నిజమైన లీడర్
బహుజన ఆదివాసి ముస్లిం వర్గాల యువతుల జీవితాల్లో తెచ్చిన విప్లవాత్మకమైన మార్పు గాను 2026 లో లీడర్ గౌరవాన్ని అందుకున్నారు దీప పవార్. మహారాష్ట్రకు చెందిన దీప విముక్త జాతుల విభాగంలోని ఘిసాడి అనే సంచార తెగలో జన్మించింది. చదువు పూర్తి చేశాక అనుభూతి ట్రస్ట్ పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా దళిత ,ఆదివాసీ, ముస్లిం, సంచార జాతులకు చెందిన యువతుల సాధికారతే ధ్యేయంగా పనిచేస్తుంది దీప. వారి ఆరోగ్య పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి ,బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం,వారికి రుతుక్రమ పరిశుభ్రత పై అవగాహన లోపించడం వల్ల వారి శారీరక మానసిక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని గుర్తించారు.ప్రభుత్వ యంత్రాంగం తో పోరాడి ఆయా వర్గాలకు సురక్షితమైన నీరు శానిటేషన్ సౌకర్యాలు అందేలా కృషి చేశారు .ఆమె చేసిన సేవకు గాను గతంలో ప్లాన్ ఇండియా ఇంపాక్ట్ అవార్డు ,లాస్ట్ మెయిల్ ఛాంపియన్ విభాగంలో జాతీయ అవార్డు అందుకున్నారు అంతేకాకుండా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వారి గోల్ కీపర్స్ యూత్ యాక్షన్ ఆక్సిలరేటర్ కింద ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 26 మంది యువ నాయకులలో భారతదేశం తరఫున ఆమె ఒకరు.పౌర హక్కుల పోరాటాలు ముందు నిలిచే దీప అంటే యువతులే భారత సమాజానికి స్ఫూర్తి.
