Saturday, 03 Oct, 2026

అసలైన మానవత్వ లక్షణం

మన చుట్టూ ఉన్న వారితో సత్సంబంధాల జీవితకాలం కొనసాగాలంటే సానుభూతి ఉండాలి.సానుభూతి అంటే ఇతరులను అర్థం చేసుకోవటం ఇతరుల అవసరాలు సకాలంలో గుర్తించగలిగే సామర్థ్యం కొంతయినా వారికి సహాయపడగలగటం వారి అవసరాలను కష్టాల్లో పాలు పంచుకోగలిగే మన స్థితి ఉండటం. మనకు ఎలాంటి అవసరాలు ఉంటాయో ఇతరులకు అవే ఉంటాయి బాలీవుడ్ విలన్ సోమసూద్ ఒక కష్టకాలంలో తన గొప్ప లక్షణాన్ని ఇతరుల పట్ల తన మనసులో ఉండే సానుభూతిని ప్రదర్శించి హీరో అయ్యాడు. లాక్ డౌన్ […]

పిల్లలకు తెల్ల వెంట్రుకలా ?

కొంతమంది పిల్లలకు జన్యుపరమైన లోపం వల్లనో లేదా పోషకాహార లోపం వల్ల తెల్ల వెంట్రుకలు వస్తాయి. ఆహారంలో ఎ ఎక్కువగా ఉండే పచ్చని కూరగాయలు,పసుపు రంగు పండ్లు పిల్లలు తినేలా చూడాలి. పెరుగు, ఆకుకూరలు, టమోటో, కాలిఫ్లవర్, అరటి పండు తినిపించాలి.ఇనుము, జింక్, కాపర్ వంటి ఖనిజాలు చికెన్, మటన్, పొద్దుతిరుగుడు విత్తనాలు, సముద్రపు ఆహారంలో ఇవన్నీ ఉంటాయి కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు వేసి మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తలకు రాయాలి. ఉసిరి, మెంతి […]

సోనాల్ శర్మ

రాజస్థాన్ సెషన్ కోర్ట్ లో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా నియమితులయ్యారు సోనాలి శర్మ. పాల వ్యాపారి ఖ్యాలి లాల్ కూతురు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఉన్న ప్రతాప్ నగర్ ఆమె సొంత ఊరు తండ్రికి సాయం చేస్తూ మిగిలిన సమయంలోనే సోనాల్ చక్కగా చదువుకోని బిఎ ఎల్ ఎల్ బి లో బంగారు పతకం సాధించింది. జడ్జి పదవి కోసం జ్యూడిషియల్ ఎగ్జామ్స్ రాసి ఎంపికయింది.జోధ్ పూర్ జ్యుడీషియల్ అకాడమీ ఏడాదిపాటు శిక్షణ పొందాక […]

The White Tiger ఇంగ్లీష్ (2021)

అరవింద్ అడిగా రాసిన నవల ఆధారంగా తీశారు ది వైట్ టైగర్. ప్రియాంక చోప్రా రాజకుమార్ రావ్ ఆదర్శ గౌరవ్ లు నటించారు వ్యాపారవేత్త బలరామ్ హల్ వాయి ఒక ఇ-మెయిల్ లో తనను తాను పరిచయం చేసుకుంటూ చెప్పిన కదా లక్ష్మణ్ ఘర్ లో ఉండే బలరామ్ అన్న చిన్నపిల్లాడిని,స్కూలు అధికారి ఎప్పుడో అరుదుగా జన్మించి వైట్ టైగర్ వంటి వాడివి అని అభినందిస్తూ స్కాలర్ షిప్ మంజూరు చేస్తారు. బొగ్గు వ్యాపారికి అప్పు పడి […]

పొట్ట తగ్గిపోతుంది

శారీరక శ్రమ తక్కువగా ఉండటం ఆఫీసుల్లో ప్రయాణాల్లో గంటలకొద్ది కూర్చొని ఉండటం ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు తీసుకోవటం వల్ల మహిళల్లో పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ పెరుగుతుంది. పొట్ట తగ్గాలంటే ముందుగా ఎనిమిది గంటలు హాయిగా నిద్ర పోవాలి. అరగంటయినా శారీరక శ్రమ చేయాలి వారానికి మూడు సార్లు ఏరోబిక్ ఎక్సర్ సైజులు మిగతా మూడు రోజులు బరువులు ఎత్తే శక్తి నిచ్చే వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి. చక్కెర బెల్లం స్వీట్స్ కేక్స్ పిండి పదార్థాలు ఎక్కువగా […]

అన్‌స్టాపబుల్‌ ప్లేయర్

ఈ సంవత్సరం వరల్డ్ రగ్బీ ఆసియా అన్‌స్టాపబుల్‌ ప్రకటించిన 32 మహిళా క్రీడాకారులలో సంధ్య రాయ్ పేరుంది. ఉత్తర బెంగాల్‌లోని సిలిగురికి తూర్పు వైపున.. బైకాంత్‌పూర్‌ అటవీ ప్రాంతంలో ఉంటుంది సరస్వతీపూర్‌ గ్రామం.సంధ్య రాయ్ పుట్టిన వూరిది. జంగిల్‌ క్రోస్‌’ అనే ఔత్సాహిక రగ్బీ టీమ్‌ లీడర్‌ అటవీ ప్రాంతాల్లోని పిల్లలు ఆ ఆటకు పట్టునిస్తారనే ఆశతో ఇక్కడి పిల్లలకు శిక్షణ ఇచ్చారు. సంధ్య రాయ్ తో పాటు తొమ్మిది మంది బాలికలు శిక్షణ తీసుకున్నారు.ఈ ఏడేళ్లుగా […]

సెయిల్ తోలి మహిళా ఛైర్ పర్సన్

సోమా మండల్ భారత ప్రభుత్వ సంస్థ సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. సెయిల్ చరిత్రలోనే తోలి మహిళా ఛైర్మన్ సోమ. 57 సంవత్సరాల వ్యాపార వ్యూహాల నిపుణురాలేకాదు,సోషల్ వర్కర్ కూడా. 2017 నుంచి సెయిల్ లో ఉన్నారు సోమ. రూర్కెలా నిట్ లో బీటెక్ చేశాక 1984 లో నాల్కో లోనే మెనేజ్ మెంట్ ట్రెయినీ గా చేరారు. ఆమెది భువనేశ్వర్.

వెయ్యి మందికి ఉపాధి 

20 లక్షల అప్పు తో వి. స్టార్ అనే వస్త్రాల తయారీ వ్యాపారం మొదలు పెట్టింది షీలా కోచౌసెఫ్.ఆమె భర్త వి.గార్డ్ స్టెబిలైజర్స్ సంస్థ యజమాని షీలా స్థాపించిన అండర్ గార్మెంట్ సంస్థ 25 ఏళ్లలో వంద కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థగా మారింది. కొచ్చిన్ నగర కేంద్రంగా షీలా వి స్టార్ క్రియేషన్ సంస్థ నడుస్తుంది.మహిళల బ్రాసరీ ల తయారీలో వి. స్టార్ గుర్తింపు పొందింది. సంస్థ వెయ్యి మందికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఉపాధి […]

Hope Aur Hum (హిందీ) (2018)

నగేష్ అనే వృద్ధుడు తన జీవనోపాధిగా వాడుకున్న జర్మన్ తయారీ యాంటిక్  కాపి  మిషన్ అంటే చాలా ఇష్టం పెంచుకుంటాడు. అది సరిగా పని చేయకపోయినా కొత్త లెన్స్ వేస్తే పూర్వం లాగా అవుతుందని ఆశ పడుతూ ఉంటాడు.ఆ భారీ మిషన్ తో ఇల్లు ఇరుకైపోయిందని దాన్ని అమ్మేద్దామని చూస్తుంటారు. కోడలు కొడుకు మనవరాలు కొడుకు నీరజ్ కు ప్రమోషన్ రాలేదని ఆరాట పడుతూ ఉంటాడు. చిన్న కొడుకు నితిన్ దుబాయ్ లో ఉంటాడు.తండ్రిని చూసేందుకు వచ్చి […]

ఒకటి కొంటే రెండు 

వేసుకుంటే ఓ రంగు దాన్ని తిరగేస్తే ఇంకొక రంగు వస్తాయి ఈ డ్రెస్ లు.ఈ ఫ్యాషన్ పేరే రివర్సబుల్. ఈ డ్రెస్ లు ఒకే డిజైన్ లో  రెండు రంగుల్లో ఉంటాయి. కుర్తా, అనార్కలీ,స్కర్ట్ వంటివి తీసుకుంటే ఓ వైపు సాదాగా  రెండో వైపు డిజైన్ తోను ఉంటాయి. వీటిల్లో లెగ్గింగ్స్ ను కూడా చేర్చవచ్చు.ఒకవైపు సాదా ఓవైపు డిజైన్ తో ఉన్న లెగ్గింగ్స్ వేరే వేరే మ్యాచింగ్ తో వేసుకోవచ్చు.కుట్లు కనిపించవు. ఏ వైపు కు […]

లేత రంగులే చాలు 

బొద్దుగా ఉన్నవాళ్లు ముదురు రంగు వేసుకుంటే సన్నగా ఫిట్ గా కనిపిస్తారు తెలుపు, గులాబీ, క్రీమ్ వంటి లేత రంగులు, షేడ్స్ జోలికి పోకుండా నీలం, నలుపు, ఆకుపచ్చ వంటి ముదురు రంగు ధరించాలి.సరైన షెడ్ లో ఉండే షూస్ వేసుకుంటే పొట్ట సంగతి ఎవరు పట్టించుకోవడం దృష్టి షూస్  మీదే పెడతారు కనుక.ఫ్లోరల్ ప్రింట్స్ షేడ్స్   ఉన్న దుస్తులు ధరిస్తే చూసేందుకు అందంగా ఉంటారు. బ్లేజర్ వెయి వెయిస్ట్ కోస్ట్ వేసుకుంటే ట్రెండీగా కూల్ గా […]

గీతా మంజునాథ్

గీతా మంజునాథ్ స్థాపించిన నిరామయి. ప్రపంచంలో వంద స్టార్ట్ ప్ కంపెనీలుగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన వాటిలో ఒకటి. ముఖ్యంగా భారత్ నుంచి ఎంపిక అయింది. నిరామయి హెల్త్ ఎనలైటిక్స్ ద్వారా మహిళల్లో వస్తున్న బ్రెస్ట్ కాన్సర్స్ ను ప్రాధమిక దశలోనే కనిపెట్టే పద్దతి ఇది. 10 నగరాల్లో నిరామయి పని చేస్తుంది. ఆస్పత్రికి భిన్నమైన వాతావరణంలో ఉంటుంది కనుక మహిళలు ఎటువంటి భయం దోళనలు లేకుండా వచ్చి పరీక్ష చేయించుకోగలుగుతారు.

ఒక ప్రత్యేకత కావాలి

గ్లామర్ పాత్రలు ఎప్పుడైనా ఏ భాషలో అయినా చేయచ్చు విబిన్నమైన పాత్రల తోనే గుర్తింపు వస్తుందని నా గాఢమైన అభిప్రాయం. ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమాల్లో ఎదో ప్రత్యేకత ఉన్న పాత్రల్లోనే నాకు పేరు వచ్చింది. హిందీలో ‘ఏక్ లాడకీకో దేఖతో ఐసాలగా’ లో లెస్టియాన్ పాత్ర నాకు చాలా నచ్చింది. భారతీయ చిత్రాల్లో ఇలాటి సినిమా రావటం బహుశా ఇదే మొదటి సారెమో అంటోంది రెజీనా కాసాండ్రా. ఇలా విభిన్నతకు ప్రాధాన్యత ఇవ్వటం […]

మనుష్యుల మధ్య హద్దులు

ఎవరి హద్దులో వారు ఉండటం మంచిది అన్నమాట వింటూ ఉంటాం. మనుష్యుల మధ్య హద్దులేమిటి అంటే మనిషి అంగీకరించిన అంగీకరించక పోయినా ప్రతి మనిషి చుట్టూ ఒక సరిహద్దు రేఖ ఉంటుంది. అంటే వ్యక్తిగత సమయం వ్యక్తిగత ఆలోచనలు,ఆశలు,భద్రమైన సౌకర్యవంతమైన జీవిత కాంక్ష వీటిలోకి ఇతరులు తొంగి చూడాలని అనుకోకపోవటమే ఒక హద్దు అనుకోవచ్చు. కనిపించని ఈ కంచె చాలా దృఢమైనది పసితనం నుంచే నాదీ నేను నా ఇష్టం,నా అభిప్రాయం అన్నవి ప్రకటించటం అలవాటై పోతూ […]

వనితా గుప్తా

సెనేటి కు నామినేట్ అయిన మొట్టమొదటి అమెరికన్ అసోసియేషన్ అటార్నీ జనరల్ వనిse గుప్తా. లీగల్ డిఫెన్స్ ఫండ్ లో ఉద్యోగినిగా కెరీర్ మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ ఒబామా బైడెన్ ప్రభుత్వంలో జస్టీస్ డిపార్ట్ మెంట్ మానవ హక్కుల డివిజన్ లో అడుగు పెట్టారు. అమెరికా లో అత్యంత గౌరవ ప్రదమైన మానవ హక్కుల న్యాయవాది భారతీయ వలస తల్లి దండ్రులు గర్వించదగిన కుమార్తె అని జో బైడెన్ ఆమెను కొనియాడాడు.

వెంటనే నీళ్లు తాగద్దు

కీర తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్ .కీరలో 95 శాతం నీళ్లే. అలాగే ఎన్నో ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి.దీన్ని తిన్న వెంటనే నీళ్లు తాగితే శరీరంలో పి.హెచ్ ప్రమాణాలు దెబ్బతింటాయి.సహజంగా జరిగే జీర్ణక్రియ కూడా దెబ్బతింటుందని పైగా కీర లోని ప్రయోజనాలను పోషకాలు శరీరం గ్రహించలేక పోతుంది.

తీసి పారేయకండి

అన్ని వంటల్లోనూ వాడే కరివేపాకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిద్ర లేవగానే బ్రేక్ ఫాస్ట్ కు ముందే కరివేపాకు ఆకుల్ని కొన్ని నోట్లో వేసుకుని నమిలితే జుట్టు రాలడం తగ్గుతుంది. పరిగడుపున కొన్ని ఆకులు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.తలనొప్పి, తల తిరగడం సమస్యలు పోతాయి .శరీరంలో మలినాలు పోయి బరువు తగ్గుతారు.కంటిచూపు ఆరోగ్యంగా ఉంటుంది. మార్నింగ్ సిక్ నెస్ కు కరివేపాకు మంచి వైద్యం చర్మానికి అందాన్ని ఇస్తుంది. శరీరంలో ఐరన్ లోపం తలెత్త నివ్వదు.రక్తహీనత తగ్గించటం […]

పోనంగ్‌ డోమింగ్‌

భారత సైన్యంలో లెఫ్టెనెంట్‌ కల్నల్‌ హోదా పొందిన పోనంగ్‌ డోమింగ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌కి చెందిన పోనంగ్ డోమింగ్‌. ఈ రాష్ట్రం లో ఈ హోదా పొందిన తోలి మహిళ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేమా ఖాండు పోనంగ్‌ చరిత్ర సృష్టించింది. ఇది మనందరం గర్వించదగ్గ క్షణాలు’ అంటూ ట్వీట్‌ చేశారు. మహారాష్ట్రలోని వాల్‌చాంద్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజ నీరింగ్‌లో సివిల్‌ ఇంజ నీరింగ్‌ని పూర్తిచేశారు పోనంగ్‌ డోమింగ్‌. 2008లో భారత సైన్యంలోకి పోనంగ్‌ ప్రవేశించారు. 13 సంవత్సరాల […]

పూజ కోసం వెండి పూలు

దేవుడి పూజ కోసం అందమైన సహజమైన వెండి పూలు వస్తున్నాయి. గులాబీ,సంపెంగ పారిజాతం జాజి లాంటి బోలెడు పూల రకాల ఎనామిల్ పెయింట్ అందాలతో అచ్చం పూవుల్లాంటి పూజ చేసుకొనేందుకు ఉపయోగపడేలా వచ్చాయి. గులాబీ తామర వంటివి రెండు మూడు రంగులు రంగు రాళ్లు చేర్చి తయారు చేయటం తో మరింత అందంగా ఉంటున్నాయి నిండుగా కనబడేందుకు రెండు మూడు పూల గుత్తులు ల్లాగా కలిపి చేస్తున్నారు. వీటితో అందమైన పూల దండలూ వచ్చాయి. అచ్చం అందమైన […]

పి. గాయత్రీ హేల

శ్రీ శక్తి ఛాలెంజ్ విజేత డాక్టర్ పి. గాయత్రీ హేల. రెసెదా లైఫ్ సైన్సెస్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్. పర్యవేక్షణ హితమైన సూక్ష్మ క్రిమి సంహారిణులను తయారు చేస్తుందీ సంస్థ. హేల కు 2003 లో సార్స్ వైరస్ విజృంభించిన సమయంలో ఆమె సంస్థ హానికారం గాని గృహ్ వ్యవసాయి అవసరాల కోసం క్రిములు బాక్టీరియా మట్టు పెట్టే రసాయన రహిత సంహారాలకు తక్కువ ధరకే మార్కెట్ చేశారు.