సూర్య కాంతిని అర్ధం చేసుకుని తినాలి

సూర్య కాంతిని అర్ధం చేసుకుని తినాలి

సూర్య కాంతిని అర్ధం చేసుకుని తినాలి

ఆహార వేళలుంటాయి. అంటే మన శరీరానికి అవసరమయ్యే ప్రధాన మైన పోషకాలకు కాంతికీ చీకటితో సంబంధించి వుంది. జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యం సెరోటోనిన్ మెలటోనిన్ సమస్థితి పైన ఆధారపడి ఉంటుంది. పనులు నిద్ర కణ విభజన ఈ రెంటి సమస్థితి పైనే  ఆధారపడి ఉంటాయి. సూర్య కాంతి మన శరీర లయను నియంత్రిస్తున్నాదని అర్ధం చేసుకుంటూ దాని ప్రకారం ఆహారం తీసుకోవాలని మోడ్రన్ అధ్యయనాలు చెపుతున్నాయి. వండిన ఆహారం మధ్యాన్న వేళ సూర్యాస్తమయ వేళ  పూర్తిగా జీర్ణమవుతుంది. అంచేత ఎక్కువ అరుగుదలశక్తి అదనంగా అవసరమైన వండిన ఆహారం మధ్యాన్నం తీసుకుని మిగిలిన సమయంలో తేలికగా అరిగే తాజా పండ్లు మొలకలు గింజలు తినాలి. ప్రతి రోజూ ఉదయాన్నే ఆయా రకాల పండ్లతో మొదలుపెట్టాలంటారు. రాత్రి భోజనం మొలకెత్తిన ధాన్యాలు కూరగాయలతో వుంటే  రాత్రి భోజనం మన శరీర నిర్మాణానికి పనికి వచ్చే కణాల  పెరుగుదలకు పునరుత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. 15 నిముషాలు సూర్య కాంతి శరీరానికి తగలనివ్వటం ఇంకా మంచిది.