Sunday, 28 Jun, 2026

ఒంటరితనంతో వత్తిడి

గత యాభై ఏళ్ళలో ఒంటరిగా అవుతున్న ఉన్నవాళ్ళ సంఖ్య అంతకు ముందుకంటే రెట్టింపు అయింది.25,30 ఏళ్ళ మధ్య వివాహాం చేసుకోకుండా కెరీర్ పై దృష్టిపెట్టినవాళ్ళు కొందరైతే 50 ఏళ్ళ వయసులో ఒంటరితనం కొందరిది.ఆ వయసులో భాగస్వామిని కోల్పోయికాని దంపతుల మధ్య సమస్యల వల్ల కానీ మనుషులు ఒంటరి అవుతున్నారు.ఎనబహి ఏళ్లు దాటిన తర్వాత అనారోగ్యం భార్య,భర్తల్లో ఎవరో ఒకరు మరణించడం ఒంటరి తనం అనారోగ్యాలకు దారి తీస్తుందని అన్న అంశం పై జరిగిన అద్యాయనంలో ఈ లెక్కలు […]

ఎముకలకు బలం ఇచ్చే అంజీర

అత్తిపండునే అంజీరా అంటారు.రక్తహీనత అనగానే ట్యాబ్లెట్లు వేసుకుందాం అనుకునే వారికి అంజీరా పరమఔషధం.వీటిలో అధిక మోతాదులో కాల్షీయం ఉంటుంది.పిల్లలకు ప్రతిరోజు ఇస్తే ఎముకలు గట్టిపడతాయి.పాలు పాల పదార్ధాలు పడనివారు ఇవి తింటే శరీరానికి కాల్షియం,ఐరన్ అందుతుంది.షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఈ పండుతినవచ్చు.దీనిలో ఉండే పొటాషియం ,పాలిఫినాల్స్,ఫ్లెవానాయిడ్స్,యాంటీ ఆక్సిడెంట్లు టైప్ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. నిద్రసరిగా పట్టనివారు పదిగంటలు దాటాక మూడు అంజీరాపండ్లు తిని పాలు తాగియే హాయిగా నిద్రపోతారని ఆయిర్వేద వైద్యులు చెపుతారు.

షుగర్ ఫ్రీ అయినా ప్రమాదమే

కుత్రిమ స్వీట్ నర్లు వాడితే ఆరోగ్యానికి హాని ఉండదు అనుకుంటే ఎంతైన ప్రమాదం ఒహియో లోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ అద్యాయనం ప్రకారం ఈ కృత్రిమ స్వీట్ నర్ల వల్ల పొత్తి కడుపులో నొప్పి బరువు తగ్గడం ,నీరసం రావడం జరుగుతుందని తేలింది.కడుపులో మంట దానికి సంభందించిన వ్యాధుల పై చేసిన ఈ పరిశోధనలో ఈ సమస్యలకు కృత్రిమ స్వీట్ నర్లే కారణం అని తేల్చారు.ఈ స్వీట్ నర్లతో చేసిన తియ్యని పదార్ధాలు తినే అలవాటు […]

నడకతో లాభం

వయసు పైబడుతున్న మహిళల్లో హుద్రోగా బారిన పడుతున్న నేపథ్యంలో అమెరికాలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్ వైద్యులు.ఈ అంశం పై ఒక అద్యాయనం చేశారు.50 ఏళ్ళకు పైబడిన 89వేల మందితో ఒక అద్యాయనం చేశారు. నడక అలవాట్ల పై చేసిన అద్యాయనంలో నలభై నిమిషాల చొప్పున వారంలో చాలాసార్లు నడిస్తే గుండె వైఫల్యం ముప్పు 25 శాతం వరకు తగ్గుతుందని ఈ అద్యాయనం చెబుతుంది.ఇంకాస్త వేగంగా నడిస్తే ఈ ముప్పు 26నుంచి 38శాతం వరకు తగ్గుతుందని అంచనావేశారు. బరువు […]

ఫిట్ నెస్ గురూ దీక్షా చాబ్రా

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫిట్ నెస్ పాఠాలు నేర్పుతున్న ఢిల్లీకి చెందిన దీక్ష చాబ్రా ఢిల్లీలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో ప్రిన్సిపాల్ గా పనిచేశారు.అప్పుడు ఆమె బరువు 90 కిలోలు పై మాటే.డాక్టర్ హైపో థైరాయిడిజం ఉందని తేల్చారు. అప్పటి నుంచి ఆమె ఫిట్ నెస్ పై దృష్టిపెట్టి ఇంటర్నెట్ లో వీడియోలు చూస్తూ వ్యాయామాలు చేసి బరువు తగ్గింది.2017లో అందాల పోటిలో పాల్గొని మిసెస్ ఎర్త్ 2017 సెకెండ్ రన్నరఫ్ కిరీటం మిసెస్ బాడీఫిట్ […]

మూత్రశాలలు నిర్మించింది

ఎలాంటి ప్రతి ఫలం ఆశించ కుండా ఎంతో మంది సమాజహితం కోరి నిశ్శబ్దంగా పని చేసుకొంటూ పోతారు. సనీతా దేవిది జార్ఖండ్ లోని ఉదయ్ పూర్ . స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా మూత్రశాలలను కట్టేందుకు ముందుకు వచ్చింది. యూనిసెఫ్ సహకారంతో మేస్త్రీగా శిక్షణ పొందింది. తనతో పాటు మరో 300 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి మేస్త్రీలుగా మార్చింది. ట్విన్ పిట్ సాంకేతికతో సునీత టాయ్ లెట్ల నిర్మాణం చేపట్టింది. అందరూ కలిసి 1500 టాయ్ […]

బెల్ట్ తో అందం

ఎప్పటికప్పుడు ఫ్యాషన్ తీరు మారిపోతుంది.ఒక్క సందర్భానికి ఒక్కడ్రెస్ ఎంచుకొంటారు .దీనికి తగ్గట్లు యార్సీ సరీలు ఇప్పుడు వాటిలో బెల్ట్ కూడా చేరింది. చక్కగా అకృతిలో కనిపించేందుకు బెల్ట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఓవర్ సైజ్డ్ ఫ్యాషన్ .వేసవికి సౌకర్యం కూడా . వేసుకోవాలంటే నడుముకు బెల్ట్ పెట్టుకొంటే సరిపోతుంది. ఆఫీస్ లో చిన్న చిన్న పార్టీలు,గెట్ లు గెదర్ లప్పుడు జీన్స్ స్కర్ట్స్ వంటివి వేసుకొని మెరిసే రంగుల్లో ఒక టాలిక్ బెల్ట్ వేసుకోంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. […]

మారని ఫ్యాషన్ డెనిమ్

డెనిమ్ డ్రెస్ లో ఎప్పుడు బావుంటాయి. నీలి,గోధుమ,నలుపు కలయికతో ఎన్నో డిజైన్ లతో డెనిమ్ చుక్కలు కుర్తీలు వస్తున్నాయి. మోకాలి వరకు ఉండే డెనిమ్ కుర్తీలు ఎంచుకోంటే మడమ వరకు ఉండే లెగ్గింగ్స్ చాలా బావుంటాయి. స్టైల్ కట్ లేదా అంబ్రెల్లా రకాలు ఎంచుకోని చక్కని ఫ్యాన్సీ బెల్ట్ పెట్టుకొంటే మరింత అందంగా కనిసిస్తారు. రకరకాల డెనిమ్ టాప్ లపై ఎంబ్రాయిడరీ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డెనిమ్ వస్త్రాలపైకి పెద్ద అలంకరణ కూడా అవసరం లేదు. […]

బాక్టీరియా మాయం

ఇల్లు ఎంతో శుభ్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది.కానీ ఎక్కడో ఒక మూల బాక్టీరియా చోటు చేసుకొంటుంది. వాటి వల్లనే చిన్న చిన్న అనారోగ్యాలు వస్తాయి.స్మార్ట్ ఫోన్ లో,రిమోట్ కంట్రోల్స్ ,ట్యాబ్స్ లపైన బాక్టీరియా పేరుకు పోతూ ఉంటుంది. వారానికి ఒక్కసారైనా ఏ డెట్టాల్ ముంచిన గుడ్డతోనూ ఇవన్ని శుభ్రం చేయాలి. సంగీతం వింటూ ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. ఆ ఇయర్ ఫోన్ లని అలా వదిలేస్తూ ఉంటారు. చమట కారణంగా ఎంతో బాక్టీరియా పేరుకుపోతుంది.పైనుండే సిలికాన్ తొడుగుని […]

పట్టులాంటి జుట్టు కోసం మాస్క్ లు

ఈ వేసవి ఎండలకు జుట్టు పొడిబారి పోతుంది.జీవం లేకుండా గడ్డిలా అయిపోతూ ఉంటుంది. కొన్ని చిన్న చిట్కాలతో ఎలాంటి రసాయనాలున్న ముందులు వాడకుండా జుట్టు పట్టులా మెరిసేలా చేయచ్చు. కొబ్బరి పాలు అవకాడొ మిశ్రమం జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి పాలు అవకొడాను గుజ్జులా అయ్యేలా చేసి దానికి తేనే నిమ్మరసం కలిపి జట్టుకు పట్టిస్తే జుట్టు జీవం పుంజుకుంటుంది. అలాగే అరటి పండ్లు ,ఆలీవ్ నూనె తేనె మిశ్రమం కూడా జుట్టును పట్టులా చేస్తుంది. […]

కాస్సేపు పక్కన పెట్టండి

ఎప్పుడు చూసిన స్మార్ట్ ఫోన్స్, ఇమెయిల్స్ పైన సమయం గడిపే వాళ్ళలో ఒత్తిడి ఎక్కువై అనారోగ్యాలకు గురవుతున్నారు అంటున్నారు అద్యాయనకారులు. సోషల్ మీడియాలో కాలం గడుపుతూ ఉంటే స్నేహితులతో గడపటం కుటుంబ సభ్యులతో, బందువులతో కాస్సేపైనా ఫోన్ పక్కన పెట్టి మాట్లాడకపోవడం ఇవన్ని తెలిసి చేసే తప్పులే మానవ సంబంధాలను చేతులారా పాడు చేసుకోవటమే. టెక్నాలజీ ఇంట్లో వదిలేసి హాయిగా సాయంత్రం ఎంజాయ్ చేయాలని, కనీసం నిద్రకు ఉపక్రమించేందుకు ఒక గంటైనా ఏ పుస్తకమో చదవాలనీ అదే […]

పై తోక్కలోనే పోషకాలు

బంగాళదుంప తోలు తీసి కూరల్లో వాడుతుంటారు కానీ ఆ పై చర్మంలోనే అనేక పోషకాలుంటాయి. వాటిలో సమృద్దిగా పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. పైతొక్క లో ఉండే పీచు రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించి జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది. విటమిన్ బి6 అధికంగా లభిస్తుంది. సెరటోనిక్ ,డోపమైన్ లను సృష్టించటంలో సహాకరిస్తుంది. ఇది భూమిలో పెరుగుతుంది కనుక దుంపను శుభ్రంగా ఎక్కువ నీటిలో కడిగి తోలుతో పాటు యాధవిధిగా వినియోగిస్తే ఎంతో ఆరోగ్యం […]

వట్టివే తినాలి

బాధం పప్పులను యథాతధంగా తిన్నా ,నానబెట్టి తిన్న కానీ ఆరోగ్యానికి మంచిదే కానీ ఆ పప్పుల్ని నానబెట్టి బాధం పాలు చేసి తాగటం వల్ల నష్టమే కానీ లాభం లేదంటున్నారు ఎక్స పర్ట్స్. అందులో ఫ్లేవర్ కోసం కలిపే అదననపు పాలు ,చక్కెర, రంగులు ఇవన్ని వాడటం వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. బాధం పాలు తీసేందుకు బాధం పప్పు నానబెట్టి గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని వాడకడతారు ,ఇలా వాడకట్టితే ఆరోగ్యవంతమైన గుజ్జు మిగిలిపోతుంది. […]

పండుతో తినచ్చు

ఐస్ క్రీమ్ మాదిరిగానే పెరుగులో పండ్లగుజ్జు,కాసిన్ని డ్రై నట్స్,డ్రై ఫ్రూట్స్ కలిపి ఫ్రిజ్ లో ఉంచితే ఫ్రూట్ యోగర్ట్ తయారవుతుంది.ఏదో ఒక రూపంలో పెరుగు తింటే పొట్టలో ఆరోగ్యకరమైన బాక్టీరియా చేరుతుంది.పండ్ల గుజ్జులోని సహజమైన చెక్కరలు శరీరానికి అవసరమైన కార్బో హైడ్రేట్స్ అందిస్తాయి.ఇది శరీరానికి అవసరమైన మంచి సమతులాహరం.రుచిగా తియ్యగా ఉండే పెరుగుతో ఇప్పటికే రకరకాల ఫ్లేవర్లు కలిపి ఫ్రూట్ యాగర్ట్.ఫ్రూట్ ఫ్లేవర్స్ యాగర్ట్ యాగర్ట్ పా ఫై ఇలా ఎన్నో పేర్లతో పెరుగుని వినియోగదారులకు అందిస్తున్నారు […]

పాపాయికి పట్టు పావడా

ఎన్ని ఫ్యాషన్ లు వచ్చినా పట్టుపరికిణీలు సరదా పెద్దవాళ్ళకే కాదు అందుకే పిల్లలకు ప్రతి సంవత్సరం పరికిణీలు కొనిస్తారు.ఈ సంప్రదాయ చీరె లంగా,జాకెట్లతో కాళ్ళకు గజ్జలతో నడుముకు వడ్డాణంతో పిల్లలు చూడముచ్చటగా ఉంటారు కూడా. పైగా పట్టు లంగాలే కాదు రకరకాల డిజైన్లు,మిరుమిట్లు గొలిపే వస్త్రాల కలపోతతో చిన్ని చిన్ని డిజైనర్ లంగాలు ఎంబ్రాయిడరీ వర్క్ చేసినవి అంచులకు అద్దాలు కుట్టినవి ఎన్నో రకాల నాణ్యమైన వస్త్ర శ్రేణితో కుట్టిన లెహంగాలతో పాటు పెద్దవాళ్ళ కోసం రూపోందించిన అన్ని […]

పండ్ల టాబ్లెట్స్

ఒక్క సీజన్ లో కొన్ని పండ్లు విరివిరిగా దోరుకుతాయి, ఎన్ని పండ్లలో విలువైన పోషకాలు ఉంటాయి. కానీ అన్ని పండ్లు అందరికీ రుచించవు. కొన్నింటి వాసన నచ్చదు. కొందరికి తినే సమయం చిక్కదు. కానీ పండ్ల,కూరల్లో ఎన్నో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ వేసవి లో చెమట రూపంలో శరీరంలో నీరు బయటికి పోతుంది. ఖనిజాలు వెళ్ళిపోతాయి. జీవక్రియల్లో ఖనిజాలది కీలకపాత్ర. అవి తక్షణం శరీరానికి అందాలంటే పండ్లు తినాలి. అన్నిసమయాల్లో తినే అవకాశం […]

పదేళ్ళుగా వెంటాడుతోంది

ఆలోచిస్తూ ఉంటే అన్ని ఆశ్చర్యంగానే ఉంటాయి. గత పదేళ్ళుగా ఇన్నీ లక్షల మంది అభిమానులు ఇంత చక్కని జీవితం ఇదంతా నాకు దక్కినందుకు అసలు నేనేంచేశాను అనుకొంటూ ఉంటాను అంటోంది తమన్నా. నటన అనేది నా వృత్తి ,నా శక్తి కొద్ది నేను నటించాను. కొన్ని ఫెయిల్యూర్ రుచి చూశాను. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోన్నాను. ఈ ప్రయాణాన్ని నా అభిమానులు , చాలా ప్రేమతో గమనిస్తూ ,అభిమానిస్తూ వచ్చాను. కానీ నేను వాళ్ళ కోసం చేసిందేమీ […]

అతికించే అరలు

ఇల్లు కట్టేప్పుడే గోడలకు అరలు కట్టించేస్తారు. ఇల్లు ఎంత ఆధునికంగా అలంకరించిన ఈ అరలు మాత్రం మార్చే వీలుండదు. హాల్లో చిన్న చిన్న వస్తువులు పెట్టేందుకు వాటికి తగ్గ అరలుంటే బావుండు అనుకొంటాం. ఇటలీకి చెందిన రోండా కంపెనీ మాగ్నటిక్ షెల్ఫ్ లు తయారు చేసింది. ఇవి అంటిస్తే అంటుకుపోయే చిన్న డబ్బాలాంటివి. ఈ మాగ్నటిక్ ఫలకాల ఆయస్కాంత శక్తి చాలా ఎక్కువ . ఈ అరల్లో కాస్త బరువైన వస్తువులు పెట్టిన ఊడి పడిపోవు. ఈ […]

గొరువెచ్చని నీళ్లు ఆరోగ్యం

నీరు బాగా మరిగించి ,ఆ నీరు కాస్త గోరువెచ్చగా అయ్యాక తాగుతూ ఉంటే ఊదర సంబంధమైన రుగ్మతలు ఏవి రావు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఈ కాచిన నీటిలో చల్లని నీరు కలిపి తాగకూడదు. వేడి నీరే కాస్త చల్లారే వరకు ఆగాలి. రోజంతా గొరువెచ్చని నీరు తాగుతూ ఉంటే జీర్ణశక్తి మెరుగు పడుతుంది అంటారు పరిశొధకులు. ఆకలి కలుగుతోంది. కడుపు ఉబ్బరం,దగ్గు, జలుబు ,ఆయసం వంటివి తగ్గిపోతాయి. విటమిన్ సీ అందాలంటే స్పూన్ నిమ్మరసం కలిపి తాగవచ్చు. […]

ఆయుర్ధాయం పెరుగుతుంది

ఆహారంలో పిండి పదార్ధాలు కాస్త తగ్గించి ,కూరగాయాలు ,తృణధాన్యాలు వంటివి తింటే ఆరోగ్యానికి మంచిదని అమెరికాలో జరిపిన ఓ అధ్యయనం చెబుతోంది. 15వేల 400 మంది ఆహారపు అలవాట్ల పై జరిపిన ఆన్ లైన్ సర్వేలతో ఆహారంలో మోస్తారుగా కార్బోహైడ్రేట్స్ తీసేకొంటే మాంసాహారం తీసుకోన్న వారికంటే ఆరోగ్యంగా ఉన్నట్లు రుజువైంది. వీరిలో మరణ అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి. ఈ అధ్యయనంలో పిండి పదార్థాలు తీసుకోవటం వల్ల ఆయుర్దాయం నాలుగేళ్ళకు పైగా పెరిగినట్లు తేలింది.ప్రోటీన్, ఫ్యాట్ ,ఆరోగ్యవంతమైన […]