సోలోగా ప్రపంచ పర్యటన
రూపాయి ఖర్చు లేకుండా దేశ వ్యాప్త పర్యటన ను కొనసాగిస్తున్నది సరస్వతి నారాయణ్ అయ్యర్. రెండే రెండు చీరలు ఒక టెంట్ సున్నా ఖర్చుతో సరస్వతి ఈ సాహస యాత్ర మొదలుపెట్టారు. సంప్రదాయమైన చీరకట్టుతోనే కొండలు ,మారుమూల గ్రామాలు పర్వత ప్రాంతాలు, అవలీలగా అధిగమిస్తున్నారు. భారత దేశ పర్యటన కోసం విమానాలు రైళ్లు కాకుండా నడకే ఎంచుకున్న రామె. లిఫ్ట్ ప్లీజ్ అని అడుగుతూ రోడ్లపై వెళ్ళే లారీ డ్రైవర్లు స్థానిక ప్రయాణికులు సాయంతో వేలాది కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సరస్వతి రాత్రి సమయంలో పెట్రోల్ పంపులు గుడులు గ్రామాల్లోని సురక్షిత ప్రాంతాల్లో ఒక టెంట్ వేసుకొని బస్ చేస్తుంది సరస్వతి ఒంటరి మహిళ ప్రయాణాలపై సమాజంలో ఉన్న భయాలు అపోహలు పోగొట్టాలని ఉద్దేశంతో ఆమె యాత్ర తలపెట్టారు భారతదేశంలో ప్రజల ఆతిథ్యం మానవత్వం ప్రేమ మీద అపారమైన నమ్మకం ఆమెకి. ప్రతి రాష్ట్రంలోని సంస్కృతి జీవనశైలి స్థానిక ఆహారపు అలవాట్లు స్వయంగా అనుభవిస్తూ అతి తక్కువ వనరులతో సురక్షితంగా ఆనందంగా ప్రపంచాన్ని చుట్టి రావచ్చని సరస్వతి నిరూపిస్తున్నారు. సంప్రదాయ భారతీయ వస్త్రధారణ తోనే ఒక మహిళ సాహసోపేతమైన ప్రయాణాన్ని ఎలా చేయచ్చు అన్న దానికి ఆమె ఒక ప్రత్యక్ష సాక్ష్యం.లద్ధాక్ మానస సరోవరం హిమాలయాలు ఇలా ఎన్నో ప్రదేశాలు చూస్తూ వివిధ రాష్ట్రాలు రాదారి దాటి ఇటీవలే దేశ సరిహద్దు కూడా దాటి కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ కు కూడా జీరో బడ్జెట్ ప్రయాణం చేసింది సరస్వతి. తన ప్రయాణ అనుభవాలను సేఫ్ లడికి పేరిట ట్రావెల్ విత్ అయ్యర్ పేరుతోనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది సరస్వతి.
