అందమైన ఆర్గంజా
పలుచగా తేలికగా లేత రంగులతో అందమైన డిజైన్లతో పార్టీ వేర్ గా డైలీ వేర్ గా ఆదరణ పొందే ఆర్గంజా చీరలు హుందాగా అద్భుతంగా ఉంటాయి.పెద్ద ప్రింట్ తో ముదురు రంగు ఫ్లోరల్ డిజైన్లు డిజిటల్ ప్రింట్లతో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి.చిన్నపాటి వేడుకలు సభలు సమావేశాలకు ఇవి ఎంతో అనువుగా ఉంటాయి ప్యూర్ సిల్క్ తో ఆధునికంగా తయారు చేస్తున్న ఈ చీరలు సింథటిక్ ఫైబర్లు నైలాన్ పాలిస్టర్ పోగులతో తయారవుతాయి. బరువైన సాంప్రదాయ పట్టు చీరలు కంటే వంటికి చక్కగా అమరే ఈ చీరలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. తేలికగా ఉండే బనారస్ ఆర్గంజా చీరలు సంప్రదాయ వెండి జరీ ను జోడించే విధానం వారణాసి కే ప్రత్యేకం. ఈ చీరలు వేడుకలకు చక్కగా ఉంటాయి. మెత్తని షిఫాన్ సిల్క్ లాగా ఈ చీరలు ఒంటికి అతుక్కుపోవు .ఈ తరహా చీరలు వాటర్ పెయింటింగ్స్ లాగా అనిపిస్తూ నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి.చక్కని దారపు అల్లికతో పూసల అలంకరణతో ఎంబ్రాయిడరీ ఆర్గంజా చీరలు వేడుకలకు చక్కగా ఉంటాయి.
