జీవిత గమ్యమే గెలుపు
వెన్నం జ్యోతి సురేఖ బాపట్ల జిల్లాలోని నడింపల్లి లో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టింది. నాలుగేళ్ల వయసు నుంచి ఆమె ఆటలపై శ్రద్ధ చూపించింది మొదట్లో స్విమ్మింగ్ ఎంచుకుంది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ కిలోమీటర్స్ పేరుతో ఐదు కిలోమీటర్లు ఈది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది.అలాగే జాతీయస్థాయిలో అసమాన ప్రతిభా అవార్డును కూడా అందుకున్నది. 2007లో ఆర్చరీ వైపు వచ్చింది. నాలుగేళ్ల కష్టంతో సీనియర్ జట్టులో స్థానం సంపాదించింది.15 ఏళ్ల క్రీడా ప్రయాణంలో 94 పైగా అంతర్జాతీయ పతకాలు సాధించింది. ఇంజనీరింగ్ ఆ తర్వాత ఎంబీఏ కూడా పూర్తి చేసింది.2017 లో అర్జున అవార్డు అందుకుంది .ప్రపంచ కప్ లో రికార్డు స్థాయి ప్రదర్శనలు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు అన్నీ సాధించింది.. గత సంవత్సరం ఆర్చరీ ప్రపంచ కప్ లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్ లో తొలి పతకాన్ని సాధించింది. క్రీడల పట్ల ఆసక్తితో స్కూలు కాలేజీ జీవితానికి దూరమైనా దేశం తరఫున ఆడటం గెలవటం గర్వంగా ఉంది అంటుంది జ్యోతి.
