Sunday, 12 Jul, 2026

అడవిని సృష్టించిన దేవకీ అమ్మ

కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన కొల్లక్కయిల్ దేవకి అమ్మ 45 ఏళ్లు కష్టపడి స్వయంగా ఒక అడవిని సృష్టించారు. దీన్నే తపోవనం లేదా కొల్లక్కయిల్ తపోవనం అంటారు. ఒక కారు ప్రమాదంలో దేవకి తీవ్రంగా గాయపడి మూడేళ్ల పాటు మంచానికే పరిమితమై వ్యవసాయ పనులకు వెళ్లలేక తన ఇంటి వెనుక తన ఐదు ఎకరాల స్థలంలో అడవిని పెంచడం మొదలుపెట్టారు ఇందులో మూడు వేలకు పైగా చెట్లున్నాయి.సుమారు 1500 ఔషధ మొక్కలు ఉన్నాయి.ఆమె చేసిన ఈ అసాధారణ కృషికి భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం నారి శక్తి పురస్కార్ తో గౌరవించింది.ఆమె అద్భుత నిజ జీవిత కథ అందరికీ స్ఫూర్తిదాయకం. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ నిరాశకు లోను కాకుండా పచ్చని ప్రకృతిని సృష్టించాలని ఆమె చేసిన ప్రయత్నం అభినందనీయం. బంజరు భూమిని తన చేతులతో వ్యవసాయానికి అనువుగా చేసి అద్భుతమైన మొక్కలకు ప్రాణం పోసి దట్టమైన అడవి గా మార్చారు. 92 సంవత్సరాల దేవకి అమ్మను ఫారెస్ట్ గ్రాండ్ మదర్ అని పిలుస్తారు

Leave a Reply