది పరిచయం ఉన్న ఫుడ్ బ్లాగర్ చెఫ్ రచయిత ఉమా రఘురామన్ ప్రముఖ హ్యూగ్ జైన్ ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అత్తగారి స్ఫూర్తితో ఉత్తరాది వంటలు నేర్చుకొని ఇప్పటికీ 1000 రకాల వంటల వీడియోలు చేశారు ఫ్లిప్ కార్ట్ యూనీలీవర్ మదర్ డైరీ పి టి సి వంటి ప్రముఖ బ్రాండ్ల తో కలిసి పనిచేశారామే. ఆమె పెట్టిన ఒక్క పోస్ట్ […]
ఆర్కిడ్స్ తో చక్కని వ్యాపారం
పూల మొక్కల పెంపకంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యాన్ వన్ శ్రేష్ట పురస్కారాన్ని అందుకున్నది సబిరా మహమ్మద్ కేరళ లోని పాలకాడ లో 1998లో తన టెర్రస్ పైన మల్లి జాజి పూల వంటి పూల మొక్కల పెంపకంతో ప్రయాణం మొదలుపెట్టి 1300 రకాల ఆర్కిడ్స్ ను పెంచింది సబిరా పాలక్కాడ్ లో ఆమె ప్రారంభించిన నర్సరీ లో థాయిలాండ్ చైనా తైవాన్ నుంచి తెప్పించిన మొక్కలు కూడా లభిస్తాయి టిష్యూ కల్చర్ ద్వారా ఆర్కిడ్స్ […]
జుట్టు రాలిపోతోందా ?
కొబ్బరి పాలలో క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్లు,ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. నల్లటి పొడవాటి జుట్టు కావాలని కోరుకునే అమ్మాయిలు ఈ కొబ్బరిపాల వైద్యాన్ని నమ్మవచ్చు. తాజా కొబ్బరి పాలు తలకు పట్టించి అరగంట ఆరనిచ్చి తర్వాత తల స్నానం చేయాలి ఇలా వారానికి రెండు సార్లు చేసినా చాలు జుట్టు రాలడం తగ్గి ఊడిన వెంట్రుకలు కుదుళ్ళ నుంచి మళ్లీ వేగంగా పెరుగుతాయి. వెంట్రుకలకు కావలసిన తేమ పోషణ అందుతుంది.
అంతులేని ఆత్మవిశ్వాసం
చూపు లేకపోయినా భూమిక సుదర్శన్ చక్కగా రుచిగా వంట చేయగలరు భూమిక సుదర్శన్. ఈమె యూట్యూబ్ ఛానల్ భూమిక కిచెన్ కు 80 వేల మంది సబ్స్క్రైబర్లున్నారు. 1300 పైగా వంటలు పోస్ట్ చేశారు భూమిక. బ్యాచిలర్స్ సులభంగా వండుకో గలిగే వంటలే పోస్ట్ చేస్తారు భూమిక సుదర్శన్. 35 ఏళ్ల వయసులో అరుదైన చూపు పోయినా భూమిక డిప్రెషన్ లోకి కూరుకుపోకుండా ఈ వంటల వీడియోలు చేయటం మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు. భూమిక కిచెన్ […]
అందం ఇచ్చే యాలకులు
తియ్యని పదార్దాలకు సువాసన ఇచ్చే యాలకులు అందాన్ని అద్భుతంగా పెంచుతాయంటున్నారు ఎక్సపర్ట్స్.స్పూన్ చొప్పున యాలకుల పొడి,పంచదార,తేనె కలిపి ముఖానికి మృదువుగా రుద్ది పది నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు ముఖం మెరుస్తుంది. యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ తో పోరాడి వృద్ధాప్య ఛాయలు రానివ్వవు.దీన్ని మాస్క్ ల వేసుకోవాలంటే స్పూన్ యాలకుల పొడి, పసుపు,నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు.పావుగంట తర్వాత కడిగేస్తే చాలు కాంతివంతమైన ముఖం కనిపిస్తుంది.
దిండు మార్చేయాలి
ఒకసారి దిండు కొంటే దాన్ని జీవితకాలం వాడాలి అనుకోవద్దు అంటున్నారు ఎక్సపర్ట్స్.వాటి కవర్లు మార్చకపోయిన ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోయినా ,దీర్ఘకాలం వాడుతున్న అనారోగ్యాలు తప్పవు అంటున్నారు.సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం తలగడ పై పేరుకొని దుమ్ము బాక్టీరియాని వృద్ధి చేస్తాయి. చిన్న పిల్లలు, వృద్ధులు ఆస్తమా బారిన పడే ప్రమాదం ఉంటుంది.అంచేత రెండు మూడేళ్ల కోసారి దిండ్లు మార్చేయ మంటున్నారు.
