మేమిద్దరం మంచి స్నేహితులం
సినిమా స్టార్ కపుల్ జ్యోతిక సూర్యలు తమ పెళ్లి జరిగి 20 ఏళ్ళు పూర్తయినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకొని వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు.ఈ వేడుక లో సూర్య,జ్యోతిక పిల్లలు దియ,దేవ్ కూడా పాల్గొన్నారు.ఈ పెళ్లి గురించి మాట్లాడుతూ జ్యోతిక ఇది పరిపూర్ణమైన వివాహానికి గుర్తు కాదు.అసంపూర్ణ తలకు సర్దుబాటులకు అవగాహనకు త్యాగాలకు నిస్వార్ధమైన ప్రేమకు నిదర్శనం. మేమిద్దరం జీవితాన్ని వేడుకగా జరుపుకుంటామని ప్రమాణం చేస్తున్నాము ఒకరినొకరు గౌరవించు కుంటామని జీవితాన్ని ఒక బహుమతిగా చూస్తున్నామని చెప్తున్నాను.ప్రతి ఉదయం నన్ను రక్షించే వ్యక్తి చేతుల్లో మేల్కొంటున్నందుకు, నా జీవితానికి అర్థాన్నిచ్చిన అందమైన పిల్లలకు, నేను బతకటానికి ఒక కారణాన్ని ఇచ్చిన ఈ జీవితం పట్ల కృతజ్ఞతతో ఉంటానని ఈ పెళ్లి సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను అన్నది. మేమిద్దరం కలిసి స్నేహాన్ని పదిలంగా కాపాడుకుంటామని ఇంకా రాబోయే 20 సంవత్సరాలకు కూడా సంపూర్ణమైన అవగాహనతో కలిసి జీవిస్తామని ఈ సందర్భంగా ప్రమాణం చేసుకుంటాము అని అంటున్నారు ఈ దంపతులు దాంపత్య జీవితం ఆనందంగా సాగాలంటే ఇలాంటి వేడుకలు అవసరమని వీళ్ళ పెళ్లి నిరూపిస్తుంది. పెళ్లంటే కష్ట సుఖాల్లో తోడు నీడగా కలిసి ఉండే ఇద్దరి స్నేహం పెళ్లి ఉద్దేశం ఇదే.
