Wednesday, 05 Aug, 2026
పిల్లలు పెద్దలు అన్న తేడా లేదు. అందరు సెల్ ఫోన్స్ కు అతుక్కుపోయి కనిపిస్తారు. చదువుకునే పిల్లలు కూడా ఇలా సెల్ ఫోన్స్ తో బిజీగా వుండటం వల్ల ఎంతో సమయం వృధా అవుతోందని వాళ్ళు ఎంతో యాంగ్జైటీ లో ఉండటం వల్ల సగటు పాయింట్ గ్రేడ్స్ తగ్గిపోయున్నాయని కెంట్ స్టేట్ విశ్వవిద్యాలయ అధ్యయనాల్లో గుర్తించారు . పిలల్లు సెల్ ఫోన్స్ వాడిన స్థాయిలు వాళ్ళు పరీక్షల్లో తెచ్చుకునే గ్రేడ్స్ మ్యాచ్ చేసి చూసారు . గ్రేడ్స్ సరిగా లేవు . వత్తిడీ అధికంగా కనిపించింది. ఫోన్ ద్వారా నిరంతరం నెట్ వర్క్ కు కనెక్టయి ఉండటం ఆబ్లిగేషన్ అనుకోవటమే ఇందుకు కారణమని అధ్యయనాలు చెప్పాయి. ఈ ఆబ్లిగేషన్ ఇంట్లో కాలేజీలోజిమ్ లో షాపింగ్ మాల్ లో ఎక్కడున్నా వెంటాడుతూ ఉంటుంది. ఇదే యువత పై వత్తిడి తెస్తోంది. అలాగే పని లో వుండే పెద్దలకు ఇదే ఆబ్లిగేషన్. వాళ్ళకీ కాస్తంత రిలాక్స్ గా వుండే అవకాశం లేదు. మానసిక ఆరోగ్యం బావుండాలంటే ఈ సెల్ ఫోన్స్ కు కాస్త దూరంగా ఉండమని అధ్యయనాలు చెపుతున్నాయి .

కాస్త దూరంగా ఉంచండి

మూడేళ్ళ పిల్లలు కూడా అస్తమానం స్మార్ట్ ఫోన్ తోనే ఆడుతుంటారు. ఆ ఆడే ఆటలే లోకంగా ఉంటే వాళ్ళలో ఎమోషనల్ డెవలప్ మెంట్ తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయితే పక్కన ఉంగే పిల్లలతో మాట్లాడటం తగ్గిపోతుంది. సోషలైజ్ కాకపోతే ఎవరితో ఎలా కలిసి పోవాలో వారికి తెలియదని ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. పిల్లలు స్మార్ట్ ఫోన్ ,ల్యాప్ టాప్ తెరలపైన హైటెక్ గేమ్స్ ఆడుతోండటం చూసి తల్లిదండ్రులు సంతోషంగా ఫీలవుతున్నారనీ అది పిల్లల విషయంలో చాలా ప్రమాదం అంటున్నారు. పిల్లలకు షేరింగ్ ,తోటి పిల్లలతో ఆడుకోనే అవకాశాలు కల్పించకుండా స్మార్ట్ ఫోన్ వాళ్ళని మెయిన్ టెయిన్ చేస్తే వాళ్ళలో మానసిక వికాశం ఉండదంటున్నారు.

Leave a Reply