Sunday, 28 Jun, 2026

సరైన వేళ

పాలు, పెరుగు, అరటిపండ్లు సరైన సమయంలో తినాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. పొటాషియం పుష్కలంగా ఉండే అరటి పండ్లు మధ్యాహ్న భోజనం సమయంలో తినాలి అలాగే వ్యాయామం చేసే ముందు తిన్నా కావలసిన శక్తి ఉంటుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటే యాపిల్ ను ఉదయం మధ్యాహ్నం తినాలి. మాంసాహారం ఏదైనా సరే ఆరిగేందుకు 6 గంటల సమయం పడుతుంది కనుక పగటి వేళ తినడం మంచిది. పాలు ఉదయం కన్నా రాత్రివేళ తాగితే మంచి నిద్ర పట్టి శరీరానికి […]

అవసర సాయం

లేడీ సింగం అంటారు ఐపిఎస్ అధికారిని అంకిత శర్మ ను చత్తీస్ ఘడ్ లోని మార్క్ అనే గ్రామంలో పుట్టి పెరిగిన అంకిత ఆ రాష్ట్రం నుంచి ఐ ఎస్ ఐ అయ్యి హోమ్ కేడర్ ను సాధించిన మొదటి మహిళగా కూడా నిలిచారు గత సంవత్సరం గణతంత్ర దినోత్సవం లో జరిగిన పోలీస్ పెరేడ్ ను ముందుండి నడిపించారు రాష్ట్ర చరిత్రలోనే ఒక మహిళ అధికారి పోలీసు బృందాన్ని నడిపించటానికి ఇదే ప్రథమం వారమంతా క్షణం […]

విజయ నాదం

కోవిడ్ వారియర్ గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రశంసలు అందుకొన్న ఎస్.ఐ ఇందుమతి భారత మహిళ ఫుట్ బాల్ జట్టు తరఫున ఆడుతోంది మైదానం లో చిరుత లాగా ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే ఇందుమతి చెన్నై నగర వీధుల్లో అల్లరి మూకల్ని అదుపులో పెడుతూ కోవిడ్ కేసులు భారీగా ఉన్నప్పుడు జనాన్ని అప్రమత్తం చేస్తూ తీరిక లేకుండా ఉంటుంది. ఎంతో పేదరికం నుంచి వచ్చిందామె ఒక కూలీ కూతురు. స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుని ప్రోత్సాహంతో ఫుడ్ […]

శిరోజాలకు డిటాక్స్

చర్మాని, శరీరానికి లాగా శిరోజాలకు డిటాక్స్ కావాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. కురుల వాడే ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు ఎంత తలస్నానం చేసిన కొంతైనా జుట్టుపై ఉండి హాని కలిగిస్తాయి. మృతకణాలు పోగొట్టేందుకు చర్మాన్ని రుద్దినట్టు మాడకు ఉపయోగించే స్కాల్స్ స్క్రబ్ లు మార్కెట్ లో దొరుకుతాయి. వీటితో మాడుపై పేరుకుపోయిన మృత కణాలు జిడ్డు మురికి తొలగించాలి. అలాగే మాడుకు తేమ కూడా అవసరం. వారంలో ఒక్కసారి నూనె రాయటం హెయిర్ మాస్క్ పట్టించడం చేయాలి. అప్పుడప్పుడు […]

ఇన్ ఫ్లుయన్సర్

ఇండీ వైల్డ్ అనే సంస్థ స్థాపించి గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయిలకు ఉచితంగా నెలసరి ఉత్పత్తులు అందిస్తోంది. ప్రముఖ ఫ్యాషన్ ఇన్ ఫ్లుయన్సర్ దీపా ఖోస్లా. చెన్నయ్ లో స్థిరపడిన ఈ పంజాబీ అమ్మాయి నెదర్లాండ్స్ లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డిగ్రీ,లండన్ లో మాస్టర్స్ చేసింది. మూడుసార్లు కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచిన దీపా మొదట్లో ఒక ఫ్యాషన్ షో లో రంగు తక్కువ అని తిరస్కారాని గుర్తించి ఆ తరువాతే ఆమె ఎంతో […]

ఈ భార్యాభర్తల కృషే కారణం

కరోనా మహమ్మారి ని అదుపు చేసే కోవాగ్జిన్ టీకా కనిపెట్టి భారత్ కు అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత సాధించారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సి.ఎండి డాక్టర్ కృష్ణ ఎల్లా ఆయన భార్య సుచిత్ర కు దక్కింది. కోవాగ్జిన్ టీకా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఎన్నో దేశాల్లో గుర్తింపు సంపాదించింది. భార్యాభర్తలు ఉమ్మడిగా పట్టుదలగా చేసిన కృషికి ప్రభుత్వ మద్దతు ప్రభుత్వ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తల సహకారంతో కోవాగ్జిన్ టీకా సాధ్యం అయింది.

ఇవి వద్దు  

ఇక వేసవి రాబోతోంది పిల్లలు పెద్దలు హానికరమైన కూల్ డ్రింక్స్ వైపుకు మొగ్గు తారు వీటిల్లో చక్కెర మోతాదు ఎక్కువ. అందుకే పిల్లల్లో ఊబకాయానికి ఫలితంగా భవిష్యత్తులో డయాబెటిస్ రిస్క్ ఎక్కువ. కృత్రిమ రంగులు కిడ్నీలపై దుష్ప్రభావం చూపెడతాయి. నిల్వ ఉంచేందుకు ఉపయోగపడే సన్ సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం  బెంజోయేట్‌ వంటి రసాయనాలు పిల్లల్లో అతిధోరణులకు కారణమవుతాయి. ఇవి అనర్థాలు ఉండే ఈ కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండండి, సహజంగా దొరికే […]

ముఖానికి మెరుపు

సహజసిద్ధంగా ఇంట్లో గుమ్మడి కాయ గుజ్జు తో తయారు చేసిన క్రీమ్ చర్మ సమస్యలను రానివ్వదు అంటున్నారు ఎక్సపర్ట్స్. గుమ్మడి కాయ గుజ్జు ను మిక్సీలో వేసి మెత్తగా చేసి రసాన్ని వడకట్టాలి.దీన్ని ఒక గిన్నెలోకి తీసి డబల్ బాయిలింగ్ పద్ధతిలో పొయ్యి పైన పెట్టాలి.   ఐదు నిమిషాలు మరిగాక ఇందులో రెండు స్పూన్ల మొక్క జొన్న పొడి వేసి చల్లారాక చెంచా చొప్పున కలబంద గుజ్జు బాదం నూనె వేసి బాగా కలపాలి ఇట్లా […]

మొదటి మహిళ గైడ్

దాదాపు 1300 చదరపు కిలో మీటర్లు ఉండే రణథమ్‌బోర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ కు మొదటిసారి ఒక గైడ్ గా ప్రవేశించింది. సూరజ్ భాయ్ మీనా అన్న హేమరాజ్‌ ప్రోత్సాహం తో అతని లగే ఫారెస్ట్‌ గైడ్ అయింది మీనా. రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఇప్పుడు 80 పులులు ఉన్నాయి.ఈ ఫారెస్ట్‌ కు వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లు, బర్డ్‌ వాచర్స్, ప్రకృతి ప్రేమికులువస్తూ వుంటారు. వీరికి,తరుచుగా అడవిని సందర్శించే ఫారెస్ట్ టూరిస్ట్ లకు ఇంగ్లీష్ లో అడవిని పరిచేయగలరు మీనా. […]

రింగ్ తో గిన్నిస్

గెట్టి కెహయోవా అమెరికాలోని లాస్‌ వెగాస్‌ కు చెందిన సర్కస్‌ లో పనిచేస్తోంది .హూలాహూప్‌ నడుము చుట్టు గుండ్రంగా తిప్పే పనిలో అరుదైన ప్రత్యేకత సాధించింది. 17 అడుగులకు పైగా పొడువునా దానితో విన్యాసం చేస్తూ గిన్నిస్ రికార్డ్ సాధించింది దీన్ని 30 ఏళ్లుగా సాధన చేస్తున్నారు. కొత్తగా చేయాలని అతి పడ్డ హోప్ తో ప్రయత్నించాను. మొదట్లో దెబ్బలు తగిలేవి. ఏడాది సాధన చేసాక పట్టు సాధించాను .మాది రికార్డులు సాధించే కుటుంబం. మా నాన్న […]

బెస్ట్ ఆప్షన్ బ్లేజర్

క్యాజువల్ అవుట్ కీ ఆఫీస్ మీటింగ్స్ కి, లేదా కాస్త భిన్నంగా కనిపించాలి అనుకుంటే బ్లేజర్ బెస్ట్ ఆప్షన్. జీన్స్ పైన ఇది ఫేవరెట్ గా ఉంటుంది క్యాజువల్ స్టయిల్ లో ఎన్నో డిజైన్లతో అందుబాటులో ఉంది. బ్లేజర్ ఫార్మల్ ఈవెంట్స్ కోసం ప్రింటెడ్ బ్లేజర్ లు బాగుంటాయి. లెదర్ బ్లేజర్ ధరిస్తే ఎంతమందిలో ఉన్నా హైలైట్ గా కనిపించవచ్చు. జీన్స్ పైకి లెదర్ బ్లేజర్ పర్ ఫెక్ట్ పెయిర్ సాధారణ డ్రెస్ పైన క్లాసిక్ లుక్ […]

సహజ అందాల కాలింపాంగ్

పశ్చిమ బెంగాల్ లోని హిమాలయ పర్వతాల మొదట్లో ఉంటుంది. అత్యంత రమణీయమైన హిల్ స్టేషన్ కాలింపాంగ్ పట్టణం. సహజమైన అందాల చరిత్ర వినూత్నమైన సంస్కృతుల సమ్మేళనం తో కాలింపాంగ్ పర్యాటకులను ఆకర్షిస్తోంది.పట్టణానికి ఒకవైపు కాంచన్ జంగ్ పొగ మంచుతో కప్పబడిన పర్వతాలు ఇంకో పక్క డర్పిన్ డియో లో కొండలు సహస పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి సమీపంలోని టీస్తా నది ప్రవహిస్తూ ఉంటుంది. బ్రిటిష్ ఇండియాలో ఒకనాటి హిమాలయన్ వాణిజ్య మార్గం లో ప్రముఖ పట్టణం గా […]

స్త్రీలు ఎప్పుడూ సమర్థులే

ఆర్మీ లో లాజిక్ సిక్స్ ఆఫీసర్ గా లేహ్ ఆ ప్రాంతంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు సైనికులకు గుండు సూది మొదలుకొని మిసైల్స్ వరకు అందించవలసిన బాధ్యత నాదే నా భర్త కెప్టెన్ సంజీవ్ త్యాగి. ఉద్యోగంలో చేరేసరికే నాకు కొడుకు వాడిని కూడా ఆఫీస్ కు తెచ్చుకునే కార్గిల్ యుద్ధ క్షేత్రంలో పని చేశాను చేతిలో రైఫిల్ చేతిలో పసిబిడ్డ కడుపులో మరో బిడ్డ తో ఆ యుద్ధ భూమిలో పనిచేశాను అంటున్నారు కెప్టెన్ యాషికా […]

ఫ్యాషన్ స్టేట్ మెంట్ ఖాదీ

ఖాదీ తో ఎన్నో రకాల దుస్తులు తయారవుతున్న చీరె అది ఎప్పుడు ప్రత్యేక స్థానమే మృదువైన ఖాదీ కొత్త ఫ్యాషన్ స్టేట్ మెంట్ ఖాదీ చీరలు శరీరపు తీరును బట్టి పెంచుకోవాలి అంటారు ఎక్సపర్ట్స్. నడుము దిగువ భాగం పెద్దగా ఉండే వారు ఖాదీ జార్జెట్ చీరె ఎంచుకోవాలి అలాగే యాపిల్ నడుము ఉంటే ఎంబ్రాయిడరీ తో ఉండే సిల్క్ చీరలు బాగుంటాయి. భారీ శరీరం ఉన్న మహిళలు ఖాదీ జార్జెట్ లు ఎంచుకుంటే మంచిది. ముదురు […]

సరికొత్త చరిత్ర

పాకిస్థాన్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిన్ మాలిక్ 2012లో లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పాకిస్తాన్ న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించారు  ఆయేషా మాలిక్. 1966లో జన్మించిన మాలిక్, ప్యారిస్,న్యూయార్క్, కరాచీలోని పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. లాహోర్ లోని పాకిస్తాన్ కాలేజీ ఆఫ్ లా లో లా చదివారు హోవార్డ్ లా స్కూల్ నుంచి ఎల్,ఎల్,ఎమ్ చేశారు.

ఇక పండ్ల రసాల ‘టీ’

గ్రీన్ టీ లు బ్లాక్ టీ తో పాటు ఇప్పుడు పండ్లతో చేసిన టీ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. ఈ ఫ్రూట్ టీ లను టై సెన్స్ అంటున్నారు అంటే తేయాకు లేని టీ అని అర్థం. ఈ రోగనిరోధక శక్తి పెంచేందుకు శరీరం లోని టాక్సిన్స్ బయటకు పంపేందుకు తోడ్పడతాయి కొన్ని కంపెనీలు పండ్లతో పాటు ఇతర ఔషధ మొక్కలను ఆకులు, పువ్వులు రేకుల్ని కూడా కలిపి టై సైన్స్ నీ తయారుచేస్తున్నాయి. వీటిని వేడిగా […]

‘షావుకారు’ కు పద్మశ్రీ

వెండితెర కథానాయక క్యారెక్టర్ నటి షావుకారు జానకి ని తమిళనాడు ప్రభుత్వం పద్మ పురస్కారానికి ఎంపిక చేశారు. ఆమె వయస్సు 90 ఏళ్ళు 70 ఏళ్లుగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాష చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు జానకి. 1931 డిసెంబర్ 12న కాకినాడ సమీపంలోని పెద్దాపురం లో జన్మించారు. నాయక కృష్ణ కుమారి జానకి స్వయానా చెల్లెలు. 400 పైగా చిత్రాల్లో నటించిన షావుకారు జానకి తెలుగు తమిళ ప్రేక్షకుల అభిమాన నటి.

పప్పు దినుసుల ప్యాక్

ముఖం అందంగా మెరిసిపోవాలంటే ఎర్ర కందిపప్పు తో ప్యాక్ వేసుకుంటున్నారు ఎక్సపర్ట్స్. ఎర్ర కందిపప్పు రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే మెత్తగా గ్రైండ్ చేసి అందులో కాసిని పచ్చి పాలు పోసి కలపాలి ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి వేసుకునే ముందర నెమ్మదిగా ముఖానికి ఈ మిశ్రమం తో మర్దన చేయాలి అరగంట తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఇది ట్యాన్ తొలగించి చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి ముఖం మెరిపిస్తుంది అలాగే ఎర్ర కందిపప్పు గుజ్జులో పచ్చి […]

మేలు చేసే అశ్వగంధ

వేల సంవత్సరాల నుంచి అశ్వగంధ ఆయుర్వేదం లో వాడుతున్నారు ఇది స్త్రీలలో బరువు తగ్గించేందుకు అదుపుచేసేందుకు తోడ్పడుతుందని దీన్ని వాడటం వల్ల శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని ఆధునిక నిపుణులు చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యం తో తలెత్తే మధుమేహ సమస్య అశ్వగంధ అదుపుచేస్తుంది. మెనోపాజ్ సమయంలో తలెత్తే అనేక సమస్యలకు ఇది చక్కని ఔషధం నిద్రలేమిని కీళ్లనొప్పులు తగ్గించే లక్షణం దీనికి ఉంది. దీన్ని సప్లిమెంట్లు రూపంలో కూడా తీసుకోవచ్చు.

మహిళ సంక్షేమం ధ్యేయం

102 సంవత్సరాల శకుంతల చౌదరి ని తాజాగా పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది ప్రభుత్వం. 1947 లో కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ లో చేరి అసోమ్ విభాగాన్ని నడిపించారు. ఆచార్య వినోబా భవే నెలకొల్పిన అసోమ్. అరుణాచల్ సరిహద్దుల్లో ఉన్న ‘మైత్రీ ఆశ్రమ్‌’ బాధ్యతలు స్వీకరించారామె. పశ్చిమ బెంగాలో ‘గోహత్య నివారణ్‌ మూవ్‌మెంట్‌’లో భాగస్వామి అయ్యారు. ఇన్నేళ్ల జీవితంలో ప్రజా శ్రేయస్సు కు ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ కోసం పనిచేస్తూ ప్రజలకు ఆడంబరాలకు దూరంగా […]