Sunday, 28 Jun, 2026

పార్టీ స్పెషల్

పార్టీ లో ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటే దుస్తుల ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి. డిజైనర్ వేర్ లో ఎంబ్రాయిడరీ చేసినవి స్పెషల్ గా కనిపిస్తాయి. లాంగ్ స్లీవ్స్ రౌండ్ నెక్ డిజైన్స్ ట్యూనిక్ పార్టీ లో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ఫ్యాబ్రిక్ ఏదైనా క్రాప్ టాప్ ఏ బటమ్  వేసుకొన్న బాగా నప్పుతుంది. లేదా చీర పైకి కూడా క్రాప్ టాప్ బావుంటుంది. ఎరుపు, నలుపు రంగులు కూడా పార్టీ డ్రెస్ గా బాగుంటాయి క్రాప్ టాప్ స్కర్ట్,రిప్ప్ […]

పువ్వుల్లాంటి పాదాలు

చలికి పాదాలు పగుళ్లు వచ్చి. అందులో మట్టి చేరి చూసేందుకు బాగుండవు. ఈ ఇబ్బంది పోవాలంటే ముందుగా గోరువెచ్చని నీళ్ళలో కొన్ని చుక్కల షాంపూ, నిమ్మరసం, ఉప్పు వేసి ఆ నీళ్లలో పది నిమిషాలు పాదాలను ఉంచాలి. తర్వాత బ్రష్ తో రుద్ది కడిగితే మృతకణాలు పోతాయి. తడిలేకుండా తుడిచి ఒక తెల్లని టూత్ పేస్ట్ లో రెండు ఇ- విటమిన్ క్యాప్సిల్స్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసి సున్నితంగా మర్దన చేయాలి. తర్వాత సాక్స్ […]

నేటి తరానికి ఫైనాన్స్ పాఠాలు

యువతకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగించే పర్సనల్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సూత్రాలని సులభంగా నేర్పాలనే లక్ష్యంతో ఇండియా- హాంకాంగ్‌ వేదికగా ‘ఇన్‌వెస్టోఏసియా’ సంస్థని స్థాపించారు స్మృతితోమర్‌.ఈ సంస్థ ద్వారా విదేశీయులు మన మార్కెల్లో  సులభంగా పెట్టుబడులు పెట్టొచ్చు. మనం కూడా చైనా, కొరియా, జపాన్‌ వంటి దేశాల్లో ఏ చిక్కులు లేకుండా పెట్టుబడులు పెట్టొచ్చు.స్మృతితోమర్‌ ఎన్‌ఐటీ భోపాల్‌ నుంచి బీటెక్‌ చేశారు.లాటిన్‌ అమెరికాలోని అతిపెద్దదైన సిటీబ్యాంక్‌ బెనామెక్స్‌లో పనిచేసి . బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతలో నైపుణ్యం […]

ఈ ఆలోచనే అమూల్యం

భూకంపాల పై రీసెర్చ్ చేసిన కాంచన అగర్వాల్ అతిసూక్ష్మ కంపనాలను పసిగట్టే రియల్ టైమ్ ఆటోమేటిక్ పి-వేవ్ డిటెక్టర్ ను తయారు చేసింది. దీని ద్వారా భూకంపాల గురించి కనీసం రెండు నిమిషాల ముందే ప్రజల్ని అప్రమత్తం చేయవచ్చు. అలాగే తీవ్ర నష్టాలను  కలిగించే అణు శక్తి రియాక్టర్ లు రవాణా వంటివి నిలిపివేయవచ్చు. ఆవిష్కరణకు 2019 జపాన్ అంతర్జాతీయ పోటీలో స్టూడెంట్ ట్రావెల్ గ్రాంట్ అవార్డ్ ను ఐ.ఐ.టి మద్రాస్ 2020 సదస్సులో బెస్ట్ ప్రజెంటేషన్ […]

రోజుకో జామ ఆరోగ్యం

హార్మోన్ల అసమతుల్యత తో బాధపడేవారు ప్రతిరోజూ ఒక జామకాయ తింటే ప్రయోజనం ఉంటుంది. జామ రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే వెల్లుల్లి కూడా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజు వెల్లుల్లిని తీసుకుంటే బి.పి నియంత్రణలో ఉంటుంది. బ్రష్ చేసుకునే సమయంలో పేస్ట్ పై రెండు చుక్కల నిమ్మరసం వేసుకొని తోముకుంటే దంతాలు తెల్లగా మెరుస్తాయి రాత్రి పడుకునే సమయంలో దగ్గు విసిగిస్తే గోరువెచ్చని నీళ్లలో కొంచెం తేనె వేసుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది నిద్ర బాగా […]

ఫాస్టెస్ట్  బైకర్

మూడేళ్ల పాటు వరుసగా సూపర్ బైకర్స్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంది డాక్టర్ నిహారిక. హెల్మెట్ తీసి పొడవాటి జుట్టు బయట పెట్టే వరకు ఇంత వేగంతో వెళ్లగలిగే ఫాస్ట్ బైకర్ అమ్మాయి అంటే ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. 1000 సిసి సామర్థ్యం ఉన్న బండి ని అవలీలగా నడపగల ఫాస్టెస్ట్ లేడీ సూపర్ బైకర్ డాక్టర్ నిహారిక యాదవ్. మా అమ్మ కార్ రేసర్, నాన్న ఆర్మీ లో యుద్ధ విమానాలు నడిపే వారు వాళ్ళు ఇచ్చిన […]

కాఫీ పూత తో మెరుపు

కాఫీ పొడి ని మొహానికి పూతగా వాడితే అందమైన చర్మం మీ సొంతం అంటున్నారు ఎక్సపర్ట్స్. ఇది యాంటీ ఏజింగ్ గా పని చేయడంతో పాటు ముఖంపై మచ్చలు నల్లటి వలయాలు పోగొడుతుంది. అలాగే చర్మ సంరక్షణ ఉత్పత్తుల లోకి టోనర్ ని చేర్చుకోండి ఇది పి హెచ్ స్థాయిలను నిలకడగా ఉంచుతుంది. అలాగే ప్రతిరోజు గువాషా రాయ తో ముఖాన్ని సున్నితంగా మర్దన చేయాలి నున్నటి రాయిలా ఉండే ఈ గువాషా శరీరానికి ఎలాంటి హాని […]

మహిళా హక్కుల కోసం పర్యటన  

ఇరానీ అమ్మాయి మరల్‌యజర్‌లూని ఏడు ఖండాలు  64 దేశాల్లో 64000 కిలోమీటర్ల దూరాన్ని ఒంటరిగా బైక్ పై తిరిగే సింది ఈ ప్రముఖ మహిళా బైక్ మరల్‌యజర్‌లూని మార్కెటింగ్ లో పి.హెచ్.డి చేసింది. మా-యా పేరుతో ఒక ఫ్యాషన్‌ బ్రాండ్‌ని స్థాపించి బైకింగ్‌, రేసింగ్‌లపై ఆసక్తిని పెంచుకుంది. ఈమె పుట్టిన  ఇరాన్‌ లో ఈ బైక్ లు స్త్రీలు నడపడం నిషిద్దం ఈ దేశంలో అమ్మాయిలకు బైక్ నడిపే అవకాశం ఇవ్వాలని ప్రధానిని కోరడంతో పాటు  ‘రైడ్‌టుబివన్‌’ […]

ప్రధాని ప్రశంసలు

సూరత్ కు చెందిన  డాక్టర్‌ సారికామెహతా బైక్ రేసర్ బిహేవియరల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. రహదారి భద్రత పై అవగాహన తీసుకువచ్చేందుకు జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్‌ సహా 21 దేశాలు వంటరిగా బైక్ పై పర్యటించింది డాక్టర్ సారిక. స్త్రీలకు బైకింగ్‌ లో శిక్షణ ఇస్తూ ‘బైకింగ్‌ క్వీన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ని ఏర్పాటు చేశారామె.  ‘బేటీబచావో.. బేటీపడావో’, ‘స్వచ్ఛభారత్‌’ వంటి ప్రభుత్వ పథకాలు దేశంలోని మారుమూల గ్రామాల్లో ప్రచారం చేసినందుకు ప్రధాని మోదీ ఈ బైకింగ్ బృందాన్ని […]

తేనె ఉంటే చాలు

ఒక స్పూన్ తేనెతో పగిలిన పెదవులు, కళ్ళ చుట్టూ వలయాలు, యాక్నే వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు యాక్నే పై తేనె రాసి బాండ్ ఎయిడ్ ని అతికిస్తే తెల్లారేసరికి తగ్గుముఖం పడుతుంది. తేనె నెయ్యి కలిపి పెదవులకు రాస్తే పగుళ్లు పోయి పెదవులు మృదువుగా ఉంటాయి. ఆలీవ్ నూనె, తేనె కలిపి కళ్ళకింద వలయాలకు రాస్తే రెండు రోజుల్లో మార్పు చూడవచ్చు. బ్లాక్ హెడ్స్ కు తేనె, దాల్చిన చెక్క పొడి […]

ప్రపంచం చుట్టేసింది

అమెరికా కు చెందిన ఇరవై ఒక్క ఏళ్ల లెక్సీ ఆల్‌ఫోర్డ్‌ 196 దేశాలు ప్రయాణాలు చేసి ఇటీవలే రిపబ్లిక్ ఆఫ్ కోసోవో లో అడుగుపెట్టి ఘనత సాధించింది. ఈ యువ ట్రావెలర్ లెక్సీ ఆల్‌ఫోర్డ్‌ కాలిఫోర్నియా లో జన్మించింది. ఈమె తల్లిదండ్రులకు ట్రావెల్ ఏజెన్సీ ఉంది. 18 ఏళ్లకే డిగ్రీ పట్టా తీసుకుని అప్పటికే 35 పైగా దేశాలు చుట్టేసింది లెక్సీ. 2019 లో ఉత్తర కొరియా పర్యటన పూర్తి చేసుకుని 196 దేశాలు చుట్టిన పిన్న […]

ఫోన్ లో గూగుల్ కీప్ ఉందా ?

సరుకుల కోసం ఏవీ మర్చిపోకుండా తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది గూగుల్ కీప్ ఈ యాప్ ని మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు ఫస్ట్ ఐకాన్ క్లిక్ చేసి కొత్త నోట్ తెరవాలి అందులో దిగువ ఎడమవైపు ఉండే ప్లస్ గుర్తు క్లిక్ చేస్తే టిక్ బాక్స్ లు వస్తాయి. అవి ఎంచుకొంటే టిక్ లు పెట్ట గలిగేలా ఓ జాబితా వస్తుంది. అందులో కొనాలనుకున్న వస్తువుల జాబితా రాసుకోవచ్చు. ఇలా సిద్ధమైన జాబితా నోట్ కుడివైపున […]

ట్రాక్టర్ క్వీన్ మల్లికా శ్రీనివాసన్

ఫోర్బ్స్‌ ‘50 వోవర్‌ 50,ఆసియా 2022’లో తమ శక్తియుక్తులతో భవిష్యత్ ను ప్రభావితం చేసిన మహిళల్లో మల్లికా శ్రీనివాసన్ కూడా ఉన్నారు. ఆమె ‘మోస్ట్‌ పవర్‌ఫుల్‌ సీయివో’ గా ట్రాక్టర్ క్వీన్ గా కూడా గుర్తించారు. ట్రాక్టర్‌ ఇండస్ట్రీని మేల్‌ డామినేటెడ్‌ ఇండస్ట్రీగా చెబుతారు. లాంటి ఇండస్ట్రీలో విజయ ధ్వజాన్ని ఎగరవేశారు మల్లికా. ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్ మెంట్ లిమిటెడ్  (టఫే,చెన్నై) లో జనరల్ మేనేజర్ గా ఆమె కెరీర్ మొదలు పెట్టారు. అక్కడినుంచి చైర్ […]

ఉమెన్‌ చెస్‌ టోర్నీలో విరిసిన తెలుగు తేజం

ప్రముఖుల స్ఫూర్తిదాయక కథనాలు, మరికొందరి ఆపన్న హస్తం, కఠోరశ్రమ ఆమెను ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ను చేసాయి. ఆమే గుంటూరుకు చెందిన పందొమ్మిదేళ్ల బొమ్మిని మౌనిక అక్షయ. స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్‌ చెస్‌ ఫెస్టివల్‌లో మహిళా అంతర్జాతీయ మాస్టర్‌ సాధించింది. 2019లో ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్‌  ఓపెన్‌లో తొలి విమ్‌ నార్మ్, 2021 హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఓపెన్‌లో రెండో విమ్‌ నార్మ్, జనవరి 9న స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్‌ చెస్‌ ఫెస్టివల్‌లో 3వ విమ్‌ నార్మ్‌ […]

ఫోన్ తోనే సమస్య

స్మార్ట్ ఫోన్ ఉపయోగాలు చాలానే ఉన్నాయి.కానీ అస్తమానం ఫోన్ చూసే వ్యసనం మనుష్యుల మధ్య బంధాలను దారుణంగా దెబ్బ తీస్తాయని జార్జియా విశ్వవిద్యాలయం పరిశోధనలు చెపుతున్నాయి. నిరంతరం, భోజన సమయంలో కూడా ఫోన్ లోనే ఉండే వాళ్లలో డిప్రషన్ ఆందోళన వంటి లక్షణాలు క్రమేపీ వృద్ధి అవుతున్నాయి వాళ్ళు మనుషులతో నేరుగా ఐదు నిముషాలు కూడా మాట్లాడలేకపోతున్నారాని, ఇతరులతో దురుసుగా వ్యవహరిస్తున్నారని పరిశోధకులు చెపుతున్నారు.స్నేహితులతో గడిపేవాళ్లు సౌమ్యంగా మర్యాదగా ఉంటే ఫోన్ లో ఉండే వాళ్ళు స్నేహితులను […]

శిరోజాలకు ఎసెన్షియల్ ఆయిల్స్  

ఎసెన్షియల్ ఆయిల్స్ వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతాయి జుట్టు వేగంగా పెరిగేందుకు సహాయపడే గుణాలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ లో ఉన్నాయి. వెంట్రుకలు పెరిగే దశలో పిప్పర్మెంట్ ఎస్సెన్షియల్  బాగా పనిచేస్తుంది. రోజ్ మేరీ ఎసెన్షియల్  ఆయిల్ వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు సహాయ పడుతుంది సెడార్ వుడ్ ఎస్సెన్షియల్ జుట్టు రాలటాన్ని నిషేధిస్తుంది. ఇందులోని యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కురులు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. లెమన్ గ్రాస్ ఆయిల్ చుండ్రుని తగ్గిస్తుంది.. క్లారి సేజ్ ఆయిల్ […]

నయా జ్యువెలరీ

ఒకే నగలు రెండు రకాల డిజైన్లతో ఉండే ఫ్లిప్ రొటేటబుల్ జ్యువెలరీ మార్కెట్ లోకి వచ్చింది. ఈ రొటేటబుల్ నగల్లో చుట్టూ ముత్యాలు చక్కని చెక్కుడు ఉండే హారాలు లాకెట్ లో ఉంటుంది. అసలైన కిటుకు బిళ్ళకు ఒకవైపు లక్ష్మీదేవి, రామ పరివారము,దశావతారాల రూపాలు ఉంటే మరోవైపు చక్కని డిజైన్లతో కెంపులు, పచ్చలు వజ్రాల ఎనామిల్ మెరుపులు ఉంటాయి. ఒక పక్క దేవతామూర్తులు మరో పక్క టెంపుల్ జువెలరీలా మెరుపుల రాళ్ల డిజైన్ లతో ఇదో ట్రెండీ […]

బరువు పెరిగే విగ్రహం

తమిళనాడు కుంభకోణం లోని తిరునరైయూరు క్షేత్రంలో నాచ్చియార్ కోవెల విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుని ఆలయంగా ప్రసిద్ధి ఉత్సవ మూర్తిగా ఉన్న గరుత్మంతుడు ఊరేగింపు సమయంలో బరువు మారిపోతూ ఉండటం ఎక్కడ విచిత్ర విష్ణుమూర్తి విగ్రహాన్ని లోపల ప్రాకారంలో గరుడ వాహనం పైన ఎక్కించినప్పుడు నలుగురు మోయగలిగిన బరువుతో ఉంది. ఇక సింహద్వారం వచ్చేసరికి 64 మంది మోసే లాగా తీరా అయిదు ప్రాకారాలు దాటి వీధిలోకి వచ్చేసరికి ఆ గరుడుని 128 మంది మోయవలసి వచ్చే బరువు […]