Wednesday, 30 Sep, 2026
బ్లీచింగ్ చేస్తే మొహం పైన మరకలు, మురికి పోతుంది కానీ అసలు బ్లీచింగ్ ప్రాబ్లం మొహం పొడిబరుతుంది. మరి కళ్ళ కింద నల్లని వలయాలు ఎలా పోవాలి అంటే ఇంట్లో వుండే వస్తువుల తో తేలిక అని చెప్ప వచ్చు. టొమాటో లో బ్లీచింగ్ గుణం వుంది. ఒకటిన్నర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక టీ స్పూన్ టొమాటో రసాన్ని కలిపి కాళ్ళకింద నల్లని వలయాల పైన రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకోవాలి. బంగాళ దుంప తరిగి జ్యూస్ పిండి కాటన్ ప్యాడ్స్ తో ముంచి కళ్ళ పైన పెట్టుకుంటే కళ్ళకింద చరల తో పాటు కళ్ళ వాపు కూడా పోతుంది. రోజ్ వాటర్ లో కాటన్ ప్యాడ్స్ నాన నిచ్చి, వాటిని కనురెప్పల పైన 15 నిమిషాలుంచితే కళ్ళ కింద వలయాలు పోతాయి. ఇలా రోజు రెండు మూడు వారాల పాటు చేస్తే కళ్ళ కింద చారలు కళ్ళ అలసట మాయం అవ్వుతాయి.

నల్లని వలయాలకు చెక్

కళ్ళ కింద నల్లని వలయాలు మచ్చలు పోగొట్టేందుకు టీ బ్యాగ్ లు ఔషధాలుగా పనిచేస్తాయి అంటున్నారు సౌందర్య నిపుణులు. రెండు టీ బ్యాగ్స్ పది నిమిషాలు వేడి నీటిలో నాననిచ్చి ఫ్రిజ్ లో 20 నిమిషాలు ఉంచాలి. వీటిని కళ్ళ పైన ఉంచుకొని 25 నిమిషాలు విశ్రాంతి గా ఉండాలి. టీ లో ఉండే కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్స్ కంటి కింద రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. దానితో అక్కడి చర్మం మృదువుగా మారుతుంది నల్లని వలయాలు వాపు మచ్చలు క్రమేపీ దూరం అవుతాయి. కీరా దోస పలుచని చక్రాలు గా కోసి అరగంట ఫ్రిజ్ లో పెట్టి వాడుకోవచ్చు. టమాటో రసం లేదా పుదీనా ఆకులను పేస్ట్ రాసి కాళ్ళ కింద రాసి శుభ్రం చేసినా ఫలితం తెలుస్తుంది.

Leave a Reply