తమిళ మూలాలున్న మోడల్, కంటెంట్ క్రియేటర్ తబిత మేరీ ,కేన్స్ అంతర్జాతీయ వేదిక పైన నడిచి ప్రపంచ ఫ్యాషన్ ప్రియులను ముగ్ధులను చేశారు.దక్షిణాసియా యాజమాన్యంలోని బ్రాండ్ గౌను ను ధరించి వేదిక పై నడిచి తన సాంస్కృతిక వారసత్వాన్ని చాటుకున్నది తబిత .సహజమైన మేకప్, పొడవాటి జుట్టుతో ఈ తమిళ అమ్మాయి పాతకాలపు సౌందర్య ప్రమాణాలు, వర్ణ వివక్ష వంటి విషయాల మీద విమర్శకుల్లో చర్చను రేకెత్తించారు. 2018 లో ఒక చిన్న అడ్వర్టైజింగ్ రంగంతో తన ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు అంతర్జాతీయ వేదిక పైన నడవడం వరకు తబిత విజయ వంతమైన కెరీర్ కొనసాగింది.













