ఐదు నెలల్లో కోట్ల ఆదాయం
బుగత పావని ది అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాకపల్లి.అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకుంది ఇన్స్టా లో వ్యాపారులకు సంబంధించిన పోస్ట్ లు పెట్టేది.గల గల మాట్లాడుతూ కబుర్లు చెప్తుంటే వాళ్ళ వ్యాపారాలకి ఎంతో ప్రమోషన్ ఇచ్చేది.ఈ అనుభవంతో 2005లో పావని మాడుగుల హల్వా పేరుతో సొంతంగా తయారీ ప్రారంభించింది. తను చేసే హల్వా గురించి వీడియోలు పెట్టింది ఒక్కొక్క వీడియో కి 6000 కు పైగా ఆర్డర్లు వచ్చాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు వంటి నగరాల్లో మొత్తం 23 ఫ్రాంచైజ్ ఉన్నాయి. ఐదు నెలల్లోనే కోట్లలో ఆదాయం వచ్చింది .విదేశాల్లో కూడా ఈ మాడుగుల హల్వా కు చాలా డిమాండ్ ఉంది .ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటే ఈ మాడుగుల హల్వా ఇంటికి వచ్చేస్తుంది.
