Sunday, 28 Jun, 2026

లక్షల్లో అభిమానులు

జుబేదా ఆలీ యూట్యూబ్ ఛానల్ కు నాలుగు లక్షల మంది సబ్ స్కైబర్లున్నారు ప్రముఖ హాస్యనటుడు ఆలీ సతీమణి ఈ 48 ఏళ్ల జుబేదా మొదలైన ఈమె వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారాయి. ఘుమఘుమలాడే సాంప్రదాయ వంటలను వండి షూటింగ్ స్పాట్ వద్ద ఆయనతో పని చేసే వారికి వడ్డిస్తుంది. జుబేదా భర్త ఆలీతో కలిసి చేసే విహారయాత్రలు, ప్రాంత విశేషాలు అభిమానులకు చేరుస్తుంది. ఈ జంటకు అభిమానులు ఎక్కువే.

అమిత ప్రయోజనకారి

కొత్తిమీర లో ఉండే ఖనిజ లవణాలు ఐరన్ మొదలైనవి సౌందర్య చికిత్సలో ఎంతో మేలు చేస్తాయి. పెదవులు నల్లగా ఉంటే రోజూ రాత్రి పడుకునే మందర కొత్తిమీర రసం రాస్తే పెదవులు సంతరించుకుంటాయి. మొటిమలు మంగు మచ్చలు చర్మం పై నల్లని మచ్చలు ఇబ్బంది పెడుతూ ఉంటే చెంచాడు కొత్తిమీర రసానికి చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే కొద్ది రోజులలో చక్కని ఫలితం కనిపిస్తుంది విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ […]

యువతకు ప్రోత్సాహం

హోవార్డ్ బిజినెస్ స్కూల్ ఐ ఐ మ్  వ్యాపార పాఠాలు బోధించే నమితా థాపర్ యువతను వ్యాపార రంగంలోకి తీసుకువచ్చేందుకు ఇంక్రెడిబుల్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ ప్రారంభించారు.కుటుంబ వ్యాపారమైన ఎమ్ క్యూర్ ఫార్మాసూటికల్స్ సి.ఎఫ్. ఓ గా చేరిన నమితా తన నేతృత్వంలో ఎమ్ క్యూర్ అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దింది ఆరు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఈ సంస్థ 70 దేశాల్లో విస్తరించింది. 10 వేల మంది ఉద్యోగులు 800 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. […]

నెలసరి కి ఔషధం

శారీరక ఆరోగ్యాన్ని దృఢత్వాన్ని ఇచ్చే బీట్ రూట్ ను తరచూ తీసుకోమంటున్నారు ఆహార నిపుణులు. మహిళల్లో కనిపించే పోషకాహార లోపం త్వరగా అలసిపోవటం జుట్టు రాలిపోవడం వంటి సమస్యలకు బీట్ రూట్ ఔషధం. బీట్ రూట్ లోని ఐరన్, జింక్, కాపర్ అమ్మాయిలకు మంచి పోషకాలు నెలసరి సమయంలో అధిక శక్తిని ఇస్తుంది మెదడు తో సహా శరీర భాగాలకు రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తుంది. ఇందు లోని పొటాషియం జుట్టు కుదుళ్లు బలంగా ఉంచుతుంది. […]

సహజ కాంతి

చర్మం పొడిబారిపోకుండా మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాయాలి. స్నానం చేయగానే చర్మానికి మాయిశ్చరైజర్ రాస్తే పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. ముఖానికి చేతులకు కింద నుంచి పైకిరాయాలి గట్టిగా రుద్దకూడదు లేదా రాసిన చర్మాన్ని పట్టి లాగద్దు. ఇది రాశాక ఫౌండేషన్ క్రీమ్ రాస్తే మేకప్ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, తేనె, వెన్న, కలబంద గుజ్జు, అవకాడో నూనె, పొద్దుతిరుగుడు గింజల నూనె, బాదం నూనె, దోసకాయ గుజ్జు, పెరుగు, రోజ్ వాటర్ […]

అధిక బరువు జ్యూస్ తో మాయం

అధిక బరువు తగ్గించుకోవాలని అనుకుంటే కలబంద తో చేసిన జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది టేబుల్ స్పూన్ చొప్పున నిమ్మరసం, బెల్లం, గ్లాసు నీరు కలిపి మిక్సీ పట్టి పరగడుపున తాగాలి. యాంటీ ఆక్సిడెంట్స్ పెద్ద మొత్తంలో ఉండే కలబంద ఉసిరి తులసి లలో కలిపి తీసుకుంటే శరీరం లోపల నుంచి క్లెన్సింగ్ అవుతుంది. శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలతో పాటు ఏ, బి, సి, డి ఇ విటమిన్లు 18 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి […]

కోట్లలో వీక్షకులు

ప్రముఖ నటుడు బిగ్ బాస్ మొదటి సీజన్ విజేత శివ బాలాజీ భార్య మధుమిత ‘శివ మధు’ పేరుతో చేసే యూట్యూబ్ వీడియోలకు ఐదు లక్షల నుంచి అభిమానులు ఉన్నారు. ప్రసవానంతరం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లల పెంపకం, పోషకాహార విలువలు, తోట పెంపకం, ఇంటి శుభ్రత, ఫ్యాషన్ చిట్కాలు మొదలైన అంశాలపై వీడియోలు చేస్తూ కోట్లాది వ్యూస్ సొంతం చేసుకుంది మధుమిత. ఏడాదిన్నర లో 220 వీడియోలు చేసింది. ఇంత […]

నారింజ తో మంచి నిద్ర

ఒక నారింజ పండులో 13 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. నారింజలో 80 శాతం సి-విటమిన్ ఉంటుంది. వ్యాయామం పూర్తి చేసిన తర్వాత ఈ పండు తిన్నా లేదా నారింజ జ్యూస్ తాగిన కండరాలకు ఎంతో మంచిది. ఇందులో వుండే పొటాషియం మెదడుకు మేలు చేస్తుంది. డిప్రెషన్ లక్షణాలు తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ ను నియంత్రిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం నారింజ కు ఉంది. కంటి చూపు మెరుగు […]

వ్యాయామమే ఔషధం

మహిళల్లో 40 ఏళ్లు దాటిన తర్వాత ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ కాస్త తక్కువ ఉండే వాళ్లలో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా వ్యాయామం చేయటం మానేస్తేనే ఎక్కువ సమస్యలు చుట్టుముడతాయి. రక్తసరఫరా మెరుగుపరిచే నడక మానవద్దు. అలాగే నడకతో పాటు జాగింగ్ మొదలు పెట్టటం మంచిది. బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు జాగింగ్ ఉపయోగపడుతుంది. కొన్ని అదనపు ప్రయోజనాలు కావాలనుకుంటే సైకిలింగ్ మరీ మంచిది లేదా ఈత కొలను అందుబాటులో ఉంటే అరగంట మంచి వ్యాయామం ఓవరాల్ వర్క్ […]

ప్రపంచ యాత్ర

వీల్ చైర్ మీద 59 దేశాలు చుట్టేసింది పర్వీందర్ చావ్లా రుమాటాయిడ్ ఆర్థరైటిస్ తో వీల్ చైర్ కే అంకితమైన పర్వీందర్ చావ్లా కు ప్రపంచం చుట్టటం ఇష్టం. మంచి నాణ్యత కలిగిన వైట్ వెయిట్ వీల్ చైర్ తో పర్యటన కు ఒంటరిగా ప్రయాణం కట్టింది. ప్రపంచంలో 196 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు 53 ఏళ్లు 59 దేశాలు చూసిందామె. ఇంకా మూడు వంతులు మిగిలి ఉన్నాయి అంటారామె మనదేశంలో పూర్తిగా వీల్ చైర్ […]

నిమిషాల్లో పలహారం

నిమిషాల్లో చేసుకోగలిగిన బ్రేక్ ఫాస్ట్ లు చాలా నే ఉన్నాయి పెసలు శనగలు పల్లీలు వంటివి నీళ్ళలో నాననిచ్చి మొలకలు వచ్చేలా చేసే వాటి పైన ఉప్పు మిరియాల పొడి చల్లుకోవచ్చు వేయించి ఉప్పు కారం వేసుకోవచ్చు. అటుకుల ఉప్మా కు ఎక్కువ సమయం పట్టదు. బ్రౌన్ బ్రెడ్ జామ్ తో సాస్ తో తినచ్చు. ఉల్లి, క్యాప్సికం కొత్తిమీర సన్నగా తరిగి స్లైస్ ల మధ్య పెట్టుకొని తినచ్చు. కొన్ని పాలు వేడి చేసి అందులో […]

నల్లని వలయాలకు చెక్

కళ్ళ కింద నల్లని వలయాలు మచ్చలు పోగొట్టేందుకు టీ బ్యాగ్ లు ఔషధాలుగా పనిచేస్తాయి అంటున్నారు సౌందర్య నిపుణులు. రెండు టీ బ్యాగ్స్ పది నిమిషాలు వేడి నీటిలో నాననిచ్చి ఫ్రిజ్ లో 20 నిమిషాలు ఉంచాలి. వీటిని కళ్ళ పైన ఉంచుకొని 25 నిమిషాలు విశ్రాంతి గా ఉండాలి. టీ లో ఉండే కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్స్ కంటి కింద రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. దానితో అక్కడి చర్మం మృదువుగా మారుతుంది నల్లని వలయాలు […]

అది సముద్ర జీవులకు హాని

తారాగై ఆరాధన 9 నెలలు వయసులోనే స్వతంత్రంగా ఈదటం నేర్చుకుంది. తండ్రి అరవింద్ అరుణ్ శ్రీ స్క్రూ బా డ్రైవింగ్ ఎక్సపర్ట్ .ఆరాధన కు శిక్షణ ఇచ్చారు అలాగే మెరైన్ పొల్యూషన్ అరికట్టే దిశగా కూతురిని ప్రోత్సహించారు. ఇప్పుడు ఆరాధన సముద్రజలాల ప్రక్షాళన తో పాటు సముద్ర జీవులకు కాలుష్యం తో కలిగే ప్రాణ హాని గురించి ప్రచారం చేస్తోంది. ఈ మధ్యకాలంలో సేవ్ ది ఓషన్ కార్యక్రమం లో భాగంగా ఏకబిగిన 18 కిలోమీటర్ల దూరం […]

ఎంతో ప్రత్యేకం

రెండేళ్లుగా ఈ సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాను ఒక్క లొకేషన్ ఒక్క మంచి అనుభూతి ఇచ్చింది ఒక దాని తో ఒకటి పోలికలు లేని పాత్రలు చేయటం నాకు సంతోషంగా ఉంది అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఏడాది నావి హిందీ సినిమాలు విడుదల అవుతాయి. ఇందులో రన్ వే లో పైలెట్ గా డాక్టర్ జి లో గైనకాలజిస్ట్ గా చత్రీవాలీ లో కండోమ్ టెస్టర్ గా థ్యాంక్ గాడ్ లో కమర్షియల్ […]

అత్యంత ప్రతిభ

ఈ ఏడాది ఫోర్బ్స్‌ 30 ఏళ్లలోపు ప్రతిభావంతుల జాబితాలో చోటు దక్కించుకొంది నటి నిమిషా సజయన్‌. తొలి చిత్రంతో అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంది. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ కేరళ అమ్మాయి మొదటిగా మలయాళ సినిమా ‘తొండిముతాలమ్‌ ద్రిక్సక్షియుమ్‌’తో ఆరంగేట్రం చేసింది. తన నటనతో రాష్ట్ర స్థాయితోపాటు ఇంటర్నేషనల్‌ సౌత్‌ ఏషియన్‌ ఫిల్మ్‌ అవార్డ్ అందుకుంది.పాతికేళ్ల వయసులోనే నిమిషా ముసలి పాత్రలో మెప్పించింది సామజిక సమస్యలను  ఎత్తి చూపే ఉత్తమ మార్గం సినిమానే అంటుంది నిమిషా సజయన్‌.

చెట్టు కొమ్మతో సాధన

దేశం నుంచి ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ సాధించిన మొదటి అమ్మాయిగా వందనా కటారియా పేరు మోగిపోయింది.ఉత్తరాఖండ్‌లో రోషన్‌బాద్‌ అనే చిన్న పల్లె లో దళిత కుటుంబానికి వందనా తండ్రి మల్లయోధుడు నిరుపేద కుటుంబ వారిది.హాకీ స్టిక్‌ కూడా కొనలేని వాళ్ళు ఆమె చెట్ల కొమ్మలతోనే సాధన చేసేది. స్కూల్‌ కోచ్‌ వందన ప్రతిభను గుర్తించటంతో ఆమె సీనియర్‌ జట్లలో చోటు దక్కించుకుంది.జూనియర్‌ వరల్డ్‌ కప్‌లో దేశం కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. 2016 ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌లో జట్టుకు […]

అన్నింటా ఆమే

ఫోర్బ్స్ ప్రతిభావంతుల జాబితా లో రియా మిర్చందాని పేరు చోటు చేసుకుంది. ఈ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని మైక్రోసాఫ్ట్ తో సహా పలు అంతర్జాతీయ సంస్థల్లో ప్రొడక్ట్ మేనేజర్ గా పనిచేస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ పే కి దేశంలో ప్రోడక్ట్ లీడ్ గా పనిచేస్తున్న ఈమె తన ఆలోచన వ్యూహాలతో ఏడాదిలోనే దాని వినియోగదారుల సంఖ్య 13 రెట్లు పెంచింది. టస్సెల్‌ లోన్స్‌ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు కమేడియన్ స్టాండప్‌ కమెడియన్‌ విశ్వవిద్యాలయాల్లో ఇన్‌స్ట్రక్టర్‌, మెంటార్‌, […]

ఆదివాసీల ఆశాకిరణం

డాక్టర్‌ నీలమ్‌ గుప్తా ఆరోహ్ సంస్థ ( AROH ) ద్వారా ఆదివాసీల అభివృద్ధి కోసం పాటు పడ్డారు ప్రభుత్వ సహా భాగస్వామ్యంతో సీట్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ల ద్వారా ఒడిస్సా లోని మారుమూల గ్రామాల్లో యువత ఎడ్యుకేట్ చేశారు. ఈ సేవలకు గాను 2019 లో గ్లోబల్ కంపాక్ట్ ఇండియా నెట్ వర్క్ పురస్కారం అందుకున్నారు ఆదివాసీల కోసం రోడ్ మ్యాప్ తయారు చేసి వాళ్ల గ్రామాల్లో ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. నీలం గుప్తా […]

మాటలు లేవ్

ప్రణవాలయ డాన్స్ చేస్తున్నప్పుడు నా ఎమోషన్ లు చెప్పేందుకు మాటలు సరిపోవు అంటుంది సాయి పల్లవి. శ్యామ్ సింగరాయ్ లో సాయి పల్లవి చేసిన ప్రణవాలయ పాట లోని శాస్త్రీయ నృత్యం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ద్వారా అద్భుతమైన డాన్సర్స్ తో కలిసి ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది ఈ డాన్స్ గ్రూప్ లో వారంతా పది, ఇరవై ఏళ్లుగా క్లాసికల్ డాన్స్ చేస్తున్న వాళ్లు వాళ్లతో కలిసి ప్రదర్శన ఇచ్చే అవకాశం […]

చర్మం మెరుపుకు కుంకుమపువ్వు

చర్మం నిగారింపు తో ఉండేందుకు కుంకుమ పువ్వు ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం,జింక్, కాపర్, పోలిక్ యాసిడ్, నియాసిన్, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. స్కిన్ టోన్ పెంచేందుకు చక్కగా ఉపయోగపడుతుంది.డార్క్ సర్కిల్స్ పోతాయి. కొద్దిగా కుంకుమ పువ్వు ను రెండు టీ స్పూన్ల నీటిలో నానబెట్టి ఆ నీటిలో పాలు రెండు మూడు చుక్కలు కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట […]