కాస్త పొట్ట ఉండటమే ఆరోగ్యం
మహిళలు పొత్తికడుపు తగ్గేందుకు చేసే వ్యాయామాల వల్ల శరీరానికి విపరీతమైన అనారోగ్యాలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.డైట్ వ్యాయామాలతో ఆ ప్రదేశాన్ని చదునుగా మార్చే ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు. మూత్రశయం గర్భాశయం జీర్ణవ్యవస్థ ఈ అవయవాలన్నీ పొత్తికడుపులోని కొద్దిపాటి జాగాలో ఇమిడి పోయి ఉంటాయి.అలాగే ఈ అవయవాలకు రక్షణగా ఒక దిండు మాదిరిగా ఉండేందుకు ఈ ప్రదేశంలో కొద్దిపాటి కొవ్వు కూడా పేరుకుంటూ ఉంటుంది. ఈ కొవ్వు హార్మోన్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ వంటి కీలకమైన హార్మోన్ల ఉత్పత్తి లో పొత్తికడుపులో ఉన్న కొవ్వు కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. కనుక ఈ కొవ్వుని అవసరాన్ని మించి వదిలించుకునే ప్రయత్నాలు చేస్తే ఎన్నో అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు అధ్యయనకారులు. అంతర్గత అవయవాలు ఎముకల నిర్మాణం రక్షణ కల్పించే కొవ్వుతో సహా మహిళల సహజసిద్ధ శరీర నిర్మాణంలో చిన్న పాటి పొట్ట ఆరోగ్యాన్ని సూచించేది గా భావించాలి. విపరీతమైన వ్యాయామంతో పొట్ట కరిగించే ప్రయత్నాలు చేయొద్దని చెప్తున్నారు అధ్యయనకారులు
