వ్యాపారంలో పరుగుల రాణి
భారతీయ మహిళా అథ్లెట్లు కేవలం క్రీడాకారిణులు గానే కాదు వ్యాపార రంగంలోనూ ఎంతో పేరు తెచ్చుకుంటున్నారు.భారతదేశానికి చెందిన అగ్రశ్రేణి మహిళా స్ప్రింటర్ హరిత భద్ర.2026 జపాన్ లోని నగోయా లో జరిగిన ఆసియా క్రీడల్లో వార్తల్లో నిలిచారు. మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో లక్ష్యాన్ని చేరుకొని కాంస్య పతకం సాధించారు.భారతదేశంలో అత్యంత వేగవంతమైన మహిళగా ఆమె రికార్డు సృష్టించారు .హరిత పరుగుల్లోనే కాదు వ్యాపారంలో కూడా క్రియేటివ్ గా గుర్తింపు తెచ్చుకున్నది.ఆభరణాల తయారీపై ఉన్న ఇష్టంతో దాగీనా పేరుతో సొంత ఆన్లైన్ ఆభరణాల వ్యాపారాన్ని కూడా ప్రారంభించింది. క్రీడల్లో తీసుకునే క్రమశిక్షణ నుంచి ఒక రిలాక్సేషన్ కావాలంటే ఉత్సాహం పొందాలంటే ఈ ఆభరణాల తయారీ తనకు ఒక అవకాశాన్ని కల్పించింది అంటుంది హరిత. మనసును మరో పని వైపు మళ్లించుకోవడానికి ఇలా సృజనాత్మకమైన ఆభరణాల తయారీ లో లీనం అయిపోతాను అంటుంది హరిత భద్ర .ఈ ఆన్లైన్ ఆభరణాలవ్యాపారం చాలా విజయవంతంగా నడుస్తోంది.
