April 2023
సరికొత్త డిజైన్లు
ఇండియన్ ట్రైబల్ డిజైన్స్ ఇప్పుడు ప్రతి ఔట్ ఫిట్ తో జ్యువలరీ లో కనిపించి కనువిందు చేస్తున్నాయి.ప్లేయిన్ డ్రెస్ పైన చిన్న ట్రైబల్ డిజైన్ చాలు ఎంతో ప్రత్యేకం ఎంబ్రాయిడరీ దుస్తులు ఆభరణాలు చాలా ప్రత్యేకం. కొండకోనల్లో నివసించే వారి ఆహార్యం ఇవ్వాళ పట్టణాల్లో ఉండే అమ్మాయిల వెస్ట్రన్ డ్రెస్సుల్లో కనిపిస్తుంది. నగర డిజైనర్లు ఈ అడవి బిడ్డల ప్రత్యేకమైన డ్రెస్ తరహాలను నేర్చుకుని మరీ కొత్త రూపంలోకి తెస్తున్నారు.ఇది ఇండియన్ ట్రైబల్ డిజైన్ల ట్రెండ్.
ఆర్థికవేత్త
సోనాల్ దేశాయ్ ఆర్థికవేత్త పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కెరీర్ ప్రారంభించారు 2009 లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లో చేరిన ఆమె 2018 లో ఈ సంస్థ గ్లోబల్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్ కు ముఖ్య పెట్టుబడుల అధికారి గా నియమితులయ్యారు. ఫ్రాంక్లిన్ మున్సిపల్ కార్పొరేట్ క్రెడిట్, ఫ్లోటింగ్ రేట్ మల్టీ సెక్టార్, గ్లోబల్ మనీ మార్కెట్ ఫిక్సిడ్ ఇన్ కామ్ టీమ్ ల బాధ్యత సోనాల్ దే. వాల్ స్ట్రీట్ జర్నల్ […]
కన్నీటి ఉప్పెన
బలగం సినిమాలో తోడుగా మా తోడుండి పాట పాడిన కొమరమ్మ బుడగ జంగాల గాయకురాలు.భర్త మొగిలయ్యతో తో కలిసి తంబురా దిమ్మెస వాయిస్తూ పాటలు పాడుతోంది.చావులు,దినాలకు ప్రత్యేక పాటలు పాడే కొమరమ్మ పాట తెలుగు ప్రేక్షకులను కదిలించి కంటి తడి పెట్టించింది.కుటుంబ అనుబంధాలు విలువలు గుర్తుతెచ్చే పాటలను అప్పటికప్పుడు కూర్చి పాడుతుంది కొమరమ్మ.
అందరి నోట ఈ పాట
దసరా సినిమాలో చమ్కీల అంగీ లేసి పాటతో ట్రెండ్ సెట్టర్ అయ్యింది. దీక్షిత వెంకటేశన్.’దీ’ గా సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన తమిళ అమ్మాయి తండ్రి సంతోష్ నారాయణ తో పాటు ఏ.ఆర్ రెహమాన్ తో కలిసి పనిచేస్తుంది. దీక్షిత పూర్తిగా తెలంగాణ యాసతో సాగే ఈ ఒక్క పాటతో దీక్షిత తెలుగు జానపద గీతానికి ఒక కొత్త సొగసు తెచ్చింది.
తుదిశ్వాస వరకు…
ఒడిశా కు చెందిన అలక్ నందా కథక్ నృత్య కళాకారిణి. ఆమెకు ఒవేరియన్ క్యాన్సర్ పాకింది. కీమోథెరపీ లు చేయించుకుంటూ వైద్యం తీసుకుంటున్న ఆమె నృత్యం మానలేదు. గురువు గా ఆమెకు మంచి పేరుంది. మహాభారతంలోని గాధలను కథ రూపకాలుగా ప్రదర్శిస్తుంది. ద్రౌపతి పాత్ర లోని స్త్రీ వారి కోణాన్ని ప్రదర్శించే ఆమె తలపైన ఒక్క వెంట్రుక కూడా లేకుండా కథక్ ప్రదర్శన ఇస్తూ నా పోరాటం క్యాన్సర్ తో నా నృత్యం నృత్యమే. జబ్బు నా […]
అందమైన పుస్తకాలు
బెంగళూరుకు చెందిన రచయిత్రి బిజల్ వచ్చే రజని పర్యావరణం పైన పిల్లల పుస్తకాలు చాలా అందంగా రాస్తారు కథను. క్వారీ రేచర్ల రూపంలో గీసి వాటి చుట్టూ కథ అల్లుతుంది రజిని. ఆమె రాసిన ‘ఎ క్లౌడ్ కాల్డ్ బూర’, కిటెన్ ట్రబుల్, ఎ బెండ్ ఇన్ టైమ్, ది గ్రేట్ ఇండియన్ నేచర్ ట్రయల్ విత్ అంకుల్ బిల్కి వంటి రచనలు పిల్లలు ఎంతో ఇష్టపడ్డారు. సావీ అండ్ ది మెమొరీ కీపర్ పుస్తకం బాల […]
చిన్ని పిట్టకు ప్రచారం
తమిళనాడు తిరునల్వేలి కి చెందిన విద్యా సుందర్ బెంగళూరులో ఉంటారు గృహిణిగా అందరికీ ఉండే పనులే ఆమెకు ఉన్నాయి.కానీ ఆమె బర్డ్ వాచింగ్ హాబీగా తీసుకుంది. ఈ బర్డ్ అనే గ్లోబల్ ఇంటర్ నెట్ ప్లాట్ ఫామ్ లో వేలాదిమంది బర్డ్ వాచర్స్ సభ్యులుగా ఉన్నారు. విద్యా సుందర్ ఈ గ్రూప్ మెంబర్.తనకు బాగా నచ్చిన ముగ్గులతో పిట్టలను గురించి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం గురించి ప్రచారం చేస్తారామే. ప్రతిరోజు ఇంటి ముందు అందమైన పిట్ట బొమ్మ […]
శక్తినిచ్చే సన్ ఫ్లవర్ సీడ్స్
పొద్దుతిరుగుడు గింజల తో ఎన్నో ప్రయోజనాలున్నాయి.శరీరం లోని ఇన్ఫెక్షన్ లతో పోరాడగలిగే విటమిన్-36, మ్యాంగనీస్,ఫాస్పరస్, జింక్, సెలీనియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి.వీటిలో ఉండే సోడియం,మెగ్నీషియం,పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఈ గింజల్లో ఉన్నాయి. రోజు కొన్ని తింటే శరీరం డిటాక్స్ అవుతుంది.
స్ఫూర్తి ప్రదాత
బొటానికల్ సైన్స్ లో డాక్టరేట్ చేసిన తొలి మహిళ గా జానకి చరిత్ర సృష్టించింది.కేరళలోని తలస్సేరి లో 1897 లో జన్మించిన జానికి అమ్మాళ్ అమెరికా కు చెందిన ప్రతిష్టాత్మక ‘యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్’ స్కాలర్ షిప్ కు ఎంపిక అయ్యారు.అమెరికా లో చదువుకున్నారు చెరుకు మొక్కల జీవ పరిణామ క్రమం పై ఆమె రాసిన క్రోమోజోమ్ అట్లాస్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ ఒక ప్రామాణిక పుస్తకం. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (కోల్ కతా) కు […]
సుభద్ర కు పద్మశ్రీ
మధుబని కళాకారిణి సేలంపూర్ గ్రామానికి చెందిన సుభద్రా దేవి కి పద్మశ్రీ పురస్కారం లభించింది. కాగితపు గుజ్జు మనోహరమైన ఆకృతులను సృష్టించే సుభద్ర చిత్రించిన రాధాకృష్ణులు పెయింటింగ్ బ్రిటిష్ మ్యూజియంలోకొలువు’తీరింది కళల వ్యాప్తికి కృషి చేసిన ఆమెను 1980 లో రాష్ట్ర ప్రభుత్వం 1991 లో కేంద్ర ప్రభుత్వం పురస్కారాలతో సత్కరించాయి. ఆమె నైపుణ్యానికి దేశ విదేశాల్లో గుర్తింపు లభించింది.
తాజా పువ్వులు
ఫ్లవర్ వాజ్ లో పువ్వులుంచి డ్రాయింగ్ రూమ్ లో పెడితే ఇంటికో తాజాదనం వస్తుంది. పూలు వాడిపోకుండా ఉండాలంటే పూల కొమ్మలను కాండాన్ని రెండు ఇంచులు 45 డిగ్రీల కోణంలో కట్ చేయాలి. పువ్వుల పైన సిట్రిక్ యాసిడ్ చక్కెర నీళ్లు స్ప్రే చేయాలి. వీటిని ఫ్లవర్ ఫుడ్స్ అంటారు. వెనిగర్ చక్కెర నిమ్మరసం సమపాళ్లలో కలిపి పూల పైన చిలకరించిన పూలు తాజాగా ఉంటాయి.
దాహం తీర్చే పానీయాలు
ఈ వేసవి దాహం తీరేందుకు పుచ్చ,కర్బుజా,నారింజ, బత్తాయి రసాలు తాగాలి.అలాగే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు,సబ్జా నీళ్లు తాగితే శరీరం డీహైడ్రేషన్ గురికాకుండా ఉంటుంది.పండ్ల రసాల్లో చక్కెర వేయకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకొని తాగాలి.
రిలాక్స్ నిచ్చే టీ
రోజు కరివేపాకు టీ తాగితే ఒత్తిడి నుంచి ఉపశమనం అంటున్నారు ఎక్సపర్ట్స్. గుప్పెడు కరివేపాకు నీటిలో మరిగించి వడగట్టి పటిక బెల్లం వేసుకొని తాగాలి. ఈ ఆకుల వాసన రిలాక్స్ చేస్తుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు కంటి చూపు మెరుగు పరుస్తాయి.డయాబెటిస్ ఉన్నవాళ్లు తాగితే చక్కెర నిల్వలు సమతుల్యం అవుతాయి.
సృజనకు సోపానం
అంజలీ సూద్ విమియో సంస్థ సిఈఓ ఒకప్పుడు మామూలు వీడియో షేరింగ్ సంస్థగా ఉన్న విమియో సంస్థ ను నేడు గ్లోబల్ కంపెనీగా మార్చింది అంజలి. 2015 లో మార్కెటింగ్ విభాగంలో చేరిన అంజలి రెండేళ్లలో సి ఈ ఓ అయింది. ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో పవర్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్ గా నిలిచి సత్తా నిరూపించుకుంది. చిరు వ్యాపార సంస్థలు తమ ప్రకటనలో చక్కని వీడియోలు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. విమియో […]
భారతీయతే విజయం
అంతా మన మంచికే అనే భారతీయ భావనలో ఎంతో నిశ్చింత ఉంది. అది గొప్ప పాజిటివ్ లక్షణం అదే నన్ను విజయ తీరాలను నడిపించింది అంటుంది రేవతి అద్వైతి. ఎలక్ట్రానిక్ వస్తువుల కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోని ఫ్లెక్స్ సంస్థ సి ఈ ఓ ఆమె ఈ కంపెనీ కరోనా కాలంలో వైద్యులకు అవసరం అయ్యే పి పి ఈ కిట్ లు భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసింది. 2018 నుంచి ఈ సంవత్సరం […]
పోషకాలు మాయం
ఖర్జూర గింజలను పొడి చేయటంతో బ్రౌన్ డేట్స్ పౌడర్ తయారు చేస్తారు. ఇది సహజ సిద్ధమైన స్వీటెనర్ అంటున్నారు నిపుణులు. కాఫీ టీ లలో వాడరు కానీ బేకరీ చాక్లెట్లు స్నాక్స్ లో ఉపయోగిస్తారు. ఇది చక్కెర కు ప్రత్యామ్నాయం పీచు ఆంటీ ఆక్సిడెంట్ల ఖనిజ లవణాలు ఉంటాయి కనుక దీన్ని వాడటం వల్ల శరీరం శక్తితో ఉంటుంది. ఈ వేసవిలో డేట్స్ పౌడర్ ను పెరుగు,యోగర్ట్ పండ్ల మొక్కల పైన వాడుకోవచ్చు.
ధ్వని వల్లనే బి.పి
శబ్ద కాలుష్యం వల్లనే బి.పి పెరుగుతుందని కనిపెట్టారు శాస్త్రజ్ఞులు రద్దీ ఎక్కువగా ఉండే రోడ్డుపైన నిరంతరాయంగా హారన్లు ఇంజన్ల మోతలు వినటం వల్ల బి.పి విపరీతంగా పెరుగుతుందట. తాజాగా ఒక పరిశోధన, ట్రాఫిక్ లో ఉండే వాళ్లలో కూడా బి.పి ఎక్కువగా ఉందని గుర్తించారు. సాధ్యమైనంత వరకు తక్కువ శబ్దాలున్న చోట ఉండమంటున్నారు నిపుణులు. పెద్ద శబ్దంతో టీవీ వినటం ముఖ్యంగా ఇయర్ ఫోన్లు వాడటం తగ్గించమంటున్నారు.
గోల్ ఇన్ శారీ
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక ఎన్జీవో తో కలిసి గోల్డ్ ఇన్ శారీ పేరుతో ఫుట్ బాల్ పోటీలను నిర్వహించింది. 8 బృందాలు పోటాపోటీగా ఆడాయి.వీళ్లంతా చిరు వ్యాపారులు,గృహిణులు 20 నుంచి 72 ఏళ్ల వాళ్ళు దాదాపు వంద మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు రంగు రంగుల చీరెలతో విల్లు పాల్గొన్న ఈ పోటీ క్రీడల్లో మహిళల సామర్థ్యానికి నిదర్శనం అంటున్నారు నెటిజన్లు.
బాక్సింగ్ లో ఛాంపియన్
ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో నిఖిత జరీన్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది 13 ఏళ్ల వయసులోనే బరిలోకి దిగింది జరీన్. తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ కు చెందిన జరీన్ వరుసగా రెండో ఏడాది కూడా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచింది. మేరీ కోమ్ తర్వాత ఎక్కువ స్వర్ణాలు గెలిచింది జరీన్ ఈ స్వర్ణ విజేత ఎంతో మందికి ఆదర్శం.
తొలి మహిళా మంత్రి
నాగాలాండ్ మహిళ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సెల్ హౌతు వోనునో క్రూసే 60 మంది శాసనసభ్యులున్న నాగాలాండ్ అసెంబ్లీలో కాలు పెట్టిన తొలి మహిళ ఈమె గత పాతికేళ్లుగా అంగామీ ఉమెన్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలిగా అంగామీ పబ్లిక్ ఆర్గనైజేషన్ బోర్డ్ సభ్యురాలిగా పనిచేశారు.
