Wednesday, 05 Aug, 2026
సీజన్ తో టైమ్ తో సంబంధం లేకుండా పల్లీలు ఎప్పుడైనా తిన బుద్దేసే స్నాక్ లాంటివి. కానీ పల్లీలు ఆరోగ్యానికి మంచిది కాదనే వాటిని తీసుకుంటే కొవ్వు పెరుగుతుందనే అనుమానాలు చాలా మందికి వుంటుంది. ఇవి కేవలం అపోహేనని ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివంటున్నారు పరిశోధనలు. మధ్యాహ్నం భోజనంలో పాటు కొన్నిపల్లీలు నేరుగా కానీ షేక్ రూపంలో గానీ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా వుందని పరిశోధనల్లో వెల్లడైంది. పల్లిలు తింటే ట్రైగ్లిజరైడ్స్ తగ్గిన విషయం తెలిసిందట మాములుగా భోజనం అనంతరం రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో వీటి స్థాయి పెరిగితే గుండె సంబందిత అనారోగ్యాలు వస్తాయట. ఈ పల్లిల వల్ల ఈ సమస్య ఉండదని, హాయిగా వస్తాయిట. ఈ పల్లిల వల్ల ఈ సమస్య ఉండదని, హాయిగా పూటకో గుప్పెడు తినండి అంటున్నారు పరిశోధకులు.

మేలు చేసే పల్లీలు

వేరుశనగ గింజలు గాని పల్లి బటర్ గాని రోజు తింటే రక్తనాళాల పనితీరు మెరుగవుతుంది అని చెబుతున్నాయి అధ్యయనాలు.వేరుశనగలు తినే వాళ్ళలో రక్తనాళాలను వ్యాకోబింపజేసి వాటి పనితీరు మెరుగు పరిచే ప్రోస్టాసైక్లిన్ -12  థ్రోంబాక్సేన్ ఏ2 వంటి వాస్క్యూలర్ మార్కర్ల శాతం పెరిగింది.క్రమం తప్పకుండా పల్లీలు తినమంటున్నారు నిపుణులు .

Leave a Reply