Sunday, 28 Jun, 2026

పూలల్లో రాణి

పియోనీ మొక్క ఇంట్లో ఉంటే సంతోషం ప్రశాంతత ఉంటుందని నమ్ముతారు జపనీయులు.చైనా చక్రవర్తులు ఈ పియోనీ పూలను శుభ సూచకంగా భావించేవారు. క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ గా పిలిచే ఈ పియోనీ పూలు గుబురుగా పురి విప్పుకొన్నట్లు వికసిస్తాయి. ఈ పియోనీ లో 40 రకాల జాతులున్నాయి కానీ గులాబీ రంగు పూలు పూసే మొక్క మటుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఇది ఇంట్లో పెంచుకునే మొక్క.ఈ ముళ్ళ మొక్కను డ్రాయింగ్ రూమ్ డెకరేషన్ గా వాడతారు.

మొదటి అడుగు

హామై దేశంలో మొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్ (Ho mai vyara walla) చీరకట్టుతో, భుజానికి కెమెరాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.హామై 1913 లో గుజరాత్ లోని పార్సీ కుటుంబంలో జన్మించిన హోమై ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు. ఢిల్లీ లోని బ్రిటిష్ ఇన్ ఫర్మేషన్ సంస్థ  లో పనిచేశారు. 50 ఏళ్ల పాటు ఆమె తీసిన ఫోటోలు చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయి. స్వతంత్రం ముందు పరిస్థితులు, దేశ రాజకీయాల్లో మార్పులు ఆమె తీసిన ఫోటోలు స్పష్టంగా కనిపిస్తాయి.

ఈ పెయింటింగ్స్ చాలా రుచి

ఆర్టిస్ట్ షైఫాలీ తాంబే తాను చేసే వంటలను కాన్వాస్ గా మార్చి అందమైన కళారూపాలను ఆవిష్కరిస్తుంది. పన్నీర్ బటర్ మసాలా, దహి వడ, పాలక్ పన్నీర్ ల పైన పన్నీర్ క్రీమ్ ఫుడ్ కలర్స్ చింతపండు సాస్ ఉపయోగిస్తే వర్లీ మధుబని గోంద్ శైలి చిత్రాలు వేస్తోంది. ఇది నోటికి రుచి కాదు. కళ్ళకు విందు కూడా ఈమె పాకశాస్త్ర ప్రావీణ్యానికి, కళానైపుణ్యానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

సాంప్రదాయ వర్ణం కోరా

తెలుగు దేశపు సాంప్రదాయ వేడుకలకు ఐవా మలయాళాల  ఓనమ్ పండుగ కైనా ఆధునిక పార్టీల్లోనూ కోరా రంగు వెలిగిపోతుంది. పెళ్లి చీరెగా ఆఫ్ వైట్ శారీనే ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఈ కోరా రంగు అందాన్ని గమనించి ప్రాసెస్డ్  కాటన్ లెనిన్ పట్టు వంటి సహజ ఫాబ్రిక్స్ తో పాటు రేయాన్,నైలాన్ జార్జెట్ నెట్ వంటివి కూడా గాగ్రాలు లాంగ్ ఫ్రాక్ లూ  ఈ కోరా రంగు తోనే డిజైన్ చేసేవి బంగారు వెండి డిజైన్లు జోడించి […]